BigTV English
Advertisement

Gautam Buddha : అష్టాంగ మార్గంతోనే వ్యక్తిత్వ వికాసం..!

Gautam Buddha : అష్టాంగ మార్గంతోనే వ్యక్తిత్వ వికాసం..!
Gautam Buddha

Gautam Buddha : దు:ఖానికి కారణాన్ని అన్వేషించేందుకు ఓ 29 ఏళ్ల యువరాజు ఒక అర్థరాత్రి .. తన భార్యా పిల్లలను అంతఃపురంలో వదిలేసి, అనంత ప్రపంచంలోకి నడిచాడు. మనిషి.. తన కోరికలను నియంత్రిస్తేనే సంతోష ద్వారాలు తెరుచుకుంటాయని తన ఆరేళ్ల సత్యాన్వేషణ తర్వాత తెలుసుకున్నాడు. ఆ సత్యాన్ని ఆచరించి, ప్రపంచానికి అష్టాంగమార్గం పేరుతో బోధించాడు కూడా. ఆచరించగలిగితే.. నాడు బుద్ధుడు చెప్పిన 8 సూత్రాలు.. ఒత్తిళ్లతో చిత్తవుతున్న ఔషధంలా పనిచేయగలవు.


1) జీవితాన్ని సరిగా అర్థం చేసుకోవటం, దానిపట్ల సానుకూల దృక్పథాన్ని అలవరచుకోవటంలోనే విజయం ఉందని బుద్ధుడు చెబుతాడు. ఇక్కడ సానుకూల దృక్పథం అంటే.. లోతైన దృష్టికోణాన్ని, దృక్పథాన్ని కలిగి ఉండటం అని అర్థం.

2) మనిషికి స్పష్టమైన జీవిత లక్ష్యం ఉండాలని, ఆ లక్ష్యం, సాటి మనిషి ప్రయోజనాలను, మన సమాజపు ప్రయోజనాలను దెబ్బతీసేదిగా ఉండకూడదు. ఈ సూత్రాన్ని ఆచరించటం మూలంగానే డా. అంబేద్కర్ యావత్ భారతపు ఆమోదం పొందగలిగే స్థాయిలో రాజ్యాంగాన్ని రచించగలిగారని చెప్పొచ్చు.


3) మనం చెప్పే విషయంపై స్పష్టమైన అవగాహన ఉండాలి. అలాగే.. ఎదుటివారిని నొప్పించకుండా దానిని వ్యక్తీకరించగలగాలి. అదే సమయంలో వాడే భాషకి, చెప్పే మాటకి, చేసే ఆలోచనకి మధ్య సమన్వయం ఉండాలి.

4) మన సత్ప్రవర్తన ఎదుటివారిలో మనపట్ల ఒక మంచి అభిప్రాయాన్ని కలిగిస్తుంది. అంటే.. సామాజిక మర్యాదలను పాటించటం, ఎదుటివారికి గౌరవం ఇవ్వటం, ఎదుటివారికి అనుకూలంగా ప్రవర్తించటానికి ప్రయత్నించటం, చివరగా పని మీద దృష్టి పెట్టడం.

5) ఎదుటివారిని నొప్పించకుండా, ఏడిపించకుండా, సమాజానికి హాని చేయకుండా ధర్మ మార్గంలో జీవనోపాధిని ఏర్పాటుచేసుకుని, జీవితానికి కావలసిన దానిని సంపాదించుకోవటం

6) విజయ సాధనకు సరైన, గట్టి ప్రయత్నాలు చేయడం చాలా ముఖ్యం. ఈ క్రమంలో మనం చేసే ప్రయత్నం ఎదుటివారికి హాని కలిగించకుండా, దర్మబద్ధంగా ఉండేలా చూసుకోవటం

7) అనవసరమైన విషయాలను వదిలేసి, మనిషి తన ఏకాగ్రతను పెంచుకోవాలి. సామాజిక మార్పులను మార్పులను గమనిస్తూనే.. వాటిలో మనకు అవసరమైన వాటిని స్వీకరించేందుకు సిద్ధపడాలి.

8) మనిషి జీవితంలోని ప్రతి క్షణాన్ని ఒక పండుగలాగా ఆస్వాదించాలి. Enjoying the bliss of life which is the result of our sincere efforts. బుద్ధుని భాషలో ఇదే ఆత్మానందం.

Related News

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Kartika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు.. ఎన్ని దీపాలు వెలిగించాలి ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో నారికేళ దీపం వెనుక అద్భుత రహస్యాలు.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..

Vastu tips: రాత్రి పడుకునేటప్పుడు మంచం పక్కన నీళ్ల బాటిల్ పెట్టుకోకూడదా?

Vastu Tips: గుర్రపు నాడా ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మంచిదా? ఆచారం వెనుక ఉన్న అర్థం ఏమిటి?

Big Stories

×