E-Paper
Advertisement

Electric SUV Scooter: క్రేజీ ఎలక్ట్రిక్ SUV స్కూటర్.. అదిరిపోయే లుక్, ఆహా అనిపించే ఫీచర్లు!

Electric SUV Scooter: క్రేజీ ఎలక్ట్రిక్ SUV స్కూటర్.. అదిరిపోయే లుక్, ఆహా అనిపించే ఫీచర్లు!
Advertisement

River Indie Electric SUV Scooter: బెంగళూరుకు చెందిన ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ల రంగంలో సరికొత్త అద్భుతాలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి పలు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులోకి రాగా, మరికొన్ని అద్భుతమైన స్కూటర్లు  విడుదల కాబోతున్నాయి. ఇదే సమయంలో బెంగళూరు బేస్డ్ స్టార్టప్ రివర్ మొబిలిటీ కూడా క్రేజీ ఎలక్ట్రిక్ స్కూటర్లను రూపొందిస్తుంది. ఈ కంపెనీ తయారు చేసిన రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను SUV ఆఫ్ స్కూటర్స్ గా పిలుస్తున్నారు. ఇది బాక్సీ డిజైన్, భారీ స్టోరేజ్, హై గ్రౌండ్ క్లియరెన్స్,  ప్రాక్టికల్ ఫీచర్లతో యూనిక్‌గా ఉంటుంది. ప్రస్తుతం Gen 3 వెర్షన్ అందుబాటులో ఉంది.

రివర్ ఇండీ ధర,  వేరియంట్స్

⦿ ఎక్స్-షోరూమ్ ధర: రూ.1.43 లక్షల నుంచి రూ.1.46 లక్షలుగా ఉంటుంది.

Advertisement

⦿ వేరియంట్స్: సింగిల్ వేరియంట్ (STD/Gen 3).

⦿ కలర్స్: 5 ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. (Monsoon Blue, Summer Red, Spring Yellow, Winter White, Storm Grey, బ్లాక్ ట్రిమ్‌ తో డ్యూయల్ టోన్ ను కలిగి ఉంది).

పెర్ఫార్మెన్స్,  స్పెసిఫికేషన్స్

Advertisement

బ్యాటరీ: 4 kWh లిథియం-ఐయాన్ (ఫ్లోర్‌బోర్డ్ కింద)

రేంజ్ (క్లెయిమ్డ్): 161-163 km (IDC సైకిల్), రియల్-వరల్డ్ ~120 km

టాప్ స్పీడ్: 90 kmph

పవర్: 6.7 kW (9 PS), కంటిన్యూస్: 4.5 Kw, టార్క్: 26 Nm

ఛార్జింగ్ టైమ్: 0-80% 5-6 గంటలు, ఫుల్  8 గంటలు

రైడింగ్ మోడ్స్: Eco, Ride, Rush

Read Also: గాల్లో ఎగిరే మోటార్ సైకిల్ వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

కీ ఫీచర్లు,  ప్రత్యేకతలు

స్టోరేజ్: సెగ్మెంట్‌లో బెస్ట్, 43 లీటర్స్ అండర్‌సీట్ + 12 లీటర్స్ ఫ్రంట్ గ్లోవ్‌ బాక్స్ ఉంటుంది.

డిజైన్: బాక్సీ SUV స్టైల్, ట్విన్ స్క్వేర్ LED హెడ్‌ల్యాంప్స్, 14-ఇంచ్ అల్లాయ్ వీల్స్, 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ ను కలిగి ఉంటుంది.

సస్పెన్షన్, బ్రేక్స్: ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్క్, రియర్ ట్విన్ షాక్స్.. ఫ్రంట్, రియర్ డిస్క్ బ్రేక్స్ తో వస్తుంది.

ఇతర ఫీచర్లు: ఫుల్ డిజిటల్ కలర్ TFT డిస్‌ప్లే, రివర్స్ అసిస్ట్, రెజెనరేటివ్ బ్రేకింగ్, 2 USB ఛార్జింగ్ పోర్ట్స్, మొబైల్ యాప్ కనెక్టివిటీ, ఫ్రంట్ ఫుట్‌ పెగ్స్ ఉంటాయి.

సేఫ్టీ, వారంటీ: బెటర్ గ్రిప్ టైర్స్, 8 ఇయర్స్ బ్యాటరీ, మోటార్ వారంటీతో వస్తుంది.

Read Also: ఈ బైక్ హెల్మెట్ ధర రూ.2.3 కోట్లు.. దీని ప్రత్యేకతలు తెలిస్తే మైండ్ బ్లాకే!

రివర్ ఇండీ ప్రత్యేకతలు

సిటీ కమ్యూటింగ్, ఎర్రాండ్స్, లైట్ సబర్బన్ రైడ్స్‌కు పర్ఫెక్ట్ గా ఉంటుంది. భారీ స్టోరేజ్,  రగ్డ్ బిల్డ్ తో వస్తుంది. స్మూత్ రైడ్, గుడ్ పెర్ఫార్మెన్స్, మేడ్ ఇన్ ఇండియా ప్రైడ్.

ఏ బైక్స్ పోటీ అంటే: Ather Rizta, Ola S1 Pro, TVS iQube, Bajaj Chetakతో పోటీ పడుతుంది.

Read Also: వోక్స్‌ వ్యాగన్ నుంచి మైండ్ బ్లోయింగ్ కార్లు, ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×