E-Paper
Advertisement

Attapur Crime: గంజాయి బ్యాచ్ వీరంగం.. వీపులో దిగబడిన కత్తి, ఇళ్లకు నిప్పు పెట్టే ప్రయత్నం

Attapur Crime: గంజాయి బ్యాచ్ వీరంగం.. వీపులో దిగబడిన కత్తి, ఇళ్లకు నిప్పు పెట్టే ప్రయత్నం
Advertisement

Attapur Crime: హైదరాబాద్‌లోని అత్తాపూర్ పరిధిలో గంజాయి ముఠా ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. కేవలం తమ ఇంటి ముందు గంజాయి తాగవద్దని మందలించినందుకు ఆ ముఠా సభ్యులు రెచ్చిపోయి స్థానికులపై దాడికి దిగారు. మత్తులో ఉన్న వారు విచక్షణ కోల్పోయి ఒక వ్యక్తిపై కత్తితో దాడి చేయగా.. ఆ దాడి తీవ్రతకు కత్తి పిడి విరిగిపోయి, బ్లేడ్ భాగం సదరు వ్యక్తి వీపులోనే దిగబడిపోయింది.

అంతటితో ఆగకుండా.. ఈ గంజాయి బ్యాచ్ స్థానికుల ఇళ్ల తలుపులపై పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించారు. అయితే, స్థానికులు ఐక్యంగా వారిని అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ క్రమంలో నిందితులు అక్కడి నుండి పరారయ్యారు. సమాచారం అందుకున్న అత్తాపూర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్ వాడకంపై కఠినంగా వ్యవహరిస్తున్న తరుణంలో, ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఈ ఘటన అత్తాపూర్ ప్రాంతంలో కలకలం రేపింది.

Also Read: రోజా ‘సెల్ఫ్ గోల్’.. జగన్ పరువు తీస్తున్న మాజీ మంత్రి వ్యాఖ్యలు!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×