E-Paper
Advertisement

East Godavari: తూ.గో జిల్లాలో పెద్ద పులి సంచారం.. రాత్రంతా పాడుబడిన ఇంట్లోనే.. ఆపరేషన్ టైగర్ షురూ

East Godavari: తూ.గో జిల్లాలో పెద్ద పులి సంచారం.. రాత్రంతా పాడుబడిన ఇంట్లోనే.. ఆపరేషన్ టైగర్ షురూ
Advertisement

తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. జి.ఎర్రంపాలెం ప్రాంతం నుండి బయలుదేరిన ఈ పులి, తాజాగా కూర్మాపురం గ్రామానికి చేరుకుంది. అక్కడ ఒక పాడుబడ్డ ఇంట్లోకి దూరిన పులి, రాత్రంతా అక్కడే సేదతీరినట్లు స్థానికులు గుర్తించారు. ఉదయాన్నే విషయం తెలుసుకున్న గ్రామస్థులు భయంతో పరుగులు తీశారు. అయితే, పులి గ్రామంలోనే ఉందని తెలియడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో జనం అక్కడికి పోటెత్తారు.

రంగంలోకి అటవీశాఖ.. బంధించేందుకు ముమ్మర ప్రయత్నాలు

సమాచారం అందుకున్న వెంటనే అటవీశాఖ అధికారులు, సిబ్బంది కూర్మాపురం చేరుకున్నారు. పులి ఉన్న పాడుబడ్డ ఇంటిని చుట్టుముట్టారు. పులిని సురక్షితంగా బంధించేందుకు అవసరమైన బోన్లను కూడా అక్కడికి తరలించారు. ప్రస్తుతం పులికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బంధించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రత్యేక గన్ల ద్వారా మత్తుమందును ప్రయోగించేందుకు నిపుణులు సిద్ధంగా ఉన్నారు.

అధికారుల ఆందోళన.. అడ్డుగా మారిన జనం

Advertisement

పులిని బంధించే ప్రక్రియలో అధికారులకు అతిపెద్ద సవాలుగా మారింది. పులిని చూసేందుకు వేలాది మంది ప్రజలు ఎగబడటంతో అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇంతమంది జనం ఉంటే తాము ఆపరేషన్ నిర్వహించలేమని, పులి భయపడి జనంపైకి దాడి చేసే ప్రమాదం ఉంది’ అని అధికారులు హెచ్చరిస్తున్నారు. జనాలను వెంటనే అక్కడి నుండి పంపించివేయాలని, లేదంటే ఆపరేషన్ కష్టమవుతుందని పోలీసులను వారు కోరారు.

స్థానికుల ఆగ్రహం.. ఎందుకు ఆలస్యం?

మరోవైపు స్థానిక ప్రజలు అటవీశాఖ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. రాత్రంతా పులి ఒకే చోట సేదతీరుతున్న సమయంలో ఎందుకు బంధించలేదని వారు ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే పులి జనావాసాల మధ్యకు వచ్చిందని, ప్రాణహాని జరిగితే ఎవరిది బాధ్యత అని గ్రామస్థులు నిలదీస్తున్నారు. ప్రస్తుతానికి పోలీసులు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించే పనిలో ఉన్నారు. పులిని బంధించి సురక్షితంగా అటవీ ప్రాంతానికి తరలించే వరకు ఈ ఉత్కంఠ కొనసాగేలా కనిపిస్తోంది.

Advertisement

ALSO READ: PNB Recruitment: నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. పంజాబ్ నేషనల్ బ్యాంకులో 5,138 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×