E-Paper
Advertisement

ఇకపై ఎన్నికల్లో పోటీ చేయను.. మాజీ సీఎం సంచలన ప్రకటన!

ఇకపై ఎన్నికల్లో పోటీ చేయను.. మాజీ సీఎం సంచలన ప్రకటన!
Advertisement

Siddaramaiah: ఢిల్లీ నుంచి వెలువడిన ఓ తాజా ప్రకటన కర్ణాటక రాజకీయాల్లో ఒక కీలక పరిణామంగా మారింది. దాదాపు ఐదు దశాబ్దాల పాటు క్రియాశీల రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాబోయే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఈ నిర్ణయానికి ప్రధాన కారణం ఆయన వయస్సు పైబడటం , ఆరోగ్యం సహకరించకపోవడమేనని తెలుస్తోంది. ఈ వయసులో ప్రత్యక్ష ఎన్నికల ఒత్తిడిని తట్టుకోవడం కష్టమని భావించి, ప్రత్యక్ష పోరుకు దూరంగా ఉండాలని ఆయన భావించారు. దీనికి తోడు ప్రస్తుత రాజకీయాల్లో వేగంగా వస్తున్న మార్పులు, కొరవడుతున్న నైతిక విలువలు కూడా ఆయనను కొంత అసంతృప్తికి గురిచేసినట్లు సమాచారం.

Advertisement

అయితే ఎన్నికల బరిలో నిలవకపోయినా.. రాజకీయాలకు మాత్రం గుడ్ బై చెప్పట్లేదని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. పార్టీ పరంగా, ప్రజా సమస్యల పట్ల తాను ఎప్పుడూ క్రియాశీలకంగానే ఉంటానని పేర్కోన్నారు. గత 50 ఏళ్లుగా కర్ణాటక ప్రజలు తనపై చూపించిన ప్రేమాభిమానాలు, అందించిన మద్దతుకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఒక సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఇది ఒక ముఖ్యమైన మలుపుగా నిలవనుంది.

Also Read: కూకట్‌పల్లిలో ఘోర ప్రమాదం.. స్కూటర్‌ను ఢీకొట్టిన లారీ, ఇద్దరు యువకులు మృతి!

Related News

సీఎం విజయ్‌కు స్టాలిన్ స్ట్రాంగ్ కౌంటర్.. అవును విజయ్.. నా దవడ విరిగింది?

జంతర్ మంతర్ కేసులను రద్దు చేసినా నోటీసులా.. సుప్రీం కోర్టు ఫైర్!

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అలాంటి వీడియోలు.. 63 మందిపై కేసు నమోదు!

పెళ్లి తర్వాత కూడా మహిళల సమ్మతి ముఖ్యమే.. సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం!

తెలుగు రాష్ట్రాలకు రైల్వే నిధుల పండుగ.. విజయవాడ, విశాఖపట్నం స్టేషన్లకు గుడ్ న్యూస్!

ఎస్‌బిఐ స్పెషల్ ఆఫీసర్ జాబ్స్.. వార్షిక వేతం రూ.97 లక్షలు

వందేమాతరంపై మరో వివాదం.. ఈసారి మిత్రపక్షంతో కాంగ్రెస్‌కు పేచి.. విరుచుకుపడ్డ బీజేపీ!

2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇంటర్ విద్యార్హతతో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్‌లో జాబ్స్

Big Stories

Advertisement
×