E-Paper
Advertisement

New Kia Seltos: సరికొత్త కియా సెల్టోస్ వచ్చేసింది, ధర ఎంతో తెలుసా?

New Kia Seltos: సరికొత్త కియా సెల్టోస్ వచ్చేసింది, ధర ఎంతో తెలుసా?
Advertisement

New Kia Seltos 2026: దేశీ మార్కెట్ లోకి కియా ఇండియా కొత్త జనరేషన్ కియా సెల్టోస్‌ను లాంచ్ చేసింది. జనవరి 2, 2026న పరిచయం చేసింది. ఇది సెకండ్ జనరేషన్ మోడల్. కొత్త K3 ప్లాట్‌ ఫారమ్ పై రూపొందింది. డిజైన్, ఇంటీరియర్, ఫీచర్లు పూర్తిగా అప్‌డేట్ అయ్యాయి. పవర్‌ట్రైన్ ఆప్షన్లు మాత్రం గత మోడల్ లో మాదిరిగానే న్నాయి.

కొత్త సెల్టోస్ ధరలు   

⦿ బేస్ వేరియంట్: ధర రూ. 10.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

Advertisement

⦿ టాప్ వేరియంట్ఐ రూ. 19.99 లక్షల వరకు ఉంటుంది.

ఈ కారుకు సంబంధించిన బుకింగ్స్ డిసెంబర్ 2025 నుంచి రూ. 25,000తో ప్రారంభం అయ్యాయి.  డెలివరీలు ఈ నెల నుంచే స్టార్ట్ అవుతాయి.

కొత్త సెల్టోస్ ఇంజిన్ ఆప్షన్లు, స్పెసిఫికేషన్స్

Advertisement

కొత్త సెల్టోస్‌లో మూడు 1.5-లీటర్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. అవేంటంటే..

⦿ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్): ఈ ఇంజిన్ 115 PS  113-115 bhp పవర్ ను కలిగి ఉంటుంది. 144 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ను కలిగి ఉంటుంది.

⦿ టర్బో పెట్రోల్: ఇందులో 160 PS 158-160 bhp పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. 253 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ట్రాన్స్‌ మిషన్ 6 స్పీడ్ iMT లేదంటే 7 స్పీడ్ DCT ఉంటుంది.

⦿ టర్బో డీజిల్: ఈ కారులో 116 PS పవర్ ఉంటుంది. 250 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ లేదంటే 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఉంటుంది.

ఈ కారులో ఎకో, నార్మల్, స్పోర్ట్ మోడ్స్ ఉంటాయి. కొన్ని వేరియంట్లలో స్పో, మడ్, శాండ్ ట్రాక్షన్ మోడ్స్ కూడా ఉంటాయి. త్వరలో పెట్రోల్ హైబ్రిడ్ ఆప్షన్ కూడా యాడ్ కానుంది. వచ్చే ఏడాదిలోగా ఈ ఆప్షన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.  ఇక ఈ కారుకు సంబంధించిన మైలేజ్ ను పరిశీలిస్తే.. పెట్రోల్ మాన్యువల్ 17-18 kmpl, పెట్రోల్ ఆటోమేటిక్ 16-17 kmpl, టర్బో పెట్రోల్ 15-16 kmpl, డీజిల్ మాన్యువల్ 20-21 kmpl, డీజిల్ ఆటోమేటిక్ 18-19 kmpl ఇస్తుంది.

కొత్త సెల్టోస్ కీలక ఫీచర్లు

కొత్త సెల్టోస్ లేటెస్ట్ డిజిటల్ టైగర్ ఫేస్ గ్రిల్, LED హెడ్‌ల్యాంప్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్, కనెక్టెడ్ LED టెయిల్ లైట్స్ ఉంటాయి. ట్రినిటీ పనోరమిక్ డిస్‌ప్లే, డ్యూయల్ పేన్ పనోరమిక్ సన్‌ రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, 8 స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్ ఉంటుంది. లెవల్ 2 ADAS, 6 ఎయిర్‌ బ్యాగ్స్, 360° కెమెరా, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్, ESC, హిల్ అసిస్ట్ ఉంటాయి.

Read Also: చైనా కార్లలో సరికొత్త ఇండికేటర్, ఇక హ్యాపీగా యూటర్న్ తీసుకొవచ్చు!

ఏ కార్లతో పోటీ పడుతుందంటే?

కొత్త సెల్టోస్.. హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్ లాంటి మిడ్ సైజ్ SUVలతో పోటీ పడుతుంది.

Read Also: అన్ కంఫర్టబుల్ ఫ్రంట్ సీట్లు ఉన్న కార్లు ఇవే.. కొనేటప్పుడు కాస్త జాగ్రత్త!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×