Meenakshi:ప్రముఖ హీరోయిన్ మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అయితే ఇప్పుడు మరోసారి సంక్రాంతిని టార్గెట్గా చేసుకుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే 2026 సంక్రాంతి రేస్ లో టాలీవుడ్ హీరోలతో పాటు హీరోయిన్ల మధ్య కూడా గట్టి పోటీ నెలకొంది. సీనియర్ హీరోయిన్ నయనతార నుంచీ యంగ్ బ్యూటీ శ్రీ లీల వరకు పలువురు హీరోయిన్లు సంక్రాంతికి తమ సినిమాలతో వస్తుండగా.. మరోసారి సంక్రాంతి సెంటిమెంట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మీనాక్షి చౌదరి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది.
నిజానికి గత రెండు సంవత్సరాలుగా సంక్రాంతి బాక్స్ ఆఫీస్ ను టార్గెట్ గా చేసుకొని సినిమాలు రిలీజ్ చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్న మీనాక్షి చౌదరి.. ఇప్పుడు మరోసారి సంక్రాంతి సెంటిమెంట్ గా బరిలోకి దిగుతోంది. 2024 సంక్రాంతికి మహేష్ బాబు (Mahesh Babu) తో ‘గుంటూరు కారం’ సినిమా చేసిన ఈమె.. 2025 సంక్రాంతికి వెంకటేష్ (Venkatesh)తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అలా వరుసగా విజయాలు అందుకున్న ఈమె.m ఇప్పుడు హ్యాట్రిక్ పై కన్నేసిందని చెప్పవచ్చు. అయితే ఈసారి ఒకటి కాదు ఏకంగా రెండు చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది.
అలా వచ్చే సంక్రాంతికి నవీన్ పోలిశెట్టి(Naveen PoliShetty) తో ‘అనగనగా ఒక రాజు’ సినిమాలో నటిస్తోంది. అలాగే ప్రస్తుతం నాగచైతన్య(Naga Chaitanya) తో ‘వృషకర్మ’ అనే సినిమాలో కూడా కీలకపాత్ర పోషిస్తుంది. ఈ రెండు చిత్రాలు కూడా ఈమె క్రేజ్ ను మరింత పెంచే అవకాశాలు ఉన్నాయని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఒకవేళ ఈ సినిమా కూడా మంచి విజయం అందుకుందంటే.. సంక్రాంతి సెంటిమెంటు మీనాక్షికి బాగా వర్కౌట్ అయింది అని చెప్పవచ్చు. ఏది ఏమైనా సంక్రాంతి సెంటిమెంటుతో మళ్ళీ బరిలోకి దిగుతున్న మీనాక్షికి ఈ పొంగల్ ఏ విధంగా కలిసొస్తుందో చూడాలి
ఇదిలా ఉండగా మరొకవైపు వచ్చే సంక్రాంతి టార్గెట్ గా నయనతార, నిధి అగర్వాల్, పూజా హెగ్డే, శ్రీ లీలా వంటి స్టార్ హీరోయిన్లు పోటీ పడుతున్నా.. సంక్రాంతి సెంటిమెంట్ పరంగా మీనాక్షి ముందంజలో ఉందనే అభిప్రాయం బలపడుతోంది..మరి ఈ సంక్రాంతిని ఆమె ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి
మీనాక్షి విషయానికి వస్తే.. ఇచ్చట వాహనములు నిలపరాదు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె.. అడవి శేష్ హీరోగా తెరకెక్కిన హిట్ 2 సినిమాలో అవకాశం లభించి మరో సూపర్ హిట్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాతో ట్రాక్ లోకి వచ్చిన ఈమె ఆ తర్వాత వరుసగా ఆఫర్లు అందుకుంది. అలా వచ్చిన గుంటూరు కారం, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం ఈ సినిమాలన్నీ కూడా ఈమెకు మంచి విజయాలను అందించాయి.
ALSO READ:Naa Anveshana: మరో వీడియోతో రెచ్చిపోయిన నా అన్వేషణ.. ఈసారి దెబ్బ గట్టిగానే తగిలేలా ఉందే!