Gold Interesting Facts: బంగారం ధరలు రోజు రోజుకూ అమాంతం పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయ కారణాలు, సురక్షిత పెట్టుబడి మార్గంగా గోల్డ్ ను చూస్తుండడంతో ధరలు కొండెక్కి కూర్చొన్నాయి. అయితే అసలు బంగారం ఎక్కడి నుంచి వచ్చింది, దాని గురించి మనకి తెలియని 8 ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
హ్యూమన్ బ్లడ్ లో బంగారం ఉంటుంది. రక్త ప్రవాహం, కాలేయం, కిడ్నీలు, జుట్టులో చాలా స్పల్ప స్థాయిల్లో గోల్డ్ ఉంటుంది. యూఎస్ మనీ రిజర్వ్ ప్రకారం 150 పౌండ్ల(68 kgs) బరువున్న వ్యక్తిలో దాదాపు 0.2 మిల్లీగ్రాములు బంగారం ఉంటుంది. ఆహారం, నీటి ద్వారా ఇది శరీరంలోకి చేరుతుంది. బంగారానికి రుచి, వాసన ఉండదు. అయినప్పటికీ, లగ్జరీ ఫుడ్, డ్రింక్స్ పై డెకరేషన్ కు దీనిని వాడతారు. బంగారం విషపూరితం కాదు. తీని తినవచ్చు.
బంగారం భూమిపై పుట్టలేదు. ఆస్టరాయిడ్స్ ద్వారా భూమి పైకి వచ్చింది. లక్షల ఏళ్లుగా భూమిలో లోపల తీవ్రమైన వేడి, ఒత్తిడితో బంగారం అణువులన్నీ కలిసి నిక్షేపాలుగా మారాయి. ప్రపంచంలోని ఏడు ఖండాలలో బంగారం నిక్షేపాలు ఉన్నాయి.
సముద్రంలో బంగారం కరిగిపోతుందని నిపుణులు చెబుతుంటారు. కానీ అది చాలా తక్కువ శాతమే. నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం ఒక ఔన్స్ బంగారాన్ని తీయడానికి మిలియన్ల పౌండ్ల సముద్రపు నీటిని ప్రాసెస్ చేయాలి. సముద్రపు లోతుల్లో అంతులేని బంగారం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నాయి. సముద్రం నుంచి బంగారాన్ని వెలికితీయడమంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అందుకే దానిని టచ్ చేయడంలేదు.
బంగారం ఒక గొప్ప లోహం. దీనికి తుప్పు పట్టదు, మెరుపును కోల్పోదు. అందుకే పురాతన దేవాలయాల్లోని బంగారు విగ్రహాలు నేటికీ మెరుస్తుంటాయి. బంగారాన్ని కరిగించవచ్చు కానీ వాటి అణువులను నాశనం చేయలేం. ఇప్పటి వరకు తవ్వి తీసిన బంగారమంతా ఏదో ఒక రూపంలో ఉంది. దానిని నాశనం చేయలేం అంటున్నారు నిపుణులు.
బంగారంతో పోలిస్తే వజ్రాలు కాస్ట్లీ. కానీ బంగారాన్ని సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్ గా భావిస్తారు. వజ్రాలు కార్బన్ నుంచి ఏర్పడతాయి. కార్బన్ భూమిపై ఎక్కువగా లభిస్తుంది. ఇప్పటి వరకు వెలికి తీసిన బంగారమంతా 20 మీటర్లు ఉన్న ఒక క్యూబ్‌లో సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఐదు క్యారెట్ల వజ్రాన్ని కనుగొనడం కంటే ఒక ఔన్స్ బంగారు కబడ్డీని కనుగొనడం చాలా అరుదు.
1904 నుంచి 1912 వరకు ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ ను స్వచ్ఛమైన బంగారంతో తయారు చేశారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత గోల్డ్ మెడల్ ను బంగారు పూతతో ఉన్న వెండితో చేస్తున్నారు. ప్రస్తుతం బంగారు పతకాలలో 6 గ్రాములు మాత్రమే గోల్డ్, 92.5% వెండి ఉంటున్నాయి. ఒలింపిక్ గోల్డ్ మెడల్ 18 ఔన్సుల బరువు ఉంటుంది.
Also Read: పాత సిమ్ కార్డ్‌తో లక్షలు విలువ చేసే బంగారం.. రూ.కోట్లు సంపాదించే అవకాశం.. ట్రై చేయండి
బంగారం వెచ్చని దుప్పటిలా పనిచేస్తుంది. వ్యోమగాములు, అంతరిక్ష నౌకలను తీవ్రమైన వేడి నుండి బంగారం రక్షిస్తుంది. స్పేస్‌సూట్ విజర్‌లు బంగారు పూత పూయబడి ఉంటాయి. వీటి మందం 0.000002 అంగుళాలు. ఈ పూత హానికరమైన రేడియేషన్‌ను తట్టుకుంటుంది. 1960లలో అపోలో మిషన్ సమయంలో.. బంగారు రేకును ల్యూనార్ మాడ్యూల్‌కు అతికించారు.
భూమిపై దొరికే చాలా మెటల్స్ సిల్వర్ లేదా బూడిద రంగులో ఉంటాయి. కానీ బంగారం మాత్రమే సహజంగా పసుపు రంగులో దొరుకుతుంది. రాగి ఎర్రటి రంగులో ఉంటుంది. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, స్వచ్ఛమైన బంగారం రూబీ రంగులో ఉంటుంది.