E-Paper
Advertisement

Municipal polls :పార్టీలను భయపెడుతున్న రెబల్స్.. వారి మాటే నెగ్గాలటా?

Municipal polls :పార్టీలను భయపెడుతున్న రెబల్స్.. వారి మాటే నెగ్గాలటా?
Advertisement

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం నెలకొంది. ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీల నేతల కన్ను పురపాలికలపైనే ఉన్నది. ఎలాగైనా వీలైనన్నీ ఎక్కువ స్థానాలు సాధించాలి. అందుకోసం ఏం చేద్దాం? ఎలా చేద్దాం? అభ్యర్థులు సరిపడా ఉన్నారా? ఎన్ని స్థానాల్లో బరిలోకి దిగుదాం? ఏయే స్థానాల్లో మనకు బలం ఉన్నది? ఎక్కడెక్కడా వీక్‌గా ఉన్నాం? ఆ ప్రాంతాల్లో ఎవరిని నిలబెడుదాం? ఇతర పార్టీల వారికి గాలం వేద్దామా? ఇదే చర్చ జరుగుతున్నట్టు తెలుస్తున్నది. మరోవైపు స్వతంత్ర్య అభ్యర్థులు సైతం తమ అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి సన్నద్ధమవుతుండగా.. రాష్ట్రంలోని ప్రధాన పార్టీల్లో కీలక నేతలు తమకంటే తమకు అవకాశం ఇవ్వాలని వెంటపడుతున్నట్టు తెలుస్తున్నది. పార్టీపెద్దలకు పదే పదే కాల్స్ చేస్తూ ఈసారి తమకే చాన్స్ ఇవ్వాలని లేదంటే రెబల్‌గా పోటీ చేస్తామని వార్నింగ్ ఇస్తున్నట్టు సమాచారం.

టికెట్ ఇస్తే ఓకే.. లేకపోతే..

రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లో రెబల్స్ బెడద ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తున్నది. మొత్తం 121 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఇప్పుడు ఎన్నికలు జరుగుతుండగా.. ఒక్కో వార్డు, డివిజన్‌కు పదికి పైగా ఆశావహులు దరఖాస్తులు చేస్తున్నట్టు సమాచారం. సామాజిక వర్గం, రిజర్వేషన్లు చూసుకునే ఇంత పెద్దఎత్తున దరఖాస్తులు వస్తున్నట్టు తెలుస్తుండగా.. ఎవరిని ఫైనల్ చేయాలి? టికెట్ వచ్చిన వారు సంతోషంగా ఉంటే.. రాని వారు రెబల్‌గా బరిలోకి దిగుతామని పార్టీ పెద్దలకు స్పష్టం చేస్తున్నట్టు తెలుస్తున్నది. ముందు నుంచి పార్టీకి సేవ చేస్తున్నామని, తమను కాదని తమ తర్వాత వచ్చిన వారికి ఎలా చాన్స్ ఇస్తారంటూ కొన్ని చోట్ల గొడవలకు దిగుతున్నట్టు టాక్.

అయోమయంలో నేతలు..

Advertisement

ఓవైపు ఎమ్మెల్యేలు, మరోవైపు ఎంపీలు.. మంత్రులు సైతం టికెట్ ఎవరికి ఇవ్వాలనే అంశంపై తర్జన భర్జన పడుతున్నట్టు తెలుస్తున్నది. దీనికోసం ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ.. మున్సిపల్ ఎన్నికల బాధ్యతలను జిల్లా ఇన్‌చార్జి మంత్రులకు అప్పగించింది. వారే తమ జిల్లాలోని మున్సిపల్ స్థానాలకు దరఖాస్తులు ఆహ్వానించాలి.. ఫైనల్ చేయాలి.. రెబల్స్ బెడద లేకుండా చూడాలి. అసంతృప్తులను బుజ్జగించాలి. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం క్షేత్రస్తాయిలోకి వెళ్లి ప్రచారం చేయాలి. దీంతో ఇన్ చార్జి మంత్రులకు కొత్త టెన్షన్ నెలకొన్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇక బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు మాత్రం బలమైన అభ్యర్థుల కోసం వెతుకుతున్నట్టు సమాచారం.

Naini Coal Mines Tender: నైనీ కోల్స్ మైన్స్ వ్యవహారం.. టెండర్ రద్దు చేసినట్టు SCCL ప్రకటన

Advertisement

ముందుగా పార్టీలో రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థులు ఉన్నారా? లేకపోతే అధికార పార్టీలో టికెట్ దొరక్క రెబల్‌గా పోటీ చేయాలనుకుంటున్న వారిని తమ పార్టీలోకి ఆహ్వానించి టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఎదురుచూస్తున్నట్టు తెలుస్తున్నది. అందుకే ఆ రెండు పార్టీలు ప్రస్తుతం ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తున్నది. మరోవైపు ఈ రెండు పార్టీల్లో ముందు నుంచి ఉన్న అభ్యర్థులు తమకు చాన్స్ ఇవ్వాలని.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రయారిటీ ఇస్తే ఊరుకునేది లేదని ముందే హెచ్చరికలు పంపినట్టు టాక్ వినిపిస్తోంది.మొత్తానికి మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్ బెడద అన్ని పార్టీలకు ఇబ్బందిగా మారడం ఖాయమని ప్రచారం జరుగుతున్నది.ఇది ఒక్క అధికార పార్టీకే కాకుండా, మిగతా పార్టీలకూ మున్సిపల్ ఎన్నికల్లో వచ్చే సీట్లపై ప్రభావితం చూపుతుందని జోరుగా చర్చ జరుగుతున్నది. అందుకే రెబల్స్ బెడద లేకుండా పార్టీ పెద్దలు రంగంలోకి దిగి చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తున్నది.

Related News

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Big Stories

Advertisement
×