పార్టీ పట్ల విధేయత చూపకుండా, చెడ్డ పేరు తీసుకువచ్చేవారిని క్షమించేది లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టంచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష వైసీపీ నేతలు ఏదో రకంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు.వారికి అవకాశం ఇవ్వకూడదని పార్టీ పెద్దలు ఎన్నిమార్లు చెబుతున్నా నేతలు మాత్రం వినిపించుకోవడం లేదని ప్రచారం జరుగుతోంది. కిందిస్థాయి, జిల్లా నేతలు,నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఏ చిన్న పొరపొటు చేసినా అది పార్టీ మొత్తానికి చెడ్డ పేరు తీసుకురావడమే కాకుండా, ప్రజల్లోనూ పార్టీకి మద్దతు తగ్గిపోతుందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఒక్కటే స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. బీజేపీ, జనసేన పార్టీలు పొత్తుగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేసి గెలవడంతో ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. మెజార్టీ సీట్లు చంద్రబాబు పార్టీకే వచ్చినా..కూటమి సర్కారులో మిగతా పార్టీలు సైతం భాగస్వాములే.. వారి తరఫున ఎవరు తప్పుచేసినా మొత్తం కూటమి సర్కారుకే చెడ్డపేరు వస్తుంది. అందుకే సీఎం చంద్రబాబు ముందు నుంచి పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఒకటే చెబుతూ వస్తున్నారు. ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు తీరుస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని సూచిస్తూ వచ్చారు.కానీ, ఇటీవల జరిగిన ఘటనలు మొత్తం కూటమి సర్కారుకే కళంకం తీసుకొచ్చాయి.
జనసేన పార్టీ నేత, రైల్వేకొడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ ఇటీవల ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. బాధిత మహిళ తనను ఎమ్మెల్యే శ్రీధర్ మోసం చేశాడని, పెళ్లిపేరుతో లైంగికంగా వశపరుచుకున్నాడని ఆరోపించారు. కేసు సైతం పెట్టారు.ఇప్పటికీ సదరు బాధితురాలు సోషల్ మీడియా వేదికగా తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆరవ శ్రీధర్ వ్యవహారంపై కేసు నమోదైనా ఇంతవరకూ ఆయనపై చర్యలు తీసుకోలేదని టాక్ వినిపిస్తోంది. ఈ ఘటనపై మానవ హక్కుల కమిషన్ స్పందించినా ఇంతవరకూ చర్యలు లేవు. జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయలేదు. ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు.
Tollywood Actress: పెళ్లి చేసుకొని పెద్ద తప్పు చేశా.. వైవాహిక జీవితం పై నటి సంచలన వ్యాఖ్యలు!
తాజాగా హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ ఫాంహౌజ్‌లో తెలుగుదేశం పార్టీ ఏలూరు ఎంపీ మహేశ్ కుమార్ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడటం రెండు తెలుగు రాష్ట్రంలో సంచలనం రేపింది. ప్రస్తుతం ఆయన స్టేషన్ బెయిల్ మీద ఉన్నారు. ఆయనకు నిర్వహించిన డ్రగ్స్ టెస్టులో కొకైన్ తీసుకున్నట్టు తెలంగాణ ఈగల్ పోలీసులు నిర్దారించారు.దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ వ్యవహారంపై సిట్ విచారణకు ఆదేశించింది. ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సైతం ఇరుక్కున్నారు. అయితే, ఏలూరు ఎంపీ డ్రగ్స్ కేసులో పట్టుబడటంపై సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చాడు కదా అని అవకాశమిస్తే ఇలా చేస్తారా? పార్టీ పరువు తీస్తారా? అని సీఎం మండిపడ్డారు. పార్టీకి చెడ్డపేరు తీసుకువచ్చే వారిని సహించేది లేదని హెచ్చరించారు. మంచి పేరు తెచ్చుకున్నవారే పార్టీకి కావాలని నొక్కి చెప్పారు.