E-Paper
Advertisement

Urvashi Rautela: లగ్జరీ కారుకొన్న హాట్ బ్యూటీ ఊరశ్వి, కాస్ట్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Urvashi Rautela: లగ్జరీ కారుకొన్న హాట్ బ్యూటీ ఊరశ్వి, కాస్ట్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!
Advertisement

Urvashi Rautela New Car: హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తన అంద చందాలతో కుర్రకారు  మతిపోగొట్టేస్తుంది. స్పెషల్ సాంగ్స్ తో కట్టిపడేస్తుంది. సినిమాల పరంగానే కాదు, ఈ ముద్దుగుమ్మ కార్ కలెక్షన్ తోనూ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఆమె దగ్గర రూ. 11 కోట్ల రోల్స్ రాయిస్ కల్లినన్ ఉండగా, ఇప్పుడు రూ. 5 కోట్ల విలువ చేసే గ్రీన్ కలర్ మెర్సిడెస్-బెంజ్ G-Wagonను కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ కారు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోలు చూసి ఆమె అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. చాలా మంది అభినందిస్తున్నారు. సినిమాల్లో రాణిస్తూ చక్కటి కార్లు కొనుగోలు చేయడం సంతోషంగా ఉందంటున్నారు. అందం, అభినయంతో ఇండస్ట్రీలో రాణించడం వల్లే ఇవాళ ఈ స్థాయికి చేరిందంటున్నారు. మున్ముందు ఇండస్ట్రీలో బాగా రాణించడంతో పాటు మరిన్ని లగ్జరీ కార్లు కొనుగోలు చేయాలని ఆకాంక్షించారు.

ఫుల్ బిజీగా ఊర్వశి

Advertisement

ప్రస్తుతం బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో ఆమె ఒకరు. ప్రపంచ వ్యాప్తంగా ఆమెను 200 మిలియన్లకు పైగా అభిమానులు ఫాలో అవుతున్నారు. తరచుగా ఆమె జాతీయ, అంతర్జాతీయ వేదికల్లో రెడ్ కార్పెట్ మీద కనిపిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం ఆమె పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

మెర్సిడెస్-బెంజ్ G-Wagon గురించి..

మెర్సిడెస్-బెంజ్ G-Wagon అనేది బాక్సీ డిజైన్ ను కలిగి ఉంటుంది. లగ్జరీ ఇంటీరియర్, పవర్ ఫుల్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. ఐకానిక్ SUVగా గుర్తింపు తెచ్చుకుంది. ఇది సాంప్రదాయ, ఆధునిక ఫీచర్ల మిక్సింగ్ గా ఉంటుంది. భారత్ లో దీని ఖరీరు సుమారు రూ. 2.90 కోట్ల నుంచి ప్రారంభమవుతుంది. ఈ కారు పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వెర్షన్లలో లభిస్తుంది.  ఇందులో ADAS వంటి అధునాతన ఫీచర్లు ఉంటాయి.

Advertisement

Read Also: ఇండియన్స్ ఏ కలర్ కార్లను ఎక్కువగా ఇష్టపడుతారో తెలుసా? కారణం ఇదే!

మెర్సిడెస్-బెంజ్ G-Wagon గుండ్రని హెడ్‌ లైట్లు, ఎక్స్‌ పోజ్డ్ హింజ్‌లు, సైడ్ హింజ్డ్ టెయిల్‌గేట్, ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌ లతో బాక్సీ, పాత కాలపు డిజైన్ ను కలిగి ఉంటుంది. అదే సమయంలో లేటెస్ట్ LED లైట్లు ఉంటాయి. ఇది పవర్ ఫుల్ V8 పెట్రోల్, స్ట్రెయిట్ సిక్స్ డీజిల్, ఎలక్ట్రిక్ ఇంజిన్‌ లతో అందుబాటులో ఉంది.  ఇంటీరియర్ విషయానికి వస్తే నప్పా లెదర్, పెద్ద డిజిటల్ డిస్‌ప్లేలు, టచ్‌ స్క్రీన్, బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్, లెవల్ 2 ADAS వంటి లగ్జరీ, టెక్ ఫీచర్లు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో డీజిల్ (G 450d), పెట్రోల్ (AMG G 63), ఎలక్ట్రిక్ (G 580) వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. దేశంలో అత్యంత ఖరీదైన లగ్జరీ SUVలలో ఒకటిగా కొనసాగుతోంది.

Read Also: ఇకపై ఎలక్ట్రిక్ కార్లు సౌండ్ చేయాలట, ఎందుకో తెలుసా?

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×