BigTV English

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

AP Politics: మొన్నటి దాక నో పాలిటిక్స్ అన్నారు మాజీ ఎంపి గల్లా జయదేవ్.. ఇప్పుడు స్వరం మార్చి రాను అనుకున్నారా‌‌‌‌.. రాలేననుకున్నారా … దేవుని అనుగ్రహం ఉండాలే కాని రీ ఎంట్రీకి అడ్డమేంటని అంటు డైలాగులు పేలుస్తున్నారు .. అవే ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్‌గా మారాయి .. మళ్ళీ ఆయన ఎంట్రీ ఉంటుందా‌…. ఉంటే ఎలా ఉండబోతోంది? ఇంతకు ఆయన ఎందుకు మళ్ళీ రాజకీయ రంగ ప్రవేశానికి ప్రయత్నాలు మొదలెట్టారు? తప్పు చేశామని ఫీల్ అయ్యారా? భవిష్యత్ అవకాశాలు మిస్ కాకుండా ఉండటానికా? అసలు టీడీపీలో గల్లా కుటుంబం రీ ఎంట్రీ ఎలా ఉండబోతోంది?


రాజకీయాలకు గుడ్ బై చెప్పిన గల్లా‌ జయదేవ్ కుటుంబం

గత ఎన్నికల ముందు రాజకీయాలకు గుడ్ బాయ్ చెప్పిన గల్లా జయదేవ్ కుటుంబం మళ్ళీ టీడిపీ లోకి రీఎంట్రీ పై హాట్ హాట్ చర్చలు సాగుతున్నాయి. పాతూరి రాజగోపాల్ నాయుడు చిత్తూరు జిల్లాలోనే కాకుండా ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో ఉద్దండు. ఎంచి రంగ అనుచరుడిగా ఆయనకు ఎంతో పేరు ఉంది. రంగా కోసం తన ఎంపీ సీట్లు సైతం త్యాగం చేసిన వ్యక్తి రైతుల కోసం నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి మరోవైపు సామాజిక సేవలో భాగంగా రాయలసీమలోని అతి పెద్దదైన ఎన్జీఓస్ ను కూడా ఆయన స్థాపించారు. 1955 చిత్తూరు శాసన సభ్యుడిగా 1973 లో చంద్రగిరి మొట్టమొదటి శాసన సభ్యుడిగా ఎంపికైన సీనియర్ ఆయన.


చిత్తూరు ఎంపీగా వరుసగా 2 సార్లు విజయం

చిత్తూరు పార్లమెంట్ నుంచి 1977 80, 1980, 84 లలో రెండు దఫాలు రాజగోపాల్ నాయుడు ఎంపీ గా ప్రాతినిధ్యం వహించారు. తర్వాత స్వాతంత్ర పార్టీ నుంచి ఎన్జీ రంగాను గుంటూరు నుంచి చిత్తూరుకు తీసుకువచ్చి మరి గెలిపించారు. అంతేకాక బహుముఖంగా ఆయన సమాజంపై తన ప్రభావం చూపించారు. రచయితగా పలు పుస్తకాలు రచించారు. చంద్రగిరి మొట్టమొదటి శాసన సభ్యుడు కూడా ఆయనే చంద్రబాబు నాయుడుకి సైతం మొదట్లో సాయపడ్డారన్నది అందరికీ తెలిసిందే. అలాంటి రాజగోపాల్ నాయుడు వారసురాలుగా ఆయన ఏకైక కుమార్తె గల్ల అరుణ 1989 ఎన్నికల్లో రాజకీయ రంగ ప్రవేశం చేసి కాంగ్రెస్ నుంచి చంద్రగిరి ఎమ్మెల్యే గా విజయం సాధించారు.

రామ్మూర్తినాయుడు చేతిలో పరాజయం పాలైన అరుణ

1994 లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సోదరుడు రామమూర్తి నాయుడు చేతుల్లో గల్ల అరుణ ఓటమి పాలయ్యారు. తర్వాత 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. వైయస్ రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డిల పాలన కాలంలో 10 సంవత్సరాల పాటు మంత్రిగా పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 లో జరిగిన ఎన్నికల్లో చంద్రగిరి నుంచి టిడిపి తరపున పోటీ చేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పట్లో పార్టీ మారి వచ్చిన ఆమెను టీడిపి వారి ఆమెను ఓడించాలని ప్రచారం జరిగింది. తర్వాత టీడిపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా పొలిట్ బ్యూరో సభ్యురాలుగా పనిచేసినప్పటికీ ఎన్నికల్లో పోటీకి గల్ల అరుణ దూరంగా ఉండిపోయారు.

గుంటూరు ఎంపీగా 2 సార్లు గెలిచిన గల్లా జయదేవ్

అయితే ఆ కుటుంబానికి చెందిన ఆమె కుమారుడు గల్లా జయదేవ్ సక్సెస్ఫుల్ బిజినెస్ మన్ గానే కాకుండా సక్సెస్ఫుల్ పొలిటీషియన్ గా కూడా తనను తాను నిరూపించుకుంటున్నారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండు మార్లు గుంటూరు లోక్సభ స్థానం నుంచి టీడిపి తరపున ఆయన ఎన్నికయ్యారు. పార్లమెంట్లో మోడీని సూటిగా ప్రశ్నించి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు గల్లా జయదేవ్. వైసపి తోను డి అంటే డి అనేలా జయదేవ్ పోరాడారు. అంతవరకు బాగానే ఉన్న గత ఐదేళ్లుగా గల్లా కుటుంబం వైసపి ప్రభుత్వ హాయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది.

