E-Paper
Advertisement

Cars on December 31st: కారు కొంటున్నారా? డిసెంబరు 31నే కొనండి.. ఎందుకంటే?

Cars on December 31st: కారు కొంటున్నారా? డిసెంబరు 31నే కొనండి.. ఎందుకంటే?
Advertisement

Cars buy In December: చాలా మంది కొత్త మోడల్ కార్లు మార్కెట్లోకి విడుదల కాగానే కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతారు. ముందస్తుగా బుకింగ్ చేసుకోని మరీ లేటెస్ట్ మోడల్ ను ఇంటికి తెచ్చుకుంటారు. అయితే, చాలా మందికి ఆటో నిపుణులు చెప్పే మాట.. కారు కొనాలనుకునే వారికి బెస్ట్ మంత్ డిసెంబర్. ఈ నెలలో కారు కొనుగోలు చేయడం వల్ల బోలెడు బెనిఫిట్స్ పొందే అవకాశం ఉందంటున్నారు. అందుకే చాలా మంది డిసెంబర్ 31 వరకు కార్లు కొనడానికి వేచి ఉంటారు. ఎందుకంటే, ఆ సమయంలో కార్ల ధరలు చాలా తక్కువగా ఉంటాయి. దీని వెనుక ఉన్న కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

డిసెంబర్ లో కార్లు కొనడానికి ముఖ్యమైన కారణాలు

Advertisement

 

⦿ ఇయర్ ఎండ్ స్టాక్ క్లియరెన్స్

కారు డీలర్లు, మాన్యుఫాక్చరర్లు పాత స్టాక్ ను క్లియర్ చేయాలనుకుంటారు. కొత్త సంవత్సరంలో కొత్త మోడల్స్ వస్తాయి కాబట్టి, పాత మోడల్స్ ధరలు తగ్గించి అమ్మకానికి ఉంచుతారు. ఇది ఇన్వెంటరీ హోల్డింగ్ ఖర్చులు తగ్గిస్తుంది.

⦿ మోడల్ ఇయర్ మార్పు, రీసేల్ వాల్యూ

Advertisement

డిసెంబర్ 2025లో కొన్న కారు 2025 మోడల్ ఇయర్‌ గా రిజిస్టర్ అవుతుంది. జనవరి 2026లో అదే కారు 2026 మోడల్ ఇయర్‌ గా ఉంటుంది.ఇది రీసేల్ వాల్యూను పెంచుతుంది. కానీ,  డిసెంబర్‌లో పాత మోడల్స్‌ పై డిస్కౌంట్లు ఎక్కువ.. అంటే సుమారు 20 నుంచి 30% వరకు ఉంటాయి. సో, కారుపై పెట్టే ఖర్చు భారీగా తగ్గుతుంది. అయితే ప్రస్తుత ఇయర్ మోడల్ కారు త్వరగా డిప్రిషియేట్ అవుతుంది.

⦿ సేల్స్ టార్గెట్స్, ఆఫర్లు

మాన్యుఫాక్చరర్లు ఏటా సేల్స్ టార్గెట్స్ చేరుకోవడానికి డిసెంబర్‌లో భారీ డిస్కౌంట్లు అందిస్తారు. అదే సమయంలో  క్యాష్ బ్యాక్, ఎక్స్ఛేంజ్ బోనస్, ఫ్రీ యాక్సెసరీస్ ఇస్తారు. ఇండియాలో GST కట్స్ కూడా ఈ ఏడాది డిసెంబర్ లో  ధరలు తగ్గడానికి కారణం అయ్యాయి.

⦿ ఫెస్టివ్ సీజన్, మార్చి ఫైనాన్షియల్ ఇయర్

డిసెంబర్ ఫెస్టివ్ సీజన్ తర్వాత వచ్చే ఇయర్ ఎండ్ సేల్స్. మన దేశంలో ఫైనాన్షియల్ ఇయర్ మార్చి చివర్లో ముగుస్తుంది. సో, మార్చి కూడా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. కానీ, డిసెంబర్‌ లో ఇయర్ ఎండ్ డీల్స్ ఎక్కువగా ఉంటాయి.

Read Also: ఇకపై ప్రతి మారుతీ కారుకు సన్‌రూఫ్.. ముఖ్యంగా ఈ కార్లకే, అవేంటో చూసేయండి!

2025 డిసెంబర్ స్పెషల్

ఈ సంవత్సరం GST కట్స్,  మార్కెట్ కండిషన్స్ కారణంగా డిస్కౌంట్లు మరింత ఎక్కువగా ఉన్నాయి. కొన్ని మోడల్స్ పై ఏకంగా రూ. 10 లక్షల వరకు డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. సో, ఒకవేళ మీరు కూడా కారు కొనుగోలు చేయాలనుకుంటే, ఈ డిసెంబర్ లోనే కొనుగోలు చేయడం మంచిది. ఎందుకంటే, స్టాక్ లిమిటెడ్ గా ఉంటుంది. ఒకవేళ లేట్ చేస్తే,  మీకు కావాల్సిన మోడల్, కలర్ స్టాక్ అయిపోవచ్చు. రీసేల్ వాల్యూ ముఖ్యమైతే జనవరి వరకు వేచి ఉండటం మంచిది. ప్రస్తుతం ఏ కార్లపై ఎంత డిస్కౌంట్ ఉందో తెలుసుకోవాలంటే, వెంటనే సమీపంలోనే డీలర్లను సంప్రదించడం మంచిది.

Read Also: డైరెక్టర్లకు లగ్జరీ కార్లను గిఫ్ట్ గా ఇచ్చిన స్టార్ హీరోలు, ఇంతకీ వాటి ప్రత్యేకత ఏంటంటే?

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×