Atal Pension Yojana: అటల్ పెన్షన్ యోజన(APY) అసంఘటిత రంగంలోని కార్మికులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ స్కీమ్. ఏప్రిల్ 21, 2026 నాటికి ఈ పథకంలో మొత్తం 9 కోట్లకు పైగా చందాదారులు చేరారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 1.35 కోట్లకు పైగా కొత్త చందాదారులు చేరడంతో అత్యంత విజయవంతమైన ఏడాదిగా నిలిచింది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA), అటల్ పెన్షన్ యోజన (APY) పథకాన్ని పర్యవేక్షిస్తుంది. భారత ప్రభుత్వం సామాజిక భద్రతా కార్యక్రమంగా ఈ పథకాన్ని అమలు చేస్తుంది.
మే 9, 2015న అటల్ పెన్షన్ యోజనను ప్రారంభించింది కేంద్రం. ఏపీవైతో కార్మికులకు పదవీ విరమణ ఆదాయంపై దృష్టి పెట్టింది. గత పదేళ్ల కాలంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, సహకార బ్యాంకులు, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీలు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్లు, తపాలా శాఖల్లో ఏపీవై పథకం చందాదారులు గణనీయంగా పెరిగారు.
అటల్ పెన్షన్ యోజన పథకంలో ఆదాయపు పన్ను చెల్లించని 18-40 మధ్య వయస్సు గల పౌరులు.. పదవీ విరమణ సమయానికి పెన్షన్ అందించేందుకు పొదుపు చేసుకునే కార్యక్రమం. ఈ కార్యక్రమం తక్కువ ఆదాయం గల అసంఘటిత కార్మికుల కోసం నిర్మించినది. ఈ పథకం మూడు కీలక ప్రయోజనాల ద్వారా పూర్తి ఆర్థిక రక్షణ లభిస్తుంది.
60 సంవత్సరాల లోపు ఈ స్కీమ్ నుంచి వైదొలిగితే నిర్వహణ ఛార్జీలు మినహాయించి, చందాదారులు తమ చందాలతో పాటు వడ్డీ పొందుతారు. మార్చి 31, 2016కు ముందు తెరిచిన ఖాతాల కోసం ఈ ఆదాయం పొందరు.
Also Read: ప్రైవేట్ ఉద్యోగులకు రూ.5,000 పెన్షన్.. త్వరలో ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం
ఆఫ్‌లైన్ – సేవింగ్స్ బ్యాంకు అకౌంట్ ఉన్న వారు స్థానిక బ్యాంకులు లేదా పోస్ట్ ఆఫీసులలో రిజస్టర్ చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ విధానం