OTT Movie : థియేటర్లలో వచ్చిన సినిమాలు ఓటిటిలోకి వస్తూనే ఉన్నాయి. థియేటర్లలో చూడకపోయినా ఓటీటీ లో చూసి ఎంటర్టైన్ అవుతున్నారు మూవీ లవర్స్. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ, ఒక కుల వివక్ష ఆధారంగా తెరకెక్కింది. ఇందులో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమాలో తన పాత్రకు తగిన న్యాయమే చేసింది. రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? అనే వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ తమిళ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘సాణి కాయిదం’ (Saani kaayidham). 2022 లో వచ్చిన ఈ మూవీకి అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించారు. కీర్తి సురేశ్, సెల్వరాఘవన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ 1989 లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. కుల వివక్ష, లైంగిక హింస, ప్రతీకారం వంటివి తెర మీద చూపించారు. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీలోకి వెళితే
పొన్ని ఒక తక్కువ కులానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్. తన భర్త మారి, ఐదేళ్ల కుమార్తె ధనంతో సాధారణ జీవితం గడుపుతోంది. పొన్ని తన కుమార్తెకు మంచి విద్య, ఉన్నత జీవనం అందించాలని కలలు కంటుంది. మారి ఒక రైస్ మిల్ కార్మికుడు గా ఉంటాడు. తమ గ్రామంలోని కుల సమస్యలు, పేదరికం నుండి బయటపడాలని ఆశిస్తాడు. అందుకు గానూ స్థానిక ఎన్నికల్లో పాల్గొనాలని అనుకుంటాడు. అయితే ఈ నిర్ణయం మిల్ యజమాని, అతని బంధువులతో వివాదానికి దారితీస్తుంది. దీని ఫలితంగా మారి ఉద్యోగం కోల్పోతాడు. అతడు రాజకీయంగా ఎదగటం ఎవ్వరికీ నచ్చదు. ఆ తరువాత పొన్ని జీవితం పూర్తిగా మారిపోతుంది.
ఈ వివాదం కుల ఆధిపత్య కోసం తపించే మరో వర్గానికి కోపం తెప్పిస్తుంది. పొన్నిపై వాళ్ళంతా కలసి సామూహిక అత్యాచారం చేస్తారు. ఆమె భర్త, కుమార్తెను దారుణంగా కాల్చి చంపుతారు. ఈ దుర్ఘటన పొన్ని జీవితాన్ని నాశనం చేస్తుంది. ఈ దారుణ ఘటనలో తన కుటుంబాన్ని కోల్పోయిన పొన్ని సవతి సోదరుడు సంగయ్య కూడా బాధితుడు అవుతాడు. ఇద్దరూ కలిసి, తమ జీవితాలను నాశనం చేసిన, కులాహంకార శక్తులపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. పొన్ని, సంగయ్య తమ శత్రువులను ఒక్కొక్కరినీ టార్గెట్ చేస్తూ, కిరాతకమైన పద్ధతులతో వారిని అంతం చేయాలనుకుంటారు. అలాగే ఈ హత్యలు కూడా చూడటానికి చాలా ఘోరంగా ఉంటాయి. కసితీరా వాళ్ళను చంపడం మొదలు పెడతారు. చివరికి వీళ్లిద్దరూ ప్రతీకారం పూర్తిగా తీర్చుకుంటారా ? మరేమైనా సమస్యలు వస్తాయా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ యాక్షన్ డ్రామా మూవీని మిస్ కాకుండా చూడండి.
Read Also : రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరికిపోయే అన్నా చెల్లెలు … క్రేజీ రొమాంటిక్ మూవీ