Best Electric Scooter in 2026: భారత్ లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా సిటీ ప్రయాణాల కోసం వీటిని ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటున్నారు. అయితే, స్కూటర్ కొనుగోలు చేసే ముందు చాలామంది చూసేది బ్యాటరీ రేంజ్. ఒకసారి ఛార్జ్ చేస్తే ఎంత దూరం ప్రయాణిస్తుందనే విషయానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం భారత మార్కెట్లో మంచి రేంజ్, ఆధునిక ఫీచర్లు, పనితీరుతో అందుబాటులో ఉన్న టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి తెలుసుకుందాం.
బజాజ్ చేతక్ C2501 రోజువారీ సిటీ ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. సింపుల్ డిజైన్, ఈజీ హ్యాండ్లింగ్, సౌకర్యవంతమైన సీటింగ్ ఈ స్కూటర్ ప్రత్యేకతలు. ట్రాఫిక్ లో ఈజీగా నడిపే అవకాశం ఉంటుంది. ఇది ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 113 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.96,504.
దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో TVS iQube ఒకటి. కుటుంబ అవసరాలకు అనుకూలంగా ఉండే సీటు, పెద్ద స్టోరేజ్ స్పేస్ ఉన్నాయి. వేరియంట్ ను బట్టి బ్యాటరీ సామర్థ్యం మారుతుంది. దీంతో IDC ప్రకారం 94 కిలోమీటర్ల నుంచి 212 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుంది. ధర రూ.1.15 లక్షల నుంచి రూ.1.71 లక్షల వరకు ఉంటుంది.
కుటుంబ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని ఏథర్ రూపొందించిన స్కూటర్ రిజ్టా. మంచి సీటు, పెద్ద అండర్ సీట్ స్టోరేజ్, సౌకర్యవంతమైన రైడింగ్ ఆకట్టుకుంటాయి. బ్యాటరీ వేరియంట్‌ను బట్టి 123 నుంచి 159 కిలోమీటర్ల వరకు రేంజ్ లభిస్తుంది. ధర రూ.1.15 లక్షల నుంచి రూ.1.74 లక్షల వరకు ఉంది.
హోండా కూడా యాక్టివా e:తో ఎలక్ట్రిక్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇందులో 1.5 kWh సామర్థ్యం కలిగిన రెండు స్వాపబుల్ బ్యాటరీలు ఉన్నాయి. పూర్తి ఛార్జ్ పై 102 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. బ్యాటరీ మార్చుకునే సదుపాయం ఉండటం దీని ప్రత్యేకత. ధర రూ.1.19 లక్షల నుంచి రూ.1.52 లక్షల వరకు ఉంది.
మంచి పెర్ఫార్మెన్స్ కోరుకునే రైడర్ల కోసం రూపొందించిన స్కూటర్ ఏథర్ 450X. మాంచి యాక్సిలరేషన్, చురుకైన హ్యాండ్లింగ్, ఆధునిక టెక్నాలజీ ఫీచర్లతో ఇది ప్రత్యేక గుర్తింపు పొందింది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 161 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం ఉంది. ధర రూ.1.50 లక్షల నుంచి రూ.1.80 లక్షల వరకు ఉంటుంది.
Read Also: ఒక్కొక్కటి కాదు.. ఒకేసారి 10 కొత్త మోడల్స్.. హోండా దూకుడు మామూలుగా లేదుగా!
రోజువారీ ప్రయాణాలు, బడ్జెట్, అవసరాలకు అనుగుణంగా సరైన ఎలక్ట్రిక్ స్కూటర్ ను సెలెక్ట్ చేసుకుంటే ఖర్చు తగ్గడంతో పాటు ప్రయాణం కూడా మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. 2026లో ఈ ఐదు మోడళ్లు రేంజ్, ఫీచర్లు, పనితీరు పరంగా మార్కెట్లో బెస్ట్ ఆప్షన్స్ గా నిలుస్తున్నాయి.
Read Also: 2026 బ్రెజ్జా Vs హ్యుందాయ్ వెన్యూ.. ఏ SUV కొనడం బెస్ట్?