E-Paper
Advertisement

Jubilee Hills: ఆలయ నమూనాతో షాపింగ్ మాల్.. ఫుట్ పాత్‌పై ధ్వజస్తంభం, మంటల్లో అంతా బుగ్గి!

Jubilee Hills: ఆలయ నమూనాతో షాపింగ్ మాల్.. ఫుట్ పాత్‌పై ధ్వజస్తంభం, మంటల్లో అంతా బుగ్గి!
Advertisement

Jubilee Hills: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ సమీపంలోని మంగళ గౌరి షోరూమ్‌లో ఒక్కసారిగా అగ్నిప్రమాదం సంభవించి స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. భవనం పై అంతస్తుల నుండి మంటలు భారీగా ఎగసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, షోరూమ్ లోపల మంటలు వేగంగా వ్యాపించడంతో సహాయక చర్యలు సవాలుగా మారాయి.

ఈ ప్రమాద సమయంలో భవనంలో చిక్కుకున్న నలుగురు కార్మికులు ప్రాణాలతో బయటపడటం ఒక అద్భుతం అనే చెప్పాలి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన నర్సమ్మ, జగదీశ్వరి, రాజు, రాము అనే కూలీలు గత మూడు నాలుగు రోజులుగా అక్కడ సిమెంట్ పనులు చేస్తున్నారు. ఉదయం 11:30 గంటల సమయంలో ఒక్కసారిగా పైనుంచి మంటలు కిందకు పడటంతో వారంతా లోపలే చిక్కుకుపోయారు. పొగ కారణంగా ఊపిరి ఆడక, బయటకు వచ్చే దారి తెలియక వారు గడిపిన క్షణాలు అత్యంత భీతావహంగా మారాయి.

Advertisement

మృత్యువు ముంచుకొస్తున్న తరుణంలో వాచ్‌మెన్ సూచనతో వారు పై అంతస్తుకు వెళ్లారు. కానీ అక్కడ కూడా పరిస్థితి విషమంగా ఉండటంతో మళ్లీ కిందకు వచ్చి, ప్రాణ భయంతో కిటికీ అద్దాలను పగులగొట్టారు. ఆ అద్దాల గుండా అతి కష్టమ్మీద బయటకు రావడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. “మేము ప్రాణాలతో బయటపడతామని అస్సలు అనుకోలేదు, కిటికీ అద్దాలు పగలగొట్టడం వల్లే ఈరోజు సజీవంగా ఉన్నాం” అంటూ బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు.

అయితే ఈ ప్రమాదంలో ఆర్థిక నష్టంతో పాటు ఆధ్యాత్మిక అంశాలు కూడా చర్చనీయాంశంగా మారాయి. సదరు వ్యాపార సంస్థ యజమాన్యం తన ప్రచారం కోసం షోరూమ్ ముందు పవిత్రమైన ఆలయ గోపురాలు, ధ్వజస్తంభం నమూనాలను ఏర్పాటు చేసింది. ఫుట్‌పాత్‌ను ఆక్రమించి బహిరంగ ప్రదేశంలో ఇలాంటి ధార్మిక చిహ్నాలను ప్రతిష్టించడంపై స్థానికులు ముందు నుంచే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ అగ్నిప్రమాదంలో ఆలయ గోపురం నమూనా కూడా పూర్తిగా కాలి బూడిదై పోయింది.

Advertisement

Also Read: తెలంగాణలో భూకంపం.. భయందోళనలో జనం..

ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చే పనిలో ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఫుట్‌పాత్‌పై కట్టడాలు నిర్మించడం, భవనంలో సరైన ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు లేకపోవడం వల్లే ఇంతటి ప్రమాదం జరిగిందని స్థానికులు విమర్శిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. బాధితులు క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నప్పటికీ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×