E-Paper
Advertisement

Top 5 Selling Bikes of 2025: ఈ ఏడాది అమ్మకాల్లో దూసుకెళ్లిన టాప్ 5 బైక్స్ ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

Top 5 Selling Bikes of 2025: ఈ ఏడాది అమ్మకాల్లో దూసుకెళ్లిన టాప్ 5 బైక్స్ ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?
Advertisement

2025లో భారత్ లో ఆటో మోబైల్ రంగంతో పాటు టూ వీలర్ ఇండస్ట్రీ మంచి దూకుడు కనబరిచింది. ఆయా కంపెనీలకు చెందిన పలు బైకులు అమ్మకాల్లో దూసుకెళ్లాయి. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 బైక్‌లు కమ్యూటర్ సెగ్మెంట్‌ లోనే ఆధిపత్యం కొనసాగించాయి. SIAM డేటా ప్రకారం.. ఎక్కువ మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్, సరసమైన ధరలు ఈ మోడల్స్‌ ను బాగా పాపులర్ చేశాయి.

2025లో టాప్ 5 బెస్ట్ సెల్లింగ్ బైక్‌లు   

 

⦿ Hero Splendor Plus

Advertisement

2025లో దేశంలో అత్యధిక అమ్మకాలు సాధించిన బైక్ ఇది.  జనవరి నుంచి నవంబర్ వరకు 30.76 లక్షల యూనిట్లు సేల్ అయ్యాయి. 2024తో పోల్చితే 1.4% అమ్మకాలు తగ్గాయి. అయినప్పటికీ, నెంబర్ 1 గానే కొనసాగుతోంది. ఎక్కువ మైలేజ్ (70+ kmpl), బుల్లెట్‌ ప్రూఫ్ రిలయబిలిటీ,  మంచి సర్వీస్ నెట్వర్క్ కారణంగా భారత్ లో నెంబర్ వన్ గా కొనసాగుతోంది.

⦿ Honda Shine 125

రెండవ స్థానంలో ఈ బైక్ నిలిచింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 15.94 లక్షల యూనిట్లు సేల్ అయ్యాయి. 2024తో పోల్చితే 7.83% అమ్మకాలు పెరిగాయి. స్మూత్ 125cc ఇంజన్, మంచి కంఫర్ట్, 65+ kmpl మైలేజ్ వినియగదారులను ఆకట్టుకున్నాయి. బెస్ట్ సెల్లింగ్ 125cc బైక్ గా నిలిచేలా చేశాయి.

⦿ Hero HF Deluxe

Advertisement

ఈ బైక్ అమ్మకాల్లో మూడో స్థానాన్ని సంపాదించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 10 లక్షలకు పైగా యూనిట్లను అమ్మింది.  2024తో పోల్చితే అమ్మకాల్లో పెద్దగా తేడా లేదు. స్ప్లెండర్‌ తో సమాన ప్లాట్‌ ఫాంను కొనసాగిస్తోంది. స్ప్లెండర్‌కు సమాన ఇంజన్, మరింత సరసమైన ధర, ఎక్కువ మైలేజ్ అమ్మకాల్లో దూసుకెళ్లేలా చేశాయి.

Read Also: ఒడియమ్మ బంటీ.. కార్లపై ఆఫర్లే ఆఫర్లు, ఏకంగా రూ.10 లక్షల రాయితీ!

⦿ Bajaj Pulsar 125cc Range  

ఈ బైక్ అమ్మకాల్లో నాలుగో స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు సుమారు 7.36 లక్షల యూనిట్లు అమ్మింది. 2024తో పోల్చితే ఈ బైక్స్ అమ్మకాలు -5.7%  తగ్గాయి. అయినప్పటికీ టాప్ 5లో నిలిచింది. స్పోర్టీ లుక్, మంచి పెర్ఫార్మెన్స్, మైలేజ్ బ్యాలెన్స్ కారణంగా బాగా అమ్మకాలు జరుపుకుంది.

Read Also: క్రాష్ టెస్ట్ లో దుమ్మురేపిన టయోటా హిలక్స్, ఏకంగా ఎన్ని పాయింట్స్ సాధించిందంటే..

⦿ TVS Apache 150-200cc Range

ఈ బైక్ అమ్మకాల్లో ఐదవ స్థానంలె నిలిచింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 4.99 లక్షల యూనిట్లు అమ్మింది. స్పోర్టీ 125-160cc సెగ్మెంట్ మంచి సత్తా చాటింది. 2024తో పోల్చితే ఏకంగా+22.11% గ్రోత్ రేట్ సాధించింది. యూత్‌కు ఫేవరెట్, అగ్రెసివ్ డిజైన్, ఫీచర్స్ కారణంగా మంచి ఆదరణ దక్కించుకుంది.

ఈ ఏడాది టూవీలర్ మార్కెట్ ను కమ్యూటర్ బైక్‌లు (100-125cc) డామినేట్ చేశాయి. మైలేజ్, రిలయబిలిటీ  కారణంగా దూకుడు కొనసాగిస్తున్నాయి, డిసెంబర్ డేటా ఇంకా రాలేదు. కానీ, ఈ ట్రెండ్ మారే అవకాశం చాలా తక్కువగా ఉంది.

Read Also: దేశీ మార్కెట్లో నెక్సాన్ ఈవీ దూకుడు, అమ్మకాల్లో సరికొత్త రికార్డు!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×