BigTV English

Meher Baba : ప్రేమ స్వరూపులు.. మెహర్ బాబా..!

Meher Baba : ప్రేమ స్వరూపులు.. మెహర్ బాబా..!
Meher Baba

Meher Baba : ‘తోటి మనిషిని ప్రేమించండి.. ఇంతకు మించిన దేవుడి సేవ లేదు’ అంటూ ప్రజల్లో ప్రేమతత్వాన్ని నింపుతూ గొప్ప ఆధ్యాత్మిక విప్లవాన్ని తీసుకొచ్చిన వారిలో మెహర్ బాబా ఒకరు. దైవాన్ని చేరాలంటే.. పూజలు, ధూప, దీప, నైవేద్యాలు, మడి, ఆచారం, తిథి, సంప్రదాయాలు వద్దనీ, మనిషి ప్రేమ తత్వాన్ని అలవరచుకుంటే.. భగవంతుడే స్వయంగా వచ్చి సాక్షాత్కరిస్తాడని బాబా అనేవారు. నేడు ఆయన పుణ్యతిథి. ఈ సందర్భంగా మెహర్ బాబా జీవన విశేషాలు.. మీకోసం


అవతార్ మెహర్ బాబా అసలు పేరు మేర్వాన్. మహరాష్ట్రలోని పూణేలో 1894 ఫిబ్రవరి 25న ఉదయించారు. బాల్యమంతా సాధారణంగా గడిచింది. కాలేజీలో ఉండగా ఒకరోజు.. హజ్రత్ బాబాజాన్ అనే ముస్లిం సాధకురాలిని కలిశారు. ఆమె ఈయనను చూడగానే కన్నీరు కారుస్తూ.. గట్టిగా హత్తుకొని, నుదుటన ముద్దుపెట్టి.. ఆయనలోని దైవత్వాన్ని తట్టిలేపింది. మాయలో జీవిస్తు్న్న మానవాళిని ఆదుకునే అవతారునిగా, భగవత్ స్వరూపంగా ఆమె తొలిక్షణంలోనే గుర్తించింది. అప్పటి నుంచి బాబా ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైంది.

తర్వాత ఒకరోజు మెహర్ బాబా షిరిడీ వెళ్లారు. అది గురువారం కావటంతో షిరిడి సాయి తన భక్తులతో ఊరేగింపుగా పట్టణ వీధుల్లో వెళుతున్నారు. ఆయన మెహర్ బాబా నిలబడిన దగ్గర ఆగి ‘పర్వద్విగార్’ అని పెద్దగా సంబోధించారట. సాయిబాబా అన్నమాటకు ‘భగవంతుని అవతారం’ అని అర్థం.


షిరిడి నుంచి వచ్చాక.. 1925 నుండి 1969 వరకు (44 సంవత్సరాలు) మెహర్ బాబా కఠోర మౌనం వహించారు. ఈ సమయంలో ఆయన మౌనంగా ఉంటూనే భక్తులకు సందేశమిచ్చారు. ఈ మౌనకాలంలో గాడ్ స్పీక్స్, ఎవ్రిథింగ్ ఆండ్ నథింగ్, మెహెర్ బాబా డిస్కోర్స్, దా వే ఆఫ్ ఫేర్స్ అనే ఎన్నో పుస్తకాలు రాశాడు.

ఈ మౌన దీక్షా కాలంలోనే బాబా అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండు వంటి పలు విదేశాల్లో పర్యటించారు. మంత్ర శక్తుల ప్రదర్శనలు, విభూది ప్రసాదాల వంటి వాటి ప్రస్తావన లేకుండా ప్రజలకు ప్రేమ తత్వాన్ని బోధించాడు. ప్రేమ ఎంతటి శత్రవునైనా జయించగలదని, అందుకే అందరినీ ప్రేమించమని చివరి వరకు చెబుతూ వచ్చారు.

తాను అన్ని విశ్వాసాలకూ ప్రతీకనని, ఎదుటివారిని ప్రేమించటానికి మతం అవసరం లేదనీ, తనను నమ్మినవారికి తానే పరమాత్మనని చెప్పేవారు. జీవితపు చివరి క్షణాన్నీ మౌనంలోనే గడిపిన బాబా 1969 డిసెంబర్ 31న జీవ సమాధిని పొందారు. తాను మౌనం దాల్చిన జూలై 10వ తేదీన తన భక్తులందరినీ ఒక్క రోజైనా మౌనదీక్ష చేయమని బాబా ఆదేశించారు. అందుకే ఆయన భక్తులకు అదో పండుగ రోజుగా మారింది. మనిషిని మనిషి శత్రువుగా భావిస్తున్న ఈ రోజుల్లో మెహర్ బాబా ‘ప్రేమతత్వం’, ఆయన ప్రవచనాలు మనకు తప్పక దారి చూపగలవు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×