E-Paper
Advertisement

కారు మీద విండ్ టర్బైన్‌లు పెట్టి ఛార్జింగ్.. నీ తెలివికి ఓ దండం భయ్యా!

కారు మీద విండ్ టర్బైన్‌లు పెట్టి ఛార్జింగ్..  నీ తెలివికి ఓ దండం భయ్యా!
Advertisement

Wind Turbine EV Experiment: ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయ్యింది. ఇందులో చైనాకు చెందిన ఒక ఎలక్ట్రిక్ కారు(EV) యజమాని, తన కారును ఎప్పటికీ ఆగకుండా ఛార్జ్ అవుతూనే ఉండేలా చేయాలని ప్రయత్నించాడు. ఇందుకోసం అతడు తన కారు రూఫ్ మీద నాలుగు చిన్న విండ్ టర్బైన్లను అమర్చి, వాటిని నేరుగా కార్ ఛార్జింగ్ సిస్టమ్‌కు కనెక్ట్ చేశాడు. గాలి వీచినప్పుడు, కారు రన్నింగ్ లో ఉన్నప్పుడు ఈ టర్బైన్లు తిరిగి విద్యుత్ ఉత్పత్తి చేసి, అదే కారు బ్యాటరీని మళ్లీ ఛార్జ్ చేస్తాయని అతను భావించాడు.

ఇంతకీ ఈ ప్రయోగం సక్సెస్ అయ్యిందా?

Advertisement

ఈ ఆలోచన కొత్తగా, ఆసక్తికరంగా అనిపించినప్పటికీ, వాస్తవానికి ఈ ప్రయోగం ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది. కారణం భౌతికశాస్త్రంలోని ప్రాథమిక సూత్రాలు ఇందుకు విరుద్ధంగా ఉండటం. కారు ముందుకు కదులుతున్నప్పుడు, దాని మీద అమర్చిన టర్బైన్‌లు గాలిని అడ్డుకుంటాయి. దీనివల్ల గాలి నిరోధకత పెరుగుతుంది. అంటే, కారు ముందుకు వెళ్లడానికి మరింత పవర్ ను తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడే అసలు సమస్య ఉంది. టర్బైన్లు ఉత్పత్తి చేసే విద్యుత్ కంటే, ఆ టర్బైన్‌ల వల్ల ఏర్పడే గాలి నిరోధకతను ఎదుర్కొనేందుకు కారు ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తుంది. ఫలితంగా, మొత్తం వ్యవస్థలో లాభం కాకుండా నష్టం జరుగుతుంది. సులభంగా చెప్పాలంటే, మీరు ఒక ఫ్యాన్‌ ను ఆన్ చేసి, అదే గాలితో మరో యంత్రాన్ని నడిపి తిరిగి విద్యుత్ పొందాలని ప్రయత్నించడం లాంటిదే ఇది.

సోషల్ మీడియాలో వీడియో వైరల్

Advertisement

ఈ వీడియో నెట్టింట వైరల్ అయిన తర్వాత చాలా మంది ఆశ్చర్యపోయారు. కొందరు దీనిని తెలివైన ఆలోచనగా అంటూ ప్రశంసించగా, మరికొందరు ఇది అసాధ్యమన్నారు. చివరికి, అధికారులు కూడా ఈ మార్పులు భద్రత పరంగా సరైనవి కావని, అలాగే చట్టపరంగా కూడా అనుమతించబడవని స్పష్టం చేశారు. ఇలాంటి మార్పులు వాహనం స్థిరత్వాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. పైగా, రోడ్డు భద్రతా నిబంధనలకు కూడా విరుద్ధంగా ఉంటుంది. అందుకే, ఇలాంటి ప్రయోగాలను సాధారణ రోడ్లపై చేయడం ప్రమాదకరమన్నారు.

Read Also: తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్.. పెట్రోల్, డీజిల్, CNGలో ఏది బెస్ట్ ఫ్యూయెల్!

ఈ ప్రయోగం అందరికీ ఓ కీలకమైన విషయాన్ని గుర్తు చేసింది. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా, ఫిజిక్స్ నియమాలు మాత్రం మారవు. శక్తి సృష్టి, వినియోగం అన్నీ ఒక సమతుల్యతలోనే జరుగుతాయి. ఈ వైరల్ వీడియో ఒక వినోదాత్మక ఉదాహరణ మాత్రమే కాకుండా, శాస్త్ర సూత్రాలను అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో వెల్లడిస్తుంది.

Read Also: సమ్మర్ డ్రైవ్ లో ఫ్యూయెల్ సేవింగ్ ఎలా? ఏసీ వేయాలా? కిటికీలు తెరవాలా?

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×