E-Paper
Advertisement

Petrol vs Diesel Car: పెట్రోల్ vs డీజిల్.. ఏది కొంటే మంచిది?

Petrol vs Diesel Car: పెట్రోల్ vs డీజిల్.. ఏది కొంటే మంచిది?
Advertisement

ఈ రోజుల్లో చాలా మంది కుటుంబ ప్రయాణాల కోసం కారు కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. అయితే, కారు కొనే సమయంలో పెట్రోల్ కారు కొనాలా? డీజిల్ కారు కొనాలా? అని ఆలోచిస్తారు. ఇంకా చెప్పాలంటే.. చాలా మందికి ఏ కారు బెస్ట్ అనే విషయంలో అవగాహన ఉండదు. ఏ కారు కొంటే మంచిది? ఏది ఎక్కువ మైలేజ్ ఇస్తుంది? ఏది తక్కువ ధరకు లభిస్తుంది? అనే పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

పెట్రోల్ VS డీజిల్ ఏ కారు బెస్ట్?

వాస్తవానికి పెట్రోల్ కారు, డీజిల్ కార్లలో అనుకూల అంశాలతో పాటు ప్రతికూల అంశాలు కూడా ఉన్నాయి.  పెట్రోల్ కార్లు తక్కువ ఖర్చు, తక్కువ మెయింటెనెన్స్ కారణంగా బాగా పాపులర్ అయ్యాయి. డీజిల్ కార్లు మంచి ఇంధన సామర్థ్యాన్ని అందిస్తున్నాయి. అయితే, BS6  నిబంధనల కారణంగా పెట్రోల్ కార్ల ధరలతో పోల్చితే కాస్త ఎక్కువ ధరను కలిగి ఉంటాయి. పెట్రోల్ కార్లు సిటీ వినియోగానికి అనుకూలంగా ఉంటే, డీజిల్ కార్లు హైవే ప్రయాణాలకు అనుకూలంగా ఉంటాయి. ఏ ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు అనే దాన్ని బట్టి పెట్రోల్, డీజిల్ కార్లను ఎంచుకోవడం మంచిది.

పెట్రోల్ VS డీజిల్ కార్ల మధ్య కీలక తేడాలు

Advertisement

⦿ ధర: పెట్రోల్ కార్లు సాధారణంగా డీజిల్ కార్ల కంటే తక్కువ ధరలో లభిస్తాయి.

⦿ మైలేజ్: పెట్రోల్ కార్లతో పోల్చితే డీజిల్ కార్లు ఇంజిన్లు 20 నుంచి 30 శాతం వరకు మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని అందిస్తాయి.

Advertisement

⦿ మెయింటెనెన్స్ ఖర్చలు: పెట్రోల్ కార్ల మెయింటెనెన్స్ ఖర్చు డీజిల్ కార్లతో పోల్చితే తక్కువగా ఉంటుంది. డీజిల్ కార్ల రిపేర్ ఖర్చులు పెట్రోల్ తో పోల్చితే ఏకంగా 30 నుంచి 50 శాతం వరకు ఎక్కువగా ఉంటాయి.

⦿ పనితీరు: పెట్రోల్ కార్లు వేగవంతమైన యాక్సిలరేషన్ ఇస్తాయి. డీజిల్ కార్లు గరిష్ట టార్క్ ను కలిగి ఉంటాయి.  ఎక్కువ లోడ్ ను సునాయాసంగా తీసుకెళ్తాయి.

⦿ కాలుష్య ప్రభావం: డీజిల్ వాహనాలపై ఢిల్లీ సహా పలు ప్రధాన నగరాల్లో ఆంక్షలు పెరుగుతున్నాయి. పెట్రోల్ వాహనాలు వాహనాలు పర్యావరణానికి తక్కువ స్థాయిలో హాని కలిగిస్తున్నాయి.

⦿  రీసేల్ వాల్యూ: డీజిల్ కార్లు తక్కువగా డిప్రిసియేట్ అవుతాయి. అందుకే, వాటికి పెట్రోల్ కార్లతో పోల్చితే రీసేల్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది.

Read Also: టాటా మోటార్స్ గుడ్ న్యూస్, ఈవీల్లో ఛార్జింగ్ అయిపోతుందనే టెన్షన్ అవసరం లేదు!

పెట్రోల్ vs డీజిల్.. ఏ కారును కొంటే మంచిది?

ప్రయాణ దూరాలను బట్టి ఏ కారు కొంటే మంచిది అనేది ఆధారపడి ఉంటుంది. నెలకు సుమారు 1000 నుంచి 1200 కిలో మీటర్ల వరకు ప్రయాణాలు చేస్తే పెట్రోల్ కారు కొనుగోలు చేయడం మంచిది. అదే నెలకు 1500 పైగా కిలో మీటర్ల ప్రయాణం చేస్తే, ముఖ్యంగా హైవే ప్రయాణాలు ఎక్కువగా చేస్తే డీజిల్ కారు కొనుగోలు చేయడం మంచిది.

Read Also: హోమ్ ఛార్జింగ్ vs పబ్లిక్ ఛార్జింగ్.. ఎలక్ట్రిక్ కారుకు ఏది చీప్ అండ్ బెస్ట్?

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×