E-Paper
Advertisement

Toyota Hyryder Prices: టయోటా హైరైడర్ కొనాలనుకుంటున్నారా? అయితే, మీకో బ్యాడ్ న్యూస్!

Toyota Hyryder Prices: టయోటా హైరైడర్ కొనాలనుకుంటున్నారా? అయితే, మీకో బ్యాడ్ న్యూస్!
Advertisement

Toyota Hyryder Prices Hike: టయోటా ఇండియా ధరల పెంపునకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌తో సహా తన పోర్ట్‌ ఫోలియోలోని ఎంపిక చేసిన మోడళ్ల ధరలను పెంచేసింది. మిడ్ రేంజ్ SUV ఇప్పుడు వేరియంట్, పవర్‌ ట్రెయిన్ ఆధారంగా రూ. 42,700 వరకు పెంపును కలిగి ఉంది.

అటు పెట్రోల్ వేరియంట్ లో ప్రారంభించి  E, S, మాన్యువల్ వేరియంట్లలో స్వల్పంగా ధరలు పెరిగాయి. వీటి ధరలు రూ. 4,700 వరకు పెరిగాయి. ఈ వేరియంట్లు హైరైడర్ లైనప్‌లో అత్యంత అందుబాటులో ఉన్న ఎంపికలుగా కొనసాగుతున్నాయి. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌ బాక్స్‌ లతో లభించే G (O), V వేరియంట్లు శ్రేణిలో మంచి గుర్తింపు పొందాయి. వీటిపై ఇప్పుడు రూ. 31,100 వరకు పెరుగుదలను చూస్తున్నాయి. అదే సమయంలో, ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్ రూ. 39,100 వరకు పెరిగింది. అటు స్ట్రాంగ్ హైబ్రిడ్ V ట్రిమ్ అత్యధికంగా రూ. 42,700 వరకు పెంపును చూసింది. తాజా ధర పెరుగుదలలో అత్యధికంగా ప్రభావితం అయిన వేరియంట్ గా గుర్తింపు తెచ్చుకుంది.

ప్రస్తుతం టయోటా హైరైడర్ ధర ఎంత ఉందంటే?

Advertisement

తాజా ధరల పెరుగుదల తర్వాత, టయోటా హైరైడర్ ఇప్పుడు రూ. 10.99 లక్షల నుంచి ప్రారంభమై రూ. 20.19 లక్షల వరకు(ఎక్స్ షోరూమ్) ధరకు చేరుకుంది. పెట్రోల్ మాన్యువల్, పెట్రోల్ ఆటోమేటిక్, CNG, AWD, స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్‌ తో సహా మల్టీపుల్ పవర్‌ ట్రెయిన్ ఎంపికలతో ఈ SUV అందుబాటులో ఉంది.  గత నెలలో టయోటా హైరైడర్ కోసం రూ. 29,499 ధరతో టెక్ ప్యాకేజీని కూడా ప్రవేశపెట్టింది. ఈ డీలర్ స్థాయి ఆఫర్ బండిల్‌ లో హెడ్స్ అప్ డిస్ ప్లే, డాష్ కెమెరా, యాంబియంట్ లైటింగ్ ఉన్నాయి. వీటిలోని అన్ని వేరియంట్లలకు ఆ ఆఫర్ వర్తించనుంది.

Read Also: టీవీఎస్ వినియోగదారులకు మరో షాక్.. మళ్లీ ధరలు పెరిగాయ్!

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ గురించి..

Advertisement

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ అత్యధిక మైలేజీని ఇచ్చే కాంపాక్ట్ SUVగా గుర్తింపు తెచ్చుకుంది. ఇది ముఖ్యంగా స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ కారు సుమారు 25 కిలో మీటర్ల మైలేజీని అందిస్తుంది. ఆకర్షణీయమైన డిజైన్, పనోరమిక్ సన్‌ రూఫ్, 360 డిగ్రీ కెమెరాతో వస్తుంది. ఈ కారు ఫీచర్ల విషయానికి వస్తే, వెంటిలేటెడ్ సీట్లు, 9-ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్,  హెడ్ అప్ డిస్ ప్లే, పనోరమిక్ సన్‌ రూఫ్ ఉన్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే 6ఎయిర్‌ బ్యాగ్‌లు, ABS, EBD కంట్రోల్స్ లాంటి భద్రతా ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఈ కారులో మైల్డ్ హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్, CNG వేరియంట్లలో లభిస్తుంది. ఈ కారు ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ తో పోటీ పడుతుంది.

Read Also:  వినియోగదారులకు గుడ్ న్యూస్, హ్యుందాయ్ i20 ధర తగ్గిందోచ్!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×