E-Paper
Advertisement

President Droupadi Murmu: రామలల్లా సన్నిధిలో రాష్ట్రపతి ప్రత్యేక పూజలు.. 150 కిలోల శ్రీరామ యంత్రం ప్రతిష్టాపన!

President Droupadi Murmu: రామలల్లా సన్నిధిలో రాష్ట్రపతి ప్రత్యేక పూజలు.. 150 కిలోల శ్రీరామ యంత్రం ప్రతిష్టాపన!
Advertisement

President Droupadi Murmu: అయోధ్యలోని రామమందిరాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా ఆలయ ప్రాంగణంలో సుమారు 150 కిలోల బరువున్న బంగారు పూత పూసిన శ్రీరామ యంత్రం అనే లోహ పలకను ఆమె ప్రతిష్టించారు. చైత్ర నవరాత్రులు.. హిందూ నూతన సంవత్సరం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ఆధ్యాత్మిక క్రతువుల్లో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మాతా అమృతానందమయి వంటి ప్రముఖుల సమక్షంలో ఈ యంత్రాన్ని రాష్ట్రపతి ప్రతిష్టాపన చేశారు. అనంతరం బాల రాముడికి (రామలల్లా) హారతి ఇచ్చి.. దేశ ప్రజల సుఖశాంతులు.. శ్రేయస్సు కోసం ఆమె ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఈ విశిష్టమైన లోహ పలకను దాదాపు రెండేళ్ల క్రితమే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వైభవంగా ఊరేగింపుగా అయోధ్యకు తీసుకువచ్చారు. అప్పటి నుండి దీనికి ఆలయంలో ప్రతిరోజూ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తున్నారు. చైత్ర నవరాత్రుల శుభవేళలో అత్యంత పవిత్రమైన అభిజిత్ ముహూర్తంలో ఈ యంత్రాన్ని రామమందిరం రెండో అంతస్తులో శాశ్వతంగా ప్రతిష్టించనున్నారు. శ్రీరాముడి దివ్య సన్నిధికి చిహ్నంగా.. భక్తులలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపేలా ఈ యంత్రం నిలుస్తుందని ఆలయ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

ఆలయ ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా ఈ శ్రీరామ యంత్రం విశిష్టతను వివరిస్తూ.. ఇది వేద గణితం ఆధారంగా రూపొందించబడిందని తెలిపారు. సానుకూల ఆధ్యాత్మిక శక్తిని ఉత్పత్తి చేసేలా రూపొందించిన ఈ 150 కిలోల చతురస్రాకార లోహ పలకపై వేద మంత్రాలు.. బీజాక్షరాలను పొందుపరిచారు. కంచి కామకోటి పీఠంలోని శ్రీరామ యంత్రం నమూనా ఆధారంగా స్వామి విజయేంద్ర సరస్వతి మార్గనిర్దేశంలో దీనిని అత్యంత కళాత్మకంగా తీర్చిదిద్దారు.

రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అయోధ్య నగరం మొత్తం భారీ భద్రత ఏర్పాటు చేశారు. సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గౌరవ్ గ్రోవర్ పర్యవేక్షణలో దాదాపు 7,000 మంది పోలీసు సిబ్బందిని ఆలయ సముదాయం.. నగరం అంతటా మోహరించారు. సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను ఉంచి నిఘాను కట్టుదిట్టం చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో పాటు భక్తులు.. స్థానికులు అధికారులకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అయోధ్య రామమందిర నిర్మాణానంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ స్థాయిలో పాల్గొన్న అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం ఇదే కావడం విశేషం.

Advertisement

Read Also: Tirumala: తిరుమలలో మొదటి మెట్టు ఎందుకు ప్రత్యేకమో తెలుసా

Related News

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

Big Stories

Advertisement
×