E-Paper
Advertisement

AP–Telangana Politics: బాబుని టార్గెట్ చేస్తున్న మాజీ సీఎంలు

AP–Telangana Politics: బాబుని టార్గెట్ చేస్తున్న మాజీ సీఎంలు

AP–Telangana Politics: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టార్గెట్‌గా కేసీఆర్, జగన్ వ్యూహాలు పన్నుతున్నారా? రాజకీయంగా మరోసారి చంద్రబాబును ఇరుకున పెట్టేందుకు రెండు రాష్ట్రా ప్రతిపక్ష నేతల యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేశారా? ఇప్పటికే ఏపీలో ప్రజా సమస్యలపై పోరుబాటు పట్టిన జగన్ నానా హడావుడి చేస్తున్నారు. చాలా కాలం తర్వాత బయటకు వచ్చిన కేసీఆర్ కూడా చంద్రబాబు పేరు మర్చిపోలేక పోతున్నారు.కేంద్రంలోని బీజేపీని టార్గెట్‌ చేయడంతో పాటు…చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెడుతున్నన్నారు కేసీఆర్…ఇద్దరు ప్రతిపక్ష నేతల టార్గెట్‌ చంద్రబాబే కావడం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది.

కేసీఆర్, జగన్‌ల మధ్య సన్నిహిత సంబంధాలు

జగన్, కేసీఆర్ మధ్య 2019 – 2023 సీజన్లో సన్నిహిత సంబంధాలు నడిచాయి… అధికారంలో ఉన్న సమయంలో ఇద్ద మధ్య ఉన్న అవగాహనతో పెద్దగా రాజకీయ అంశాలు తెరపైకి రాని పరస్ధితి ఉండేది… రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల విషయంలోను పెద్దగా విమర్శలు చేసుకున్న సందర్భాలు కూడా లేవు.. ఉమ్మడి రాష్ట్రంలోని పరిష్కారం కానీ అంశాలు కానీ, నీటి పంచాయతీలు కానీ, ప్రాజెక్టుల విషయంలోను కానీ….అటు వైసీపీ నేతలు కానీ….ఇటు బీఆర్ఎస్‌ నేతలు కానీ ఎప్పుడు …అనాటి ప్రభుత్వాలకు ఇబ్బందులు రాకుండా వ్యవహారించారనేది విశ్లేషకుల మాట.

2023లో ఓటమితో బీఆర్ఎస్ పదేళ్ల పాలనకు తెర

2023లో తెలంగాణలో కేసీఆర్ ఓడిపోవడంతో బీఆర్ఎస్ పదేళ్ల పాలనకు తెరపడింది… మరుసటి సంవత్సరం జరిగిన ఎన్నికల్లో అటు ఏపీలో వైసీపీ పాలనకు ప్రజలు చెక్ పెట్టారు … దీంతో రెండు పార్టీలు అధికారం కొల్పొయి….ప్రతిపక్షానికి పరిమితమయ్యాయి.. బీఆర్ఎస్‌కు కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా అయినా దక్కింది. కేవలం 11 సీట్లు గెలిచిన వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు

చంద్రబాబు టార్గెట్‌గా కేసీఆర్, జగన్ వ్యూహాలు

ఆ క్రమంలో చంద్రబాబు టార్గెట్‌గా కేసీఆర్, జగన్ వ్యూహాలకు పదును పెడుతున్నారంట. రాజకీయంగా మరోసారి చంద్రబాబును ఇరుకున పెట్టేందుకు ఇరువురు ప్రతిపక్ష నేతలు కార్యచరణ మొదలుపెట్టారంటున్నారు. ఇప్పటికే ఏపీలో ప్రజా సమస్యలపై పోరుబాటు పట్టిన జగన్, చాలా కాలం తర్వాత బయటకు వచ్చిన కేసీఆర్ కూడా చంద్రబాబును విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. కేంద్రంలోని బీజేపీని టార్గెట్‌ చేయడంతో పాటుగా…చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు కేసీఆర్… ఇద్దరు ప్రతిపక్ష నేతల టార్గెట్‌ చంద్రబాబే కావడం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది

సీఎం చంద్రబాబుపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చిన కేసీఆర్
ఏపీ సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంవోయూలకు హైప్ క్రియేట్ చేయడంలో చంద్రబాబు ఆద్యుడని విమర్శించారు. గతంలో విశాఖలో జరిగిన సీఐఐ సదస్సులో లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు అంటూ హంగామా చేశారని.. ఎంవోయూలపై సంతకాలు చేసింది స్టార్ హోటల్స్‌లోని వంటమనుషులు, సప్లై చేసేవాళ్లంటూ కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. అప్పటి ఎంవోయూలతో ఏపీకి కనీసం రూ.10 వేలకోట్లు పెట్టుబడులు కూడా రాలేదని విమర్శించారు.

రేవంత్‌పై విమర్శలు గుప్పించిన కేసీఆర్

కేసీఆర్ తెలంగాణలోని రేవంత్ సర్కారు మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇదే క్రమంలో చంద్రబాబుపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచి.. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ సీఎంగా చంద్రబాబు పనిచేసినప్పటి సంగతులపైనా కేసీఆర్ విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలోనే 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. విశాఖలో జరిగిన సీఐఐ సదస్సులో కుదిరిన ఎంవోయూలపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఉమ్మడి రాజకీయ శత్రువుగా చంద్రబాబు టార్గెట్

అధికారంలో కొల్పోయిన వైసీపీ, బీఆర్ఎస్‌ ఉమ్మడి రాజకీయ శత్రువుగా చంద్రబాబును టార్గెట్ చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. అటునుంచి జగన్….ఇటు నుంచి కేసీఆర్….చంద్రబాబును రాజకీయంగా ఇరుకునుపెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారనే చర్చ నడుస్తుందట. అందుకు కేసీఆర్ వ్యాఖ్యలను ఉదహరణగా చూపిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

Story By Ramireddy, Big Tv 

Related News

Iran Conflict: ఇజ్రాయెల్‌తో రాజీ.. ఇరాన్‌తో రాజకీయం.. ట్రంప్ ఆడుతున్న ఇంటర్నేషనల్ గేమ్ ఇదే!

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

Big Stories

×