E-Paper
Advertisement

Upcoming Hero Bikes 2026: ఎక్స్‌ పల్స్ 160 To కరిజ్మా XMR 250.. హీరో అప్ కమింగ్ లైనప్ అదుర్స్ అంతే!

Upcoming Hero Bikes 2026: ఎక్స్‌ పల్స్ 160 To కరిజ్మా XMR 250.. హీరో అప్ కమింగ్ లైనప్ అదుర్స్ అంతే!
Advertisement

Hero Bikes 2026: 2026లో హీరో కంపెనీ నుంచి అద్భుతమైన బైక్స్ అందుబాటులోకి రానున్నాయి. 2026లో క్రేజీ సూపర్ బైక్స్ విడుదల కాబోతున్నాయి. వాటిలో Xpulse 160, XPulse 400, Xtreme 400s, Karizma XMR 250, Mavrick 440 Scrambler ఉన్నాయి. వీటిలో రెండు అడ్వెంచర్, 3 స్పోర్ట్స్ బైక్స్ తో పాటు మరికొన్ని బైక్స్ ఉన్నాయి. Xpulse 160 మరో 10 నెలల్లో లాంచ్ కానుంది. ఇంతకీ 2026లో రాబోయే బైక్స్ కు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

2026లో అందుబాటలోకి రానున్న హీరో బైక్స్

2026లో భారత మార్కెట్‌ లోకి హీరో మోటోకార్ప్ నుంచి అడుగు పెట్టబోతున్న ముఖ్యమైన బైక్‌లు.. వాటి ధరలు, అధికారిక లాంచ్ డేట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisement

⦿ Hero XPulse 421: ఇది అడ్వెంచర్ బైక్. 421cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. 45bhp తో వస్తుంది. అంచనా ధర రూ. 2.4 – 3 లక్షలు ఉంటుంది. ఈ బైక్ జనవరి లేదంటే ఫిబ్రవరి 2026లో లాంచ్ అవుతుంది.

⦿ Hero Mavrick 440 Scrambler: స్క్రాంబ్లర్ వేరియంట్  440cc ప్లాట్‌ ఫాం మీద అందుబాటులోకి వస్తుంది. ఈ బైక్ అంచనా ధర రూ. 2.2 – 2.5 లక్షలు ఉంటుంది. ఈ బైక్ 2026 ఫస్ట్ క్వార్టర్ లో అందుబాటులోకి రానుంది.

Advertisement

⦿ కొత్త Harley-Davidson 440cc మోడల్: హీరో, హార్లీ పార్ట్‌ నర్‌షిప్ లో అందుబాటులోకి వచ్చింది. X440 ప్లాట్‌ ఫాం బేస్డ్ గా రూపొందుతుంది. దీని అంచనా ధర రూ. 2.5 – 3 లక్షలు ఉంటుంది. ఈ బైక్ 2026లో లాంచ్ కానుంది.

Read Also: 2026లో విడుదల కానున్న టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవి, ఒక్కోదాని ప్రత్యేకత ఏంటంటే?

2026లో అందుబాటులోకి వచ్చే మరికొన్ని మోడల్స్  

⦿Karizma XMR 250 లేదా Karizma 400: ఈ స్పోర్ట్స్ బైక్ నవంబర్ 2026లో అందుబాటులోకి రానుంది. దీని ధర రూ. 2 – 2.5 లక్షలు ఉంటుంది.

⦿ ఎక్స్‌ పల్స్ 160: దీని ధర సుమారు రూ. 1.40 లక్షలు ఉంటుంది. అక్టోబర్ 2026లో అందుబాటులోకి రానుంది.

⦿ ఎక్స్‌ పల్స్ 400: ఈ బైక్ అక్టోబర్ 2026లో అందుబాటులోకి రానుంది. దీని అంచనా ధర రూ. 2.00 లక్షలు.

⦿ ఎక్స్‌ ట్రీమ్ 400: ఈ బైక్ అంచనా ధర రూ. 2.00 లక్షలు. ఈ బైక్ నవంబర్ 2026లో అందుబాటులోకి రానుంది.

⦿ మావ్రిక్ 440 స్క్రాంబ్లర్: ఈ బైక్ ధర రూ. 2.20 లక్షలు ఉంటుంది. డిసెంబర్ 2026లో అందుబాటులోకి రానుంది.

మొత్తంగా హీరో ప్రీమియం, అడ్వెంచర్ సెగ్మెంట్‌ లో బలపడుతోంది. ప్రీమియం ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిల్స్, జీరో మోటార్స్  పార్ట్‌ నర్‌ షిప్ లేదంటే విడా బ్రాండ్ నుంచి అందుబాటులోకి రానున్నాయి. 500-600cc ఈక్వివలెంట్ ఇంజిన్ ను కలిగి ఉంటాయి. మొత్తంగా హీరో కంపెనీ మిడిల్ వెయిట్ మోడల్స్ మీద ఫోకస్ పెడుతోంది.

Read Also: ఎలక్ట్రిక్ To పెట్రోల్.. 2026లో లాంచ్ కాబోతున్న క్రేజీ స్కూటర్లు ఇవే!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×