E-Paper
Advertisement

Vijay Rashmika: కొత్తజంట రష్మిక, విజయ్ దేవరకొండ.. ముద్దు పేర్లు ఏమిటో తెలుసా..!

Vijay Rashmika: కొత్తజంట రష్మిక, విజయ్ దేవరకొండ.. ముద్దు పేర్లు ఏమిటో తెలుసా..!
Advertisement

Vijay Rashmika:హైదరాబాద్‌లో ఇటీవల ఘనంగా జరిగిన గద్దర్ అవార్డ్స్ 2026 కార్యక్రమం టాలీవుడ్‌లో పెద్ద హారట్ టాపిక్ గా నిలిచింది. ఈ వేడుకలో రష్మిక మందన్న ఉత్తమ నటి అవార్డు అందుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ఈ ఈవెంట్‌లో మరో ఆసక్తికర విషయం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. అది విజయ్ దేవరకొండ అమ్మ చేసిన సరదా వ్యాఖ్యలు.

పెళ్లి తర్వాత వచ్చిన మొదటి ఉగాది కావడంతో ఈ కార్యక్రమానికి రష్మిక తన అత్తతో కలిసి రావడం ప్రత్యేకంగా కనిపించింది. ఈ సందర్భంలో యాంకర్లు సుమా, ప్రదీప్ ఇద్దరూ రష్మికతో పాటు విజయ్ దేవరకొండ అమ్మను కూడా కొన్ని ప్రశ్నలు అడిగారు.

వాళ్ళిద్దరి ముద్దు పేర్లు ఏమిటంటే..!

Advertisement

ముందుగా మీకు ఇష్టమైన సినిమా ఏది అని అడిగితే, ఆమె క్లాసిక్ మూవీ “సాగర సంగమం” అంటే చాలా ఇష్టం అని చెప్పింది. తరువాత విజయ్, రష్మిక సినిమాల గురించి అడగగా, ఆమె ఎంతో సింపుల్‌గా, ప్రేమగా సమాధానం ఇచ్చింది. రష్మికను “మా రషి”, విజయ్‌ను “మా చిన్నూ” అని పిలుస్తూ మాట్లాడటం అందరినీ ఆకట్టుకుంది.

రష్మిక నటించిన సినిమాల్లో “ది గర్ల్ ఫ్రెండ్” తనకు నచ్చిందని, విజయ్ దేవరకొండ సినిమాల్లో “పెళ్లి చూపులు” చాలా ఇష్టమని చెప్పింది. ఈ నిక్ నేమ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

ఇక ఉగాది పచ్చడి గురించి అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం మరింత హైలైట్ అయింది. ఈసారి రష్మికతో పోటీ పడతారా అని అడగగా, ఆమె నవ్వుతూ “మేమెప్పుడూ పోటీ పడము, ఎప్పుడూ షేర్ చేసుకుంటాం” అని చెప్పింది. ఈ మాటలు అక్కడున్న వారిని మెప్పించాయి.

మొత్తం పైన.. ఈ అవార్డ్స్ వేడుకలో రష్మిక అవార్డు గెలవడం మాత్రమే కాదు, ఆమె కుటుంబానికి దగ్గరైన విధానం కూడా స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ కుటుంబంతో ఆమెకు ఉన్న బంధం మరోసారి అందరికీ కనిపించింది.

ALSO READ: Pawan Kalyan: తెలుగు సినిమా కన్నా బాలీవుడ్ సినిమా మిన్న అంటోన్న స్టార్ హీరోలు.. పవన్ సినిమాపై నిశ్శబ్దం!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×