E-Paper
Advertisement

Royal Enfield Classic 350 vs Yezdi Roadster: రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 vs యెజ్డి రోడ్‌స్టర్, వీటిలో ఏది బెస్ట్ అంటే?

Royal Enfield Classic 350 vs Yezdi Roadster: రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 vs యెజ్డి రోడ్‌స్టర్, వీటిలో ఏది బెస్ట్ అంటే?
Advertisement

Royal Enfield Classic 350 vs Yezdi Roadster Comparison:  రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, యెజ్డి రోడ్‌ స్టర్ డిఫరెంట్ రైడింగ్ స్టైల్ ను కలిగి ఉంటాయి. క్లాసిక్ 350 పవర్ ఫుల్ ఇంజిన్ తో పాటు మంచి మైలేజీని ఇస్తుంది. రిలాక్స్డ్, రెట్రో, కంఫర్టబుల్ రైడ్‌ను అందిస్తుంది. అటు యెజ్డి రోడ్‌స్టర్ హైస్పీడ్, క్విక్ యాక్సిలేషన్, పవర్ ఫుల్, పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ మోడ్రన్ క్రూయిజర్ గా గుర్తింపు తెచ్చుకుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, యెజ్డి రోడ్‌స్టర్ మధ్య తేడాలు

⦿ ఇంజిన్,  పనితీరు: రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 349cc, ఎయిర్ ఆయిల్ కూల్డ్, 20.2 PS ఇంజన్ ను కలిగి ఉంటుంది. యెజ్డి రోడ్‌ స్టర్  334cc, లిక్విడ్ కూల్డ్, 29.1 PS  ఇంజిన్ ను కలిగి ఉంటుంది. క్లాసిక్ 350తో పోల్చితే, యెడ్జి రోడ్ స్టర్ మరింత పవర్ ఫుల్, ఫాస్టర్ పర్ఫార్మెన్స్ ను కలిగి ఉంటుంది.

Advertisement

⦿ కంఫర్ట్, రైడ్ క్వాలిటీ: క్లాసిక్ 350 మెత్తటి, సౌకర్యవంతమైన సీటును కలిగి ఉంటుంది. ఇది సుదూర, రిలాక్స్డ్ క్రూజింగ్‌కు మెరుగ్గా ఉంటుంది. రోడ్‌ స్టర్ మరింత అగ్రెసివ్ గా ఉంటుంది. కొద్దిగా వెనుకకు అమర్చబడిన ఫుట్‌ పెగ్ పొజిషన్‌ను కలిగి ఉంది. ఇది లాంగ్ రేంజ్ రైడింగ్ కు తక్కువ సౌకర్యంగా ఉన్నప్పటికీ, ఆహ్లాదకరమైన రైడింగ్‌ అనుభవాన్ని అందిస్తుంది.

Read Also: 125: హీరో డెస్టినీ ప్రైమ్ vs సుజుకి యాక్సెస్ 125.. ఏది బెస్ట్ అంటే?

Advertisement

⦿ డిజైన్, వైబ్: క్లాసిక్ 350 ఐకానిక్, రెట్రో, పాత కాలం  శైలిని కలిగి ఉంటుంది. రోడ్‌ స్టర్ LED లైట్లు, బార్ ఎండ్ మిర్రర్లు,  డిజిటల్ కన్సోల్ లాంటి లేటెస్ట్, స్పోర్టీ లుక్ ను కలిగి ఉంటుంది.

⦿ ధర: క్లాసిక్ 350 తక్కువ ధరను కలిగి ఉంటుంది. దీని ధర రూ. 1.82 లక్షల నుంచి రూ. 2.18 లక్షల వరకు ఉంటుంది.  యెజ్డి రోడ్‌స్టర్ ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది. దీని ధర రూ. 1.95 – 2.10 లక్షల వరకు ఉంటుంది.

⦿ మైలేజ్: క్లాసిక్ 350 లీటర్ పెట్రోల్ కు 35−41 కిలో మీటర్ల మైలేజ్ అందిస్తుంది. రోడ్‌స్టర్ కేవలం 29 నుంచి 30 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇక రెండు బైక్‌లు ఒకే లాంటి కెర్బ్ బరువును కలిగి ఉంటాయి. సుమారు 194-195 కిలోలు ఉంటాయి.

Read Also: యమహా R15 vs యమహా R15S.. రెండింటిలో తేడాలు ఇవే!

ఏ బైక్ ఎవరికి అనుకూలంగా ఉంటుందంటే? 

ట్రెడిషనల్, కంఫర్టబుల్, ఫ్యుయెల్ ఎఫిషియెంట్ డైలీ కమ్యూట్ గా ఉపయోగించుకోవడం కోసం రాయల్ ఎన్‌ ఫీల్డ్ క్లాసిక్ 350ని కొనుగోలు చేయడం మంచిది. మోడ్రన్, పంచీ, ఫాస్టర్ బైక్, వేగవంతమైన హైవే రైడింగ్ కు అనుకూలంగా ఉండే బైక్ కావాలనుకునే వారికి యెజ్డి రోడ్‌స్టర్‌ బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఈ రెండు బైక్స్ లో మీకు ఏది నచ్చిందో చెప్పండి!

Read Also:  హోండా డియో 125 X-ఎడిషన్ లాంచ్, ఫీచర్లు అదుర్స్ అంతే!

Related News

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

Big Stories

Advertisement
×