E-Paper
Advertisement

Bhatti Vikramarka: కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపు!

Bhatti Vikramarka: కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపు!
Advertisement

Bhatti Vikramarka:  రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రజాస్వామ్య పండుగ లో విజ్ఞులైన తెలంగాణ ప్రజలు ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)  మల్లు అన్నారు.  మధిర పట్టణంలోని తొమ్మిదవ వార్డులో తన ఓటు హక్క వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రపంచీకరణ తరువాత గ్రామాలు పట్టణాలుగా రూపాంతరం చెందుతున్నాయి ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ప్రజా ప్రభుత్వం పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతుందని అన్నారు.

ఎకానమీ విభాగాలుగా ప్రణాళికలు సిద్ధం  

2047 కల్లా 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా రాష్ట్రాన్ని తీర్చిదిదెందుకు క్యూర్ ప్యూర్, రేర్ కోర్ అర్బన్, ఫెరి అర్బన్, రూరల్ అగ్రికల్చర్ ఎకానమీ విభాగాలుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు పోతున్నామని తెలిపారు. మిశ్రమలు విద్య వైద్యం మౌలిక వసతుల మేలు కలయిక ఈ ప్రణాళికలో ఉంటుందని తెలిపారు. ఎయిర్ ఇండెక్స్ సూచిక 250 దాటుతుంది ఢిల్లీ కలకత్తా వంటి నగరాల్లో నివసించడమే కష్టం అవుతుంది ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని గాలి నాణ్యతను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. రిజిస్ట్రేషన్లలో ఆదాయం కోల్పోతున్నప్పటికీ బ్యాటరీ వివాహనాలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.

Advertisement

Also Read: Bharat Bandh: ప్రజలకు అలర్ట్.. గురువారం భారత్ బంద్.. ఆ రంగాలపై ప్రభావం, తెరిచి ఉండేవి

ఆక్రమణదారుల నుంచి విముక్తి కల్పించి పార్కులు

పట్టణాల్లో మురుగునీటిని శుభ్రం చేసేందుకు పెద్ద సంఖ్యలో ఎస్టిపిలను నిర్మాణం చేస్తున్నామన్నారు. చెరువుల ను ఆక్రమణదారుల నుంచి విముక్తి కల్పించి పార్కులు, చెరువులను టూరిజం ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. ఉత్పత్తికి ప్రధానమైన విద్యుత్తు సరఫరాలో రెప్పపాటు అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తున్నామని, పేద కుటుంబాలకు ఆసరాగా ఉండేందుకు ₹200 యూనిట్ల వరకు విద్యుత్తు ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. మా ప్రభుత్వం వచ్చాక 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని, గ్రామీణ ప్రాంతాల యువత పోటీ పరీక్షల కోసం హైదరాబాద్ వెళ్లకుండా నియోజకవర్గ కేంద్రాల్లోని ఆన్లైన్లో ఉచితంగా శిక్షణ పొందేందుకు అంబేద్కర్ నాలెడ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని వ్యాఖ్యానించారు.

స్కిల్స్ ఉంటేనే ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు

Advertisement

ఈ కేంద్రాల్లో దేశంలోని ప్రముఖ లెక్చరర్ల ద్వారా శిక్షణ ఇప్పిస్తామని అన్నారు. స్కిల్స్ ఉంటేనే ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు లభిస్తాయి అందుకే నియోజకవర్గ కేంద్రాల్లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు నెలకొల్పామని తెలిపారు. పేద బిడ్డలకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని ఒక్కో పాఠశాలను 25 ఎకరాల్లో 200 కోట్లతో అన్ని నియోజకవర్గాల్లో నిర్మిస్తున్నామని అన్నారు . నిన్ను లేని పేదలకు 5 లక్షల రూపాయలతో ఇంద్ర మా ఇల్లు నిర్మిస్తున్నామని అన్నారు.

Also Read:Telangana Municipal Election-2026: మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు 

Related News

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Big Stories

Advertisement
×