E-Paper
Advertisement

Honda March 2026 Offers: హోండా మార్చి ఆఫర్లు.. ఆ కార్లపై ఏకంగా రూ. 2 లక్షల తగ్గింపు!

Honda March 2026 Offers: హోండా మార్చి ఆఫర్లు.. ఆ కార్లపై ఏకంగా రూ. 2 లక్షల తగ్గింపు!
Advertisement

 Honda Discounts March 2026: హోండా ఇండియా  మార్చి 2026కు సంబంధించి చక్కటి తగ్గింపులను ప్రకటించింది. ముఖ్యంగా మోండా సిటీ, హోండా ఎలివేట్, హోండా అమేజ్‌ కార్లపై అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తోంది. మోడల్‌ను బట్టి, ఈ ఆఫర్లలో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ బెనిఫిట్స్, లాయల్టీ బోనస్ ఉన్నాయి.

హోండా సిటీ: రూ. 1.97 లక్షల వరకు

మార్చి 2026లో హోండా సిటీ e:HEV కారుపై భారీగా తగ్గింపు అందిస్తోంది. ఈ హైబ్రిడ్ సెడాన్‌ ను కొనుగోలు చేసే వినియోగదారులకు రూ. 1.97 లక్షల వరకు తగ్గింపును అందిస్తుంది. ఈ కారు 1.5-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ ట్రెయిన్, e-CVT ఆటోమేటిక్‌ ను  కలిగి ఉంటుంది. హోండా సిటీ హైబ్రిడ్ ధర రూ. 20 లక్షల నుంచి మొదలవుతుంది. పెట్రోల్ సిటీ వేరియంట్ల విషయానికొస్తే, హోండా మార్చిలో రూ. 1.56 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. సిటీ పెట్రోల్ వేరియంట్స్ లో 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. దీనిని 6-స్పీడ్ మాన్యువల్, CVT ఆటోమేటిక్‌తో జత చేయబడి ఉంటుంది. సిటీ పెట్రోల్ ధరలు రూ. 11.95 లక్షల నుంచి ప్రారంభమై గరిష్టంగా రూ. 16.15 లక్షల వరకు ఉంటాయి.

హోండా ఎలివేట్: రూ. 1.81 లక్షల వరకు

Advertisement

ఇక మిడ్ సైజ్ SUV ఎలివేట్ పై మార్చిలో రూ. 1.81 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తుంది. ఎలివేట్ కారు సిటీ మాదిరిగానే 121hp పవర్ ఉత్పత్తి చేసే 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్, మాన్యువల్/CVT గేర్‌ బాక్స్ ను కలిగి ఉంటుంది. అయితే SUVకి హైబ్రిడ్ పవర్‌ ట్రెయిన్ లేదు. ఎలివేట్ ధరలు రూ. 11.6 లక్షల నుంచి రూ. 16.25 లక్షల మధ్య ఉంటాయి.

Read Also: హ్యుందాయ్ మార్చి డిస్కౌంట్స్, ఆ కారుపై ఏకంగా రూ.95 వేల బెనిఫిట్స్!

హోండా అమేజ్: రూ. 68,000 వరకు

Advertisement

హోండా సెకెండ్ జెనరేషన్, థర్డ్ జెనరేషన్ అమేజ్‌ లను ఒకేసారి అమ్ముతుంది. ఈ రెండు కాంపాక్ట్ సెడాన్లను ఆఫర్లతో కొనుగోలు చేసే అవకాశం ఉంది. పాత మోడల్ రూ. 68,000 వరకు ప్రయోజనాలను పొందుతుంది. ప్రస్తుత అమేజ్  రూ. 57,000 వరకు తగ్గింపుతో లభిస్తుంది. రెండూ 5-స్పీడ్ మాన్యువల్, CVT ఆటోమేటిక్‌తో జతచేయబడిన 90hp 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా పవర్ ను పొందుతాయి. ప్రస్తుత అమేజ్ ధర రూ. 7.47 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉండగా, పాత అమేజ్ ధరలు రూ. 6.98 లక్షల నుంచి 7.8 లక్షల వరకు ఉంది.

సో, ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ కార్లను కొనుగోలు చేసేయండి. భారీ తగ్గింపులతో హోండా కారును ఇంటికి తెచ్చేసుకోండి!

Read Also:  బ్రెజ్జాకు పదేళ్లు పూర్తి.. మారుతి సుజుకి ఫస్ట్ కాంపాక్ట్ SUV ఆసక్తికర ప్రయాణం!

Tags

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×