Tirumala Goshala Issue: గోశాలలో గతమూడు నెలలలో వంద ఆవుల మృతి చెందాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి కామెంట్స్ తర్వాత రాజకీయం వెడెక్కింది.. అయితే అయన పాలక మండలి సభ్యుడిగా, చైర్మన్ గా ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో ఎన్ని ఆవులు మరణించాయి? నెలకు ఎన్ని మరణించాయి? వరదలలో మరణించినవి ఎన్ని?అప్పట్లో ఉన్న సంకర జాతి ఆవులు ఎక్కడికి పోయాయి? ఆ విషయాలను కూడా మాజీ చైర్మన్ బయట పెట్టాలి కదా అంటున్నారు? అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా ఏంటి? జరిగిపోతున్న దారుణాలేంటో? చెప్పకుండా.. పూర్తి సమాచారం బహిర్గతం చేయకుండా… రామాయణంలో పిడకల వేటలాగా హాడావుడి చాలెంజ్‌లు ఎందుకని సామాన్య భక్తులు సైతం మండిపడుతున్నారు
తిరుపతి, పలమనేరు, కరిమల్లయ్యపల్లి, తిరుమలలో గోశాలలు
తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలు అనేక మంది దాతలు ఇచ్చిన ఆవులను సంరక్షిస్తూ విధులు నిర్వహిస్తాయి. మొత్తం నాలుగు గోశాలలు టీటీడీ అధ్వర్యంలో నడుస్తున్నాయి. ఇందులో ముఖ్యమైంది తిరుపతిలో ఉన్న గోశాల. తర్వాత పలమనేరు, కరిమల్లయ్యపల్లి, తిరుమల.. ఈ వి ధంగా గోశాలల నిర్వహాణకు ప్రత్యేకంగా ఓ డైరెక్టర్ తో పాటు సిబ్బందిని నియమించింది టీటీడీ. 2019 లో అధికార మార్పిడి జరిగిన తర్వాత గోమాత పూజలు, గో సంరక్షణ అంటూ ప్రత్యేకంగా అప్పటి పాలక మండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో పాటు, మాజీ ఈఓ ధర్మారెడ్డిలు హడావుడి చేసారు.
గోవ్యవసాయ ఆధారిత ఉత్పత్తులకు పెద్దపీట అని హడావుడి
గోవ్యవసాయ ఆధారిత ఉత్పత్తులకు పెద్దపీట వేస్తామని వైసీపీ ప్రభుత్వ హయాంలో వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని టీటీడీ పాలకవర్గం ఘనంగా ప్రకటించింది. వైఎస్అర్‌సీపీ వ్యవస్థాపకుడు అయిన శివకూమార్ కూడా వారితో కలిసాడు. అయనకు ప్రత్యేకంగా ప్రాజెక్టులు ఇచ్చారు. అప్పటి ఈఓ వెటర్నటీ వైద్యుడు కావడంతో అయన సైతం పునరోత్పత్తి కార్యక్రమం పేరుతో టీటీడీ నుంచి వెటర్నటీ యూనివర్సిటికి నిధులు ఇచ్చి పరిశోదనలుకు ఓకే అన్నారు. అయితే అందతా సరిగా జరిగి ఉంటే ఓకే..
2019కి ముందు గోశాలలో 100కి పైగా జెర్సీ అవులు
2019కి ముందు గోశాలలో జెర్సీ అవులు కూడా వందకు పైగా ఉండేవి. అయితే తర్వాత దేశవాళి ఆవుల పేరుతో ఆ ఆవులను తరిమేసారు. అయితే వాటిని ఎవరికి ఇచ్చారు, అమ్మారా లేక కబేళాలకు తరలించారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అక్కడ పనివారు చెబుతున్న సమాచారం మేరకు బ్రూసల్లోసిస్ అనే వ్యాధి బారిన పడిన ఆవులను అప్పటి డైరెక్టర్ అయిన హారినాథ్ రెడ్డి చికిత్స చేయించుకుండా వదిలేయడంతో అవి దారుణంగా మరణించాయంట. అయితే వాటి రికార్డులు మాత్రం లేవు. ఇక కరోనా తర్వాత వచ్చిన వరదల వల్ల వచ్చిన నీటితో గోశాల గోడలు కూలి నీరంతా గోశాలలో చేరిపోయింది. ఆ వరదల్లో ఏకంగా 70 కి పైగా ఆవులు మరణించాయిని అంటున్నారు. అయితే దానిపై ఏమాత్రం స్పందించడం లేదు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.
3 నెలలకు ఒకసారి గోవులు జనన మరణ రికార్డులు
ప్రతి మూడు నెలలకొకసారి ఆవుల కు సంబంధించిన జనన మరణాలను రికార్డులను డైరెక్టర్ రూపొందించి.. ఈఓతో పాటు పాలక వర్గానికి సమర్పించాలి. అయితే అప్పటి రికార్డులు ఏవీ కన్పించడం లేదని అంటున్నారు. ఆ క్రమంలో 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు మరణాల రికార్డులను మీడియా ముందు పెట్టిన భూమన గత ఐదు సంవత్సరాల రికార్డులను కూడా బయట పెట్టి తన సచ్ఛీలతను నిరూపించుకోవాలని టీటీడీతో పాటు కూటమి శ్రేణులు అంటున్నాయి. దానికి తోడు గత ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలలలో ఎన్నికల కమిషన్ పరిపాలన అయినప్పటికి చైర్మన్‌గా భూమన ఉన్నారు. అప్పట్లో వ్యవస్థలు ఏమి మారలేదు .మరి రికార్డులు ఎందుకు బహిర్గతం చేయలేదని ప్రశ్నిస్తున్నారు
టీడీలో తన శ్రేయోభిలాషులు 2 వేల మంది ఉన్నారంటున్న భూమన
వివాదం రేపిన వ్యక్తి గతంలో అనేక అరోపణలు వచ్చినప్పుడు వాటికి కూడా బదులివ్వాల్సి ఉంది. మీరు అధికారంలో ఉన్నారు కదా, రికార్డులు మీదగ్గర ఉంటాయి కదా అని చెబుతున్న భూమన కొన్ని విషయాలలో ఎదురు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పాడుతున్నాయి. ముఖ్యంగా టీటీడీలో తన శ్రేయోభిలాషులు రెండు వేల మంది ఉన్నారని, గోవులు మరణించిన ఫొటోలు వారి ద్వారానే తనకు వచ్చాయని, వారే రికార్డులు ఇచ్చారని అంటున్నారంట. అలాగే ఈఓ కార్యాలయంతో పాటు. అదనపు ఈఓ, చైర్మన్ సహా కీలక కార్యాలయాలలో తన మనుషులు ఉన్నారని భూమన చెప్పకుంటున్నారు. మరి వారి ద్వారా రికార్డులు మార్పించారా అని ఇప్పుడు కూటమి నేతలు నిలదీస్తున్నారు.
Also Read: టోక్యో మెట్రో ఆధారంగా HYD సెకండ్ ఫేజ్ మెట్రో
తిరుమలలో మరో సారి నోటి దూకుడు ప్రదర్శించిన రోజా
మొత్తం మీద దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ ఇష్యూలో మాజీ మంత్రి రోజా, కరుణాకర్ రెడ్డికి మద్దతు పలకడానికి వచ్చి అక్కడ రాజకీయాలు మాట్లాడి… మరో సారి తన నోటి పవర్ తగ్గ లేదని నిరూపించుకోవడం తీవ్ర విమర్శల పాలవుతోంది.
అసలు విషయం పక్కదారి పట్టించేలా రోజా మాట్లాడిన మాటలు, సీఎం, డిప్యూటీ సీఎంలపై ఏకవచనంతో నోరు పారేసుకున్న తీరుపై పెద్ద చర్చే నడుస్తోందిప్పుడు. మొత్తం మీద భూమాన కరుణాకరరెడ్డి 2019 నుంచి 24 ఏప్రిల్ వరకు గోశాలలో జరిగిన వాటి గురించి కూడా చెబితే అయన పోరాటానికి సార్థకత ఉంటుందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు..