E-Paper
Advertisement

Rivian Electric SUV: రివియన్ నుంచి ఆర్2 ఎలక్ట్రిక్ కారు, ఒకే ఛార్జ్ తో అన్ని కిలో మీటర్లు వెళ్తుందా?

Rivian Electric SUV: రివియన్ నుంచి ఆర్2 ఎలక్ట్రిక్ కారు, ఒకే ఛార్జ్ తో అన్ని కిలో మీటర్లు వెళ్తుందా?

Rivian R2 Electric SUV:ఎలక్ట్రిక్ కారు మార్కెట్ లోకి మరో క్రేజీ కారు అడుగు పెట్టబోతోంది. రివియన్ ఆర్2 (Rivian R2) పేరుతో విడుదల కాబోతోంది.  2026 ఫస్ట్ క్వార్టర్ లో మార్కెట్ లోకి రాబోతోంది. ఈ కారు ధర సుమారు $45,000 (భారత్ కరెన్సీలో సుమారు రూ. 37 లక్షలు) ప్రారంభ ధరతో రానుంది. ఈ 5 సీటర్ కారు కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా మార్కెట్ కు పరిచయం కాబోతోంది. ఈ కారు ఒకేసారి ఛార్జ్ చేస్తే 300 మైళ్లకు పైగా అంటే సుమారు 480+ కిలో మీటర్ల రేంజ్ ను అందిస్తుంది. సింగిల్, డ్యూయల్, ట్రై మోటర్ వేరియంట్లలో లభిస్తుంది. ఈ కారు 3.6 సెకన్లలో 0 నుంచి 60 మైళ్ల(96 కిమీ) వేగాన్ని అందుకుంటుంది.

Rivian R2 ఎలక్ట్రిక్ కారు గురించి..     

⦿ డిజైన్: ఇది రివియన్ R1S చిన్న వెర్షన్ గా మార్కెట్ లోకి రానుంది. చంకీ, రగ్గడ్ లుక్‌ తో ఆకట్టుకుంటుంది. ఈ కారు 19, 20, 21 ఇంచుల టైర్ల ఆప్షన్లతో అందుబాటులోకి రానుంది. ఈ కారు కొలతల విషయానికొస్తే, R2 పొడవు 4,714 mm, వెడల్పు 1,905 mm, ఎత్తు 1,699 mm , 2,936 mm వీల్‌బేస్‌ని కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్ SUV 249 mm వరకు గ్రౌండ్ క్లియరెన్స్‌ ను కూడా అందిస్తుంది.

⦿ బ్యాటరీ, రేంజ్: ఈ కారు ఒకే ఛార్జ్ తో 300 మైళ్లకు పైగా (480+ కి.మీ) రేంజ్ అందిస్తుంది. ఈ కారు కేవలం 3.6 సెకన్లలో 0-60 mph (96 kmph) వేగాన్ని అందుకుంటుంది. 30 నిమిషాల్లోనే 0-80 శాతం వరకు ఛార్జింగ్ అవుతుంది.

Read Also:  ఒకే ఛార్జ్ తో 850 కిమీ ప్రయాణం, దేశంలో లాంగెస్ట్ రేంజ్ ఎలక్ట్రిక్ కారు ఇదే!

⦿ ఇంటీరియర్, ఫీచర్లు: ఈ కారుఉ రెండు గ్లోవ్ బాక్స్‌ లు ఉంటాయి. పెద్ద ఇన్ఫోటైన్‌ మెంట్ స్క్రీన్, చిన్న డ్రైవర్ డిస్‌ ప్లే ఉంటుంది.సీట్లు పూర్తిగా ఫ్లాట్‌ గా ఫోల్డ్ అవుతాయి. కాంపింగ్ కోసం చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. వెనుక గ్లాస్ విండో పూర్తిగా లిఫ్ట్‌ గేట్‌ లోకి పడిపోతుంది.

⦿ ఛార్జింగ్, టెక్నాలజీ: NACS ఛార్జింగ్ పోర్ట్ (టెస్లా సూపర్ ఛార్జర్లకు సపోర్ట్), వెహికల్ టు హోమ్ (V2H), వెహికల్-టు-లోడ్ (V2L) సామర్థ్యాలను కలిగి ఉంటుంది.

Read Also: విన్ ఫాస్ట్ నుంచి క్రేజీ ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

⦿ విడుదల ఎప్పుడంటే?: 2026 ఫస్ట్ క్వార్టర్ లో యూఎస్ మార్కెట్లోకి విడుదల కానుంది. ఆ తర్వాత ఐరోపాలో ఈ కారు రిలీజ్ కానుంది.

⦿ రివియన్ R2 ప్రధానంగా టెస్లా మోడల్ Y (Tesla Model Y)తో పోటీ పడుతుంది.

Read Also: కళ్లు చెదిరి లుక్, అదిరిపోయే ఇంజిన్ పర్ఫార్మెన్స్.. మార్కెట్ లోకి ఎంజీ మెజెస్టర్‌!

Related News

కొత్త కారు కంటే పాత SUVలకే ఎక్కువ క్రేజ్.. భారత మార్కెట్లో కొత్త ట్రెండ్!

జూపిటర్ CNG To అపాచీ RR 450.. టీవీఎస్ నుంచి రాబోతున్న క్రేజీ మోడల్స్ ఇవే!

స్పీడ్‌ తో పాటు సేఫ్టీ కూడా కావాలా? అయితే ఈ కారు మీ కోసమే!

ఇది స్కూటరా? లేక టూరింగ్ మెషీనా? ప్రత్యేకతలు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

సిటీ రోడ్లకు పర్ఫెక్ట్ ఆటోమేటిక్ SUVలు ఇవే.. కొనేముందు ఈ లిస్ట్ చూడండి!

246 కి.మీ రేంజ్‌ తో కొత్త సిట్రోయెన్ eC3 ఫేస్‌లిఫ్ట్.. ఫీచర్లు చూస్తే అదిరిపోవాల్సిందే!

టాటా ఈవీలకు చైనా టెక్నాలజీ.. ఇండియన్ ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్‌ షేకవ్వక తప్పదా?

భారత ఆటో రంగంలో సరికొత్త అధ్యాయం.. ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాగన్ ఆర్ విడుదల!

Big Stories

×