E-Paper
Advertisement

TVS Raider 125: టీవీఎస్ వినియోగదారులకు మరో షాక్.. మళ్లీ ధరలు పెరిగాయ్!

TVS Raider 125: టీవీఎస్ వినియోగదారులకు మరో షాక్.. మళ్లీ ధరలు పెరిగాయ్!
Advertisement

TVS Raider 125 Prices Increased: గత కొద్ది రోజులుగా వరుసగా తమ స్కూటర్లు, బైక్స్ ధరలు పెంచుతోంది టీవీఎస్. ఇప్పటికే పలు మోడల్స్ ధరలు పెంచగా, తాజాగా మరో బైక్ ధరలు పెంచింది. TVS Raider 125 ధరలను స్వల్పంగా హైక్ చేసింది. ఈ ధరల పెరుగుదల వేరియంట్ వారీగా మారుతుంది. ఎంట్రీ లెవల్ డ్రమ్ బ్రేక్ వేరియంట్‌కు రూ. 1,250 వరకు పెరిగింది. ఈ మోటార్ సైకిల్ ఆరు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇవి ఫీచర్లు, హార్డ్‌ వేర్ పరంగా భిన్నంగా ఉన్నాయి. ఇంతకీ టీవీఎస్ రైడర్ ఏ వేరియంట్ ధర ఎంత పెరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

టీవీఎస్ రైడర్ ధరలు ఎంత పెరిగాయంటే?

⦿ డ్రమ్: ఈ వేరియంట్ మీద అత్యధికంగా రూ. 1250 పెరిగింది. ప్రస్తుతం దీని ధర రూ. 82,000కి చేరింది.

Advertisement

⦿ డిస్క్ (సింగిల్ సీట్): ఈ బైక్ ధర రూ. 950 హైక్ అయ్యింది. ప్రస్తుతం దీని ధర రూ. 87,600కి చేరింది.

⦿ iGO (బూస్ట్ మోడ్): దీని ధర రూ. 900 పెరిగింది. ప్రస్తుతం రూ. 91,650కి చేరింది.

Advertisement

⦿ సూపర్ స్క్వాడ్: ఈ బైక్ ధర కూడా రూ.900 హైక్ అయ్యింది. ప్రస్తుతం రూ. 92,650కి చేరింది.

⦿ SXC డ్యూయల్ డిస్క్: ఈ బైక్ ధర రూ. 720 పెరిగింది. ప్రస్తుతం రూ. 95,225కి చేరింది.

⦿ TFT డ్యూయల్ డిస్క్: ఈ బైక్ ధర రూ. 1050 పెరిగి, రూ. 97,050కి చేరింది.

కొనుగోళ్ల మీద ప్రభావం చూపేనా?

ప్రస్తుతం టీవీఎస్ రైడర్ 125 ధరల పెంపు తక్కువగా ఉన్న నేపథ్యంలో కొనుగోళ్లపై అంతగా ప్రభావం చూపించే అవకాశం లేదని ఆటో నిపుణులు వెల్లడిస్తున్నారు.  ఈ విభాగంలో పోటీ బాగా పెరిగింది. ముఖ్యంగా హోండా CB 125 హార్నెట్ లాంటి  బైక్స్ రాకతో, రైడర్ 125 సాంకేతికత, పనితీరు పరంగా మరింతగా ఆకట్టుకుంటుంది. అయితే, డిజైన్ చాలా పాతది. త్వరలోనే అప్ డేట్ చేసేలా కంపెనీ ప్రణాళికలు చేస్తోంది.

Read Also: హోండా డియో vs హోండా షైన్.. వీటిలో ఏది బెస్ట్? ఎందుకు?

రైడర్ కు సంబంధించిన టెక్నికల్ విషయాలు పరిశీలిస్తే, ఇది 124.8cc, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్, మూడు వాల్వ్ ఇంజిన్‌ తో పవర్ ను అందిస్తుంది. ఇది 11.2bhp, 11.2Nm పీక్ టార్క్‌ ను అందిస్తుంది. ఈ మోటార్ ఐదు స్పీడ్ ట్రాన్స్‌ మిషన్‌ కు యాడ్ చేయబడి ఉంటుంది. అన్ని వేరియంట్లలోని ప్రైమరీ ఫీచర్లతో ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ LED DRLలతో కూడిన LED హెడ్‌ లైట్, LED టెయిల్‌ లైట్, ఐదు అంగుళాల డిజిటల్ డిస్‌ ప్లే, ఐడిల్ స్టాప్ స్టార్ట్ సిస్టమ్, రెండు రైడ్ మోడ్‌లు ఉన్నాయి. కనెక్టెడ్ వేరియంట్ బ్లూటూత్ కనెక్టివిటీతో కలర్ TFT డిస్‌ ప్లే, TVS SmartXConnect సిస్టమ్‌ తో కలిసి పని చేసే వాయిస్ అసిస్ట్ ఫంక్షన్ ను కలిగి ఉంటుంది.

Read Also: మార్కెట్ లోకి OSM Vextra ఎలక్ట్రిక్ స్కూటర్, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×