అమరరాజా సంస్థపై వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు

ముఖ్యంగా కాలుష్యాన్ని వెతిజెల్లుతుందని అమరరాజ సంస్థపై వైసపి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. పొల్యూషన్ బోర్డ్ అధికారులు రంగంలోకి దిగి అమరరాజ సంస్థకు వరస నోటీసులు ఇచ్చారు. ఈ సంస్థ వెతిజెల్లుతున్న కాలుష్యం ద్వారా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని నీరు కలుషితం అవుతుందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆరోపించింది. చివరకు ఈ వ్యవహారం కాస్త అమర్రాజ సంస్థకు క్లోజర్ నోటీసులు ఇచ్చే వరకు వెళ్ళింది. దీంతో అమర్రాజా యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారం ఇప్పటికీ కూడా కోర్టులో నడుస్తుంది.

గల్లా కుటుంబంపై భూ ఆక్రమణ కేసులు

ఇక చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం దిగువ మాగం గల్లా కుటుంబం స్వగ్రామం. గల్లా కుటుంబంపై జగన్ హాయంలో అక్కడ భూ ఆక్రమణల కేసులు నమోదయ్యాయి. తమ భూములు ఆక్రమించాలని ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గల్ల రామచంద్ర నాయుడు గల్ల అరుణకుమారి తైతరులపై పోలీస్ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారంపై కూడా కోర్టులో కేసు నడుస్తోంది. గుంటూరులో కూడా ఎంపి జయదేవ్ ఊహించని విధంగా వైసపి కార్యకర్తలు పోలీసుల దాడులతో జయదేవ్ రాజకీయాల పట్ల విరక్తి పెంచుకున్నారని అంటున్నారు. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అనింత ధైర్యంఉన్న జయదేవ్ క్షేత్ర స్థాయి క్యాడర్తో సమన్వయం చేసుకోలేకపోవడంతో పాటు రాజకీయాలను కూడా కంపెనీ లాగా నడిపారని అప్పట్లో అనుకునేవారు. ఈ పరిణామాలన్నీ గల్లా కుటుంబీకులను బాగా కలిచివేయడంతో రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు.

గత ఎన్నికల్లో పోటీకి దూరమై అవకాశం పొగోట్టుకున్న జయదేవ్

గత ఎన్నికల్లో పోటీకి సైతం గుంటూరు నుండి పోటీకి గల్లా జయదేవ్ దూరంగా ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం భారీ విజయం సాధించడంతో పాటు గుంటూరు నుండి గెలిచిన పిమ్మసాని ఏకంగా సెంట్రల్ మినిస్టర్ అవ్వడంతో గల్లా జయదేవ్ మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నారనే భావనలో గల్లా శ్రేయోభిలాషులు ఉన్నారట. ఇదే విషయాన్ని సన్నిహితుల వద్ద గల్లా కూడా పలుమార్లు చెప్పుకొచ్చినట్టు సమాచారం. మరో ఏడాదిలో రాజ్యసభా స్థానాల భర్తీ ఉండడంతో ఇదే సరిన సమయంగా భావించిన గల్లా జయదేవ్ పొలిటికల్ రీఎంట్రీ పై తన కోరికను బయట పెట్టారని ప్రచారం సాగుతుంది.

వ్యాపార అవసరాల కోసం పార్టీని వీడి పోయారని విమర్శలు

గల్లా కుటుంబం రాజకీయాల్లో తిరిగి యక్టివ్ అవుతామంటే టీడిపి అధినేత చంద్రబాబు కాదనే పరిస్థితి లేదంటున్నారు. ఆ క్రమంలోని తాజాగా కానిపాకంలో దేవుడి అనుగ్రహం నా అవసరం ఉంటే మళ్ళీ రాజకీయాలోకి వస్తా పార్టీ పెద్దలతో చర్చిస్తున్నాను అంటూ గల్లా జయదేవు చెప్పడం వెనుక ఉద్దేశం అదే అంటున్నారు. దేవుడు ఏమనుకుంటే అదే దాని తప్ప ఇంకేమీ దేవుడు అనుకుంటే వస్తా ఇంకా టైం ఉంది లీడర్షిప్ తో మాట్లాడుతున్నా చూద్దాం అవసరం ఉంటే తప్పకుండా వస్తా నా అవసరం ఉంటే తప్పకుండా వస్తాం జయదేవ్ వ్యాఖ్యలు టీడీపీలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. అయితే రాజ్యసభకు ఇప్పటికే పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ ఆసక్తి రేపుతుంది.

Also Read: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

ఢిల్లీలో పరిచయాలుఉన్న జయదేవ్ వస్తే పార్టీకి మరింత మేలే జరుగుతుంది అనే భావన కొందరు పార్టీ పెద్దల్లో ఉన్నట్లు సమాచారం. అయితే జయదేవుని వ్యతిరేకించే వాళ్ళు పార్టీలో లేకపోలేదు. పార్టీ కష్ట సమయాల్లో ఉండి పోరాటం చేయాల్సిన సమయంలో దూరంగా ఉండడంపై గల్ల కుటుంబంపై ఫైర్ అవుతున్నారు కొద్దిమంది నేతలు. అప్పుడు వ్యాపార అవసరాల కోసం పూర్తి స్థాయిలో సైలెంట్ అయి ఇప్పుడు అధికారంలో ఉన్నామని తిరిగి ఎంట్రీ ఇవ్వడం పైన పార్టీలో కొందరు సీనియర్లు జయదేవ్ వైకరిని తప్పుపడుతున్నారు. మరి చూడాలి ఇలాంటి పరిస్థితుల్లో గల్లా కుటుంబం పొలిటికల్ రీఎంట్రీ ఎప్పుడు ఎలా ఉంటుందో..

Story By Venkatesh, Bigtv

Related News

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

Big Stories

×