సౌత్ ఇండియన్ స్టార్ హీరోలు, నిర్మాతలు తమ సినిమాలు బ్లాక్ బస్ట్ హిట్ కొట్టిన సమయంలో దర్శకులకు, మ్యూజిక్ డైరెక్టర్లకు బహుమతులు ఇవ్వడం చూస్తుంటాం. చాలా మంది స్టార్ హీరోలు, నిర్మాతలు లగ్జరీ కార్లను గిఫ్ట్ గా ఇచ్చారు కూడా. సినిమా కోసం వారు పడిన కష్టానికి గుర్తింపుగా ఈ బహుమతులను అందిస్తున్నాయి. ఇంతకీ హీరోలు, దర్శకులకు అందించిన లగ్జరీ కార్లు ఏవి? వాటి ప్రత్యేకత ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ ‘OG’ సక్సెస్ తర్వాత దర్శకుడు సుజీల్ కు సుమారు రూ. 1-3 కోట్ల విలువ చేసే ల్యాండ్ రోవర్ డిఫెండర్ (Land Rover Defender) గిఫ్ట్ చేశారు.
ల్యాండ్ రోవర్ డిఫెండర్ ప్రత్యేకతలు: ఆఫ్-రోడ్ SUV, శక్తివంతమైన ఇంజన్ (3.0L డీజల్/పెట్రోల్), అడ్వెంచర్ డ్రైవింగ్‌కు పర్ఫెక్ట్, లగ్జరీ ఇంటీరియర్, టాప్ సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి. .
నటుడు నితిన్ వెంకీ కుడుములకు రేంజ్ రోవర్(Range Rover) బహుమతిగా ఇచ్చారు. ఇద్దరి కాంబోలో వచ్చిన ‘భీష్మ’ (2020) సినిమాను బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సందర్భంగా నితిన్ ప్రోత్సాహకంగా దర్శకుడు వెంకీ కుడుములకు గిఫ్ట్ ఇచ్చారు.
రేంజ్ రోవర్ ప్రత్యేకతలు: అల్ట్రా-లగ్జరీ SUV, సూపర్ స్మూత్ డ్రైవ్, పవర్‌ఫుల్ ఇంజన్ (4.4L V8), హై-ఎండ్ ఇంటీరియర్, లెదర్ సీట్స్, అడ్వాన్స్‌డ్ ఇన్ఫోటైన్‌మెంట్, ఆఫ్ రోడ్ కెపాబిలిటీ.
‘శ్రీమంతుడు’ సక్సెస్ సందర్భంగా దర్శకుడు కొరటాల శివకు టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ఆడి 6(Audi A6) కారును గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ కారు ధర సుమారు రూ. 50 లక్షలు ఉంటుంది.
ఆడి 6 ఆకె ప్రత్యేకతలు: ప్రీమియం సెడాన్, స్మూత్, కంఫర్టబుల్ డ్రైవ్, 2.0L టర్బో ఇంజన్, లగ్జరీ ఫీచర్లు, వర్చువల్ కాక్‌పిట్, ప్రీమియం సౌండ్ సిస్టమ్, హై సేఫ్టీ రేటింగ్తో వస్తుంది.
నటుడు బాలకృష్ణ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ Sకు పోర్షే కయెన్నే (Porsche Cayenne) లగ్జరీ SUVని బహుమతిగా ఇచ్చారు. ‘డాకు మహారాజ్’, ‘అఖండ’, ‘వీరసింహ రెడ్డి’, ‘భగవంత్ కేసరి’ సినిమాలు సక్సెస్ అయిన నేపథ్యంలో కృతజ్ఞతగా ఈ గిఫ్ట్ అందించారు.
పోర్షే కయెన్నే ప్రత్యేకతలు: ఈ కారు ధర రూ. 1.42- 2 కోట్లు ఉంటుంది. పవర్ ఫుల్ V6, V8 టర్బో ఇంజన్ తో వస్తుంది. టాప్ స్పీడ్: 250-284 km/h. అల్ట్రా-లగ్జరీ SUV, స్పోర్టీ లుక్, ప్రీమియం లెదర్ ఇంటీరియర్, అడ్వాన్స్‌డ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హై-ఎండ్ సౌండ్ సిస్టమ్ తో వస్తుంది.
‘విక్రమ్’ బ్లాక్ బస్టర్ తర్వాత, కమల్ హాసన్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కు లగ్జరీ సెడాన్ ను బహుమతిగా ఇచ్చారు. . Lexus ES 300h లగ్జరీ సెడాన్ గిఫ్ట్ గా ఇచ్చారు. చేశారు. ప్రత్యేకతలు: హైబ్రిడ్ టెక్నాలజీ (ఫ్యూల్ ఎఫిషియెంట్), సూపర్ లగ్జరీ ఇంటీరియర్, సైలెంట్ & స్మూత్ డ్రైవ్, అడ్వాన్స్‌డ్ టెక్ ఫీచర్లు.
Lexus ES 300h ప్రత్యేకతలు: Lexus ES 300h ఒక ప్రీమియం హైబ్రిడ్ సెడాన్, లగ్జరీ, కంఫర్టబుల్ కారు. ఇది సెల్ఫ్-చార్జింగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తుంది. సైలెంట్,స్మూత్ డ్రైవ్ ఇస్తుంది.సూపర్ ప్రీమియం లెదర్ ఇంటీరియర్, వెంటిలేటెడ్, హీటెడ్ సీట్స్, 3-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, లెక్సస్ క్లైమేట్ కన్సీర్జ్, రియర్ సీట్స్ రిక్లైనింగ్ తో వస్తుంది. 10 ఎయిర్‌బ్యాగ్స్, Lexus Safety Systemను కలిగి ఉంటుంది. దీని ధర రూ. 62 నుంచి రూ. 68 లక్షలు ఉంటుంది.
సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ ‘జైలర్’ (2023) సూపర్ బ్లాక్‌బస్టర్ సక్సెస్ తర్వాత దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్కు పోర్షే మకాన్ (Porsche Macan) లగ్జరీ SUVను బహుమతిగా ఇచ్చారు.
పోర్షే మకాన్ ప్రత్యేకతలు: ఈ కారు ధర రూ. 88 లక్షల నుంచి రూ. 1.5 కోట్ల వరకు లభిస్తుంది. 2.0L టర్బో పెట్రోల్, 2.9L V6 ట్విన్-టర్బో పవర్‌ఫుల్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. టాప్ స్పీడ్ 232-272 km/h వరకు ఉంటుంది. కాంపాక్ట్ లగ్జరీ SUV, స్పోర్టీ, ఎలిగెంట్ లుక్, ప్రీమియం లెదర్ ఇంటీరియర్, అడ్వాన్స్‌డ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హై ఎండ్ సౌండ్ సిస్టమ్ ను కలిగి ఉంటుంది. ఆల్ వీల్ డ్రైవ్, స్మూత్, థ్రిల్లింగ్ డ్రైవ్, హై సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంటుంది.
Read Also: రూ.10 లక్షల లోపు 5 బెస్ట్ సేఫెస్ట్ కార్లు ఇవే.. టాప్‌లో ఉన్నది ఏ కారంటే?