Siddipet Congress: మనం ప్రతిపక్షం కాదు అధికార పక్షం అని ఎంత ముత్తుకున్న సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ నేతల తీరు మారడం లేదట. వాస్తవానికి ఆ జిల్లాలో కాంగ్రెస్ కు పెద్దగా పట్టు లేదు. దీర్ఘకాలం తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన అక్కడి నేతలు అంతా మా ఇష్టం అన్నట్టు వ్యవహరిస్తుండడం చర్చని అంశంగా మారింది. జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన ఇతర ముఖ్యమంత్రులు వచ్చిన మాఘోలు మాత్రం మాది అంటున్నారట. గల్లాలు పట్టుకొని అంగీలు చినిగేలా గుండెలు తెగిపోయే అలా కసితో కొట్టుకున్నారట. ఇంతలా కుమ్మేసుకుంటున్న ఆ నేతలు ఎవరు కుమ్మలాటకు కారణాలుఏంటి?
సిద్దిపేట జిల్లాలో బలం లేని కాంగ్రెస్ పార్టీ
సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా బలం లేదు. ముందు నుంచి కాంగ్రెస్ కు అక్కడ పట్టు తక్కువే. జిల్లాలోని దుబ్బాక గజ్వేల్ నియోజక వర్గాల్లో 2009 లో చివరిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు. సిద్దిపేటలో అయితే 1983 లో చివరిసారి కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహించింది. గత కొన్ని పర్యాయాలుగా ఈ నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ బలం తగ్గుతూ వస్తుంది. 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ గజ్వేల్ దుబ్బాకలో మూడో స్థానంలో సిద్దిపేటలో మాత్రం రెండో స్థానంలో అతి కష్టంపై పార్టీ గెలిచింది. అయితే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలో రావడంతో జిల్లా కాంగ్రెస్ నేతలు జోష్లో ఉన్నారు.
షాడో ఎమ్మెల్యేలుగా చెలామణి అవుతున్న కాంగ్రెస్ ఇన్చార్జులు
నియోజక వర్గ కాంగ్రెస్ ఇంచార్జ్లే షాడో ఎమ్మెల్యేలుగా చలామణి అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అదలా ఉంటే ప్రస్తుత ప్రతిపక్ష బీఆర్ఎస్ లో మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావ్ గజ్వేల్ సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అంతకుముందు నుంచి సిద్దిపేటలో కేసీఆర్ కుటుంబానిదే ఆధిపత్యం. కేసీఆర్ టిడిపీ లో ఉన్నప్పటి నుంచి అక్కడ 1985 నుంచి 1999 వరకు వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యే గా గెలిచారు. తర్వాత టిడిపీ లో మంత్రి పదవి దక్కలేదని బీఆర్ఎస్ పేరుతో సొంత కుంపటి పెట్టుకున్న కెసీఆర్ 2011 లో ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి తన సొంత బ్యానర్ పై బైపోల్స్ లో గెలిచారు. 2004 ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ నుంచి మరోసారి విజయం సాధించారు.
సిద్దిపేటలో హరీష్‌రావు అప్రహిత విజయాలు
కేసీఆర్ తర్వాత ఆయన మేనల్లుడు హరీష్రావ్ సిద్దిపేటలో ఇప్పటివరకు అప్రహిత విజయాలు నమోదు చేసుకుంటూ వస్తున్నారు. అలాంటి ప్రతిపక్ష అగ్రనేతలు ఉన్న నియోజక వర్గాల్లో అధికార పార్టీ బలంగా ఉండాలి. పార్టీ నేతలు కార్యకర్తలు కలిసికట్టుగా పని చేస్తేనే ఏదైనా సాధ్యమవుతుంది. అయితే కలిసి ఉంటే కలదు సుఖం అన్న విషయం జిల్లా కాంగ్రెస్ నేతలు మర్చిపోయారు ఏమో కానీ అధికారంలో ఉన్నా లేకున్నా గ్రూపులు కడుతూ ఆ జిల్లాలో కాంగ్రెస్ నేతలు ఎవరి రాజకీయం వారు చేస్తుండటం విమర్శల పాలవుతుంది.
దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లోను వర్గ విబేధాలు
తాజాగా జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ పర్యటనలు వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి ముందే నరసారెడ్డి శ్రీకాంత్ వర్గాలు కొమ్ములాటకు దిగాయి. గల్లాలు పట్టుకొని అంగీలు చినిగేలా కొట్టుకున్నారు. అంతటితో ఆగకుండా జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి పై సొంత పార్టీ నేతలే కులం పేరుతో దోషించడాన్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేస్ కూడా నమోదయింది. ఇక దుబ్బాక సిద్దిపేట నియోజక వర్గాల్లోనూ వర్గ విభేదాలు ఉన్నాయి. నియోజక వర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, శ్రవణ్ కుమార్ రెడ్డిల మధ్య ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయి.
సిద్దిపేట కాంగ్రెస్‌లో ఆరుకు పైగా గ్రూపులు
ఆ క్రమణంలో గత కొన్ని రోజులుగా శ్రవణ్ కుమార్ రెడ్డి నియోజక వర్గానికి దూరంగా ఉన్నారు. చెరుగు శ్రీనివాస్ రెడ్డి మాత్రం నియోజక వర్గంలో పర్యటిస్తున్నారు. ఇక హరీష్రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజక వర్గంలో పార్టీ అంతంత మాత్రంగా ఉన్న గ్రూపులు మాత్రం ఆరుకు పైగా ఉండటం గమనార్హం. నియోజక వర్గ ఇంచార్జ్ హరికృష్ణ అంటే పార్టీలో సీనియర్లకు పడటం లేదట. ఆయన చేసే పార్టీ ప్రోగ్రాంలో ఏదో రకంగా ఆటంకాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారట. సొంత పార్టీ నాయకులే సీనియర్లపై జూనియర్ పెత్తనం ఏంటని వాదిస్తూ చర్చకు దిగుతున్నారు.
ఇలా సిద్దిపేట జిల్లాలో ఏ నియోజక వర్గంలో చూసిన అధికార కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల గోల సర్వసాధారణంగా మారిందట. దాంతో కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు నేతలపై గుర్రుగా ఉన్నారట. పార్టీ అధికారంలోకి వచ్చిన మీరు మారరా అంటూ గుస్సా అవుతున్నారట నేతల సొంత ప్రయోజనాల కోసం పార్టీని సర్వనాశనం చేస్తున్నారని మండిపడుతున్నారట అధిష్టానం ఈ జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టి గ్రూపులు కట్టి వాటిని ప్రోత్సహిస్తున్న నేతల పని పట్టాలని కోరుకుంటుందట క్యాడర్ మరి సిద్దిపేట జిల్లాలో గ్రూపుల గోలకు అధికార కాంగ్రెస్ పార్టీ ఏ అభయ హస్తం ఇచ్చి చెక్ పెడుతుందో చూడాలి.
Story By Venkatesh, Bigtv