BigTV English
Advertisement

WI vs NZ 1st T20i: న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన వెస్టిండీస్

WI vs NZ 1st T20i: న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన వెస్టిండీస్

WI vs NZ 1st T20i: వెస్టిండీస్ జట్టు 5 టీ-20 లు, 3 టెస్ట్ మ్యాచ్ లు, మూడు వన్డేలా సిరీస్ ల కోసం ప్రస్తుతం న్యూజిలాండ్ లో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా వెస్టిండీస్ – న్యూజిలాండ్ జట్ల మధ్య ఆక్లాండ్ వేదికగా నేడు తొలి టీ-20 జరిగింది. అయితే ఈ తొలి టి-20 లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ కి దిగింది. కానీ వెస్టిండీస్ జట్టుకు ఆదిలోనే ఎదురు దెబ్బలు తగిలాయి. కేవలం 3 పరుగులు మాత్రమే చేసిన బ్రాండన్ కింగ్ తొలి ఓవర్ చివరి బంతికి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఐదో ఓవర్ 3వ బంతికి అలిక్ అథనాజ్ {16}, 7వ ఓవర్ చివరి బంతికి అకీమ్ అగస్టీ {2} వికెట్లు కోల్పోయారు.


Also Read: pak vs sa match: గ‌ల్లీ క్రికెట్ లాగా మారిన పాకిస్తాన్ మ్యాచ్‌… బంతి కోసం 30 నిమిషాలు వెతికార్రా !

షాయి హోప్ కెప్టెన్ ఇన్నింగ్స్:

ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికీ వన్ డౌన్ బ్యాటర్ షాయి హోప్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో మెరిశాడు. 39 బంతుల్లో 53 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. ఇక మిగతా బ్యాటర్లు రోస్టన్ చేజ్ {28}, రోవ్ మన్ పావెల్ {33}, రొమారియో షెఫర్డ్ {9} పరుగులు చేశారు. ఇన్నింగ్స్ చివరి రెండు బంతులకు షెఫర్డ్ బౌండరీలు బాదాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో వెస్టిండీస్ 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ బౌలర్లు సత్తా చాటారు. జేకబ్ డఫీ, జకారి ఫౌల్క్స్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. జేమిషన్, జేమ్స్ నీషమ్ చెరో వికెట్ తీశారు.


Also Read: Jemimah Rodrigues Trolls: ఆ దేవుడి బిడ్డే లేకుంటే, టీమిండియా వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచేదే కాదు.. హిందువుల‌కు కౌంట‌ర్లు ?

ఆది నుంచే తడబడ్డ న్యూజిలాండ్:

ఇక వెస్టిండీస్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో న్యూజిలాండ్ మొదటి నుంచి తడబడింది. ఓపెనర్లు టిమ్ రాబిన్షన్ {27}, కాన్వే {13} పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. న్యూజిలాండ్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న వన్ డౌన్ బ్యాటర్ రచిన్ రవీంద్ర కేవలం 21 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఇక చాప్ మన్ {7}, డారిల్ మిచెల్ {13}, మైకేల్ బ్రాస్వెల్ {1}, జీమ్స్ నీషమ్ {11}, మిచెల్ శాంట్నర్ కేవలం 28 బంతుల్లోనే {55*} ఒంటరి పోరాటం చేసినా ఫలితం దక్కలేదు. ఇందులో 8 ఫోర్లు, రెండు సిక్స్ లు ఉన్నాయి. అయితే ఇతడికి మిగతా బ్యాటర్ల నుంచి సహకారం అందకపోవడంతో.. న్యూజిలాండ్ 157 పరుగుల వద్ద నిలిచిపోవలసి వచ్చింది. ఫలితంగా వెస్టిండీస్ చేతిలో 7 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో న్యూజిలాండ్ పర్యటనను వెస్టిండీస్ ఘనంగా ఆరంభించింది. ఇక ఈ ఇరుజట్ల మధ్య నవంబర్ 6 వ తేదీన ఇదే వేదికపై రెండవ టి-20 జరగనుంది.

 

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by WINDIES Cricket (@windiescricket)

Related News

Bowling Action: ముత్త‌య్య, భ‌జ్జీ, వార్న్‌, కుంబ్లే అంద‌రినీ క‌లిపేసి బౌలింగ్‌.. ఇంత‌కీ ఎవ‌డ్రా వీడు!

pak vs sa match: గ‌ల్లీ క్రికెట్ లాగా మారిన పాకిస్తాన్ మ్యాచ్‌… బంతి కోసం 30 నిమిషాలు వెతికార్రా !

Jemimah Rodrigues Trolls: ఆ దేవుడి బిడ్డే లేకుంటే, టీమిండియా వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచేదే కాదు.. హిందువుల‌కు కౌంట‌ర్లు ?

Jemimah Rodrigues: వరల్డ్ కప్ ఎఫెక్ట్.. జెమిమా బ్రాండ్ వ్యాల్యూ అమాంతం పెంపు.. ఎన్ని కోట్లు అంటే

Ind vs Sa: కాపు – చౌదరి మధ్య చిచ్చు పెట్టిన దక్షిణాఫ్రికా లేడీ బౌలర్!

World Cup 2025: RCB చేసిన పాపం.. టీమిండియా మ‌హిళ‌ల‌కు త‌గులుతుందా, సెల‌బ్రేష‌న్స్ లేకుండానే ?

Virat Kohli: 6 గురు అమ్మాయిల‌తో విరాట్ కోహ్లీ ఎ**ఫైర్లు..లిస్ట్ రోహిత్ శ‌ర్మ భార్య కూడా ?

Big Stories

×