E-Paper
Advertisement

తెలంగాణలో రైస్ మిల్లర్ల దందా.. ‘బిగ్ టీవీ’ ఎడిటర్ల లోతైన చర్చ.. ఇక మాఫియా పాపం పడింది

తెలంగాణలో రైస్ మిల్లర్ల దందా.. ‘బిగ్ టీవీ’ ఎడిటర్ల లోతైన చర్చ.. ఇక మాఫియా పాపం పడింది
Advertisement

Rice Millers Scam: తెలంగాణలో రైస్ మిల్లర్ల బ్లాక్ దందా తీగ లాగితే డొంక కదిలింది. ప్రజలకు అందాల్సిన సన్న బియ్యాన్ని గుట్టుగా మార్కెట్లోకి తరలించే ప్రయత్నం మిల్లర్లు చేశారు. దీని పేరిట వేల కోట్ల రూపాయలు పంది కొక్కుల్లా బొక్కేశారు. రంగంలోకి దిగిన విజిలెన్స్ విచారణ చేస్తే, కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

తెలంగాణలో రైస్ మిల్లర్ల దందా

తెలంగాణలో రైస్ మిల్లర్లు సన్న‌బియ్య వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంది. అర్హులైన పేదలకు ఇవ్వాల్సిన నాణ్యమైన సన్నబియ్యాన్ని బొక్కేస్తున్నారు రైస్ మిల్లర్లు. ప్రభుత్వం రైతుల నుంచి ఐకేపీ కేంద్రాల నుంచి నాణ్యమైన ధాన్యం సేకరించింది. వాటిని మిల్లులకు అప్పటించి 100 కేజీల వడ్లకు 67 కిలోల రైస్ ఇవ్వాలన్నది ఒప్పందం కుదిరింది. కుదిరిన ఒప్పందం ప్రకారం.. కొంతకాలం ఈ వ్యవహారం అంతా బాగానే జరిగింది. ఈ తర్వాత మిల్లర్లు తమ విశ్వరూపం చూపించారు.

బిగ్ టీవీ ఎడిటర్లలో లోతైన చర్చ

Advertisement

రైస్ మిల్లుల నుంచి రావాల్సిన సన్న బియ్యం సరఫరాకు బ్రేక్ పడింది. తెలంగాణ వ్యాప్తంగా 2.388 రైస్ మిల్లుల నుంచి దాదాపు రూ.4,235 కోట్లు కస్టమ్ మిల్లింగ్ రైస్ రాలేదు. దీంతో విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగింది. దీనివెనుక అసలు కారణం ఏంటని తీగ లాగితే డొంక కదిలింది. ప్రభుత్వం నుంచి తీసుకున్న ధాన్యాన్ని ప్రాసెస్ చేసి, ఆ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్ చేసినట్టు తేలింది. విజిలెన్స్ విచారణలో అసలు విషయాలు వెలుగులోకి రావడంతో క్రిమినల్ కేసులు తప్పవని టెన్షన్ రైస్ మిల్లర్లలో మొదలైంది.

మిల్లర్ల పాపం పడింది?

ఈ అంశంపై ‘బిగ్ టీవీ- మీట్ ద ఎడిటర్స్’లో చర్చ జరిగింది? దీనిపై చీఫ్ ఎడిటