BigTV English
Advertisement

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Chennur Politics: గులాబీ పార్టీలో ముఖ్యనేతలకు అత్యంత వీరవిధేయుడు మాజీ ఎంపీ కమ్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. పార్టీలోని ముఖ్య నాయకులలో ఒకరిగా ఎదిగిన దళిత, విద్యార్ధి నాయకుడాయన. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సన్నిహితుడు.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తన రాజకీయ గురువు, ఆర్ధికంగా ప్రోత్సహించిన గడ్డం వివేక్‌పై పెద్దపల్లి ఎంపీగా గెలుపొంది చరిత్ర సృష్టించారు. తర్వాత తెలంగాణ ముందస్తు ఎన్నికల్ల చెన్నూర్ ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్లో అంత హడవుడి చేసిన సుమన్ ఎక్కడ కనిపించడం లేదని అంటున్నారు… అసలు సుమన్ మళ్ళీ తిరిగి చెన్నూరుకు వస్తారా..? బాల్క సుమన్ తో చెన్నూరు ప్రజలకు రుణం తీరిపోయిందా..?


ఫైర్ బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్న బాల్క సుమన్

బాల్క సుమన్.. తనదైన నోటి దూకుడుతో… తెలంగాణ ఉద్యమ సమయంలో ఫైర్ ప్రైండ్ ఇమేజ్ సంపాదించుకున్న గులాబీ పార్టీ నాయకుడు… ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన సుమన్, 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడం ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర సమితి విభాగమైన ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి విభాగం … టీఆర్ఎస్వీకి 2007లో అధ్యక్షులుగా పనిచేశానే. టిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం టీఆర్ఎస్వీకి 2010లో రాష్ట్రాధ్యక్షుడిగా పనిచేశారు. 2009, 2014 మధ్యకాలంలో తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమైన పాత్ర పోషించారు


2014లో పెద్దపల్లి ఎంపీగా గడ్డం వివేక్‌పై విజయం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వివేకానంద్ పై 2,91,158 ఓట్ల ఓట్ల మెజారిటీతో 16వ పార్లమెంటు సభ్యుడిగా గెలుపొందారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ తరపున చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటి చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోర్లకుంట వెంకటేష్ అనే నేతపై 28,132 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తర్వాత బీఆర్ఎస్‌గా మారిన టీఆర్ఎస్‌లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ముందు నుంచి అత్యంత సన్నిహితుడైన బాల్క సుమన్ 2022 జనవరి 26న గులాబీ పార్టీ, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యారు.

గులాబీ పార్టీలో ముఖ్య దళిత నేతగా గుర్తింపు తెచ్చుకున్న సుమన్

ఆ క్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వేరుపడిన మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు బీఆర్ ఎస్ లో ముఖ్య నాయుడిగా పేరుంది. పార్టీ తరపున వాయిస్ వినిపించడంలో ఎప్పుడూ ముందుండే వారు. అయితే గత ఎన్నికల్లో ఓటమి పాలవడంతో ఎన్నికలు జరిగిన నాటినుండి నేటి వరకు చెన్నూరు నియోజవర్గంలో కనిపించడం లేదట. కేసీఆర్ రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు.. ఎంపీగా, ఎమ్మెల్యేగా తెగ హడావుడి చేసిన బాల్క సుమన్ దళిత కోటాలో తనకు మంత్రి పదవి వస్తుందని ఆశించారు. అయితే కేటీఆర్ ఆశీస్సులున్నా.. కేసీఆర్ మాత్రం ఆయనకు అవకాశమివ్వలేదు

గత ఎన్నికల్లో వివేక్‌కు సవాళ్లు విసిరిన బాల్క సుమన్

చెన్నూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచి దళిత కోటాలో మంత్రి పదవి వస్తుందని ఆశించిన సుమన్ ప్రభుత్వ విప్ పదవితో తృప్తి పడాల్సి వచ్చింది. సీన్ కట్ చేస్తే ఆ చెన్నూరు మాజీ ఎమ్మెల్యే ఎక్కడా కనిపించడం లేదంట.. కేసీఆర్, కేటీఆర్ కు సన్నిహిత సంబంధాలు ఉండటంతో బీఆర్ఎస్లో ముఖ్య నాయకుడిగా హాడావుడి చేసిన తమ మాజీ ఎమ్మెల్యే ఎక్కడని ప్రశ్నిస్తున్నారట చెన్నూర్ నియోజకవర్గ ప్రజలు.. గత ఎన్నికల్లో కాకా తనయుడు వివేక్ కు దమ్ము ఉంటే తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరిన బాల్క సుమన్ ఓటమి పాలవడంతో నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారట.

Also Read: మరి కాసేపట్లో భారీ వర్షం.. త్వరగా ఆఫీసులకు చేరుకోండి, లేకపోతే…

ప్రజలకు చేరువయ్యే యత్నం చేస్తున్న దుర్గం చిన్నయ్య దివాకర్‌రావు

ఒక పక్క ఇతర నియోజకవర్గాల్లోని మాజీ ఎమ్మెల్యే లు దుర్గం చిన్నయ్య, నడిపల్లి దివాకర్‌రావు లు ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నా తమ మజీ ఎమ్మెల్యే మాత్రం కనిపించకపోవడంపై చెన్నూరు ప్రజలల్లో బిన్నవాదనలు వినిపిస్తున్నాయట.. కేవలం తన అవసరానికి చెన్నూరు నియోజకవర్గం నుండి పోటీ చేశారు.. ఓడిపోయాక కనీసం ఇటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని చర్చించుకుంటున్నారట.. సాక్షాత్తు మాజీ ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంతో నియోజకవర్గంలోని క్యాడర్ కూడా తలో దారి అన్నట్టు అయ్యారట.. చెన్నూరు నియోజక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పురాణం సతీష్ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో అడప దడప నాయకులు తప్ప బీఆర్ఎస్‌కు చెన్నూరు నియోజకవర్గంలో పెద్ద దిక్కు లేకుండా పోయిందట.. ఏదిఏమైనా చెన్నూర్ నియోజకవర్గంలో స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళనైనా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నియోజకవర్గంలో అడుగుపెడతారా..? లేదా చెన్నూరు నియోజకవర్గంతో సంబంధాలు పూర్తిగా తెంచేసుకున్నారా..? వేచి చూడాలి మరి.

Story By Rami Reddy, Bigtv

Related News

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Jubilee Hills Bypoll: నవంబర్ సెంటిమెంట్.. బైపోల్స్‌లో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా!

Kolikapudi Srinivasa Rao: కొలికపూడికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Kalvakuntla Kavitha: జూబ్లీహిల్స్ బైపోల్‌.. బీఆర్ఎస్‌కు కవిత గండం

Kalvakuntla Kavitha: కవిత టార్గెట్.. కారు పార్టీ.. టచ్‌లో ఆ నేతలు?

Vijayanagaram TDP: టీడీపీ జిల్లా.. రథసారథి ఎవరో?

Jubilee Hills Bypoll: కాంగ్రెస్ మైలేజ్ తగ్గిందా? ప్రచారంపై అధిష్టానం నిఘా

Rajamohan Reddy: మేకపాటి మాటలు.. జగన్ చెవిలో పడేనా?

Big Stories

×