SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) కొనసాగుతున్న నేపథ్యంలో…. కాటేరమ్మ కొడుకులు పబ్బులు, పార్టీలు అంటూ తిరుగుతున్నారు. వరుస ఓటములతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు (Sunrisers Hyderabad team ) సతమతమవుతున్న వేళ… కాటేరమ్మ కొడుకులు ( KAteramma Kodukulu) చిల్ మూడులోకి వెళ్లారు. తాజాగా హైదరాబాదులోని ఓ ప్రముఖ హోటల్లో ప్రత్యేక ఈవెంట్ జరిగింది. ఈ పార్టీకి… సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లు (Sunrisers Hyderabad Players ) అందరూ వెళ్లారు. ఈ సందర్భంగా చుక్క ముక్క వేసుకొని… తెగ ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది.
Also Read: Krunal-Kohli: నీకు మెంటలా… ఎక్కడ చూస్తున్నావ్.. కోహ్లీ పరువు తీసిన కృనాల్ పాండ్యా
మహేష్ బాబు పాటకు డాన్సులు
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో.. తన తర్వాతి మ్యాచ్ హైదరాబాదులోని ( Hyderabad ) ఉప్పల్ ( Uppal )వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడనుంది. అయితే ఈ మ్యాచ్ కంటే ముందు ఆదివారం వచ్చింది. తెలంగాణలో ఆదివారం వచ్చిందంటే పండుగ వాతావరణం ఉంటుంది. అయితే ఇదే ట్రెడిషన్ను సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లు కొనసాగిస్తున్నారు. ఆదివారం రావడంతో పార్టీలకు వెళ్తున్నారు హైదరాబాద్ ప్లేయర్లు. తాజాగా.. హైదరాబాద్ ప్లేయర్లు క్లాసెన్, ట్రావిడ్ హెడ్ ( Travis Head), నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, రాహుల్ చాహర్, ఇలా అందరు క్రికెటర్లు ఓ పార్టీకి వెళ్లారు. అక్కడ స్టేజ్ పైకి వెళ్లి డ్యాన్సులు కూడా చేశారు.
ముఖ్యంగా మహేష్ బాబు తాజాగా చేసిన గుంటూరు కారం ( Guntur Kaaram ) సినిమాలోని కుర్చీ మడత పెట్టి ( Kurchi Madathapetti Song) పాటకు… స్టెప్పులు వేశారు హైదరాబాద్ ప్లేయర్లు. కిషన్ కిషన్ అలాగే నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా మహేష్ బాబు డాన్స్ చేసినట్లుగానే డాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూర్చొని మీడియాలో వైరల్ గా మారింది…. అలాగే ఈ పార్టీలో మంచి బిర్యానీ… తిన్నారట హైదరాబాద్ ప్లేయర్లు. ఇక అంతకుముందు ఈ పార్టీకి వెళ్లిన హైదరాబాద్ ప్లేయర్ల వీడియో కూడా వైరల్ గా మారింది. ఇందులో హైదరాబాద్ ప్లేయర్లు… మంచి క్లాసిక్ డ్రెస్ వేసుకొని అదరగొట్టారు. హెడ్ వైట్ డ్రెస్ వేయగా… క్లాసెన్ బ్లాక్ అండ్ బ్లాక్ వేశాడు. నితీష్ కుమార్ రెడ్డి నార్మల్గా.. క్లాస్ డ్రెస్ వేశాడు.
SRH ప్లే ఆఫ్ చేయాలంటే ఎలా ?
ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండో స్థానంలో ఉంది. అంటే 9వ స్థానంలో సన్రైజర్స్ ఉందన్నమాట. సన్రైజర్స్ మరో ఏడు మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. ఏడింటిలో కచ్చితంగా ఆరు గెలవాలి. అలా అయితేనే సన్రైజర్స్ కు ప్లే ఆఫ్ ఛాన్సులు ఉంటాయి. లేక ఐదు మ్యాచ్లు గెలిచిన మిగతా జట్ల రన్ రేట్ ప్రకారం… హైదరాబాద్ ప్లే ఆఫ్.. అవకాశాలు ఉంటాయి.
Also Read: Vaibhav Suryawanshi: తొలి బంతికే సిక్స్…గ్రౌండ్ లోనే కన్నీళ్లు పెట్టుకున్న 14 ఏళ్ళ వైభవ్
Nkr,ishan dancing on kurchi madathapetti song 😅 pic.twitter.com/AdcTdZtmat
— Chakri Goud 🧡🦅 (@Chakrigoud2211) April 20, 2025
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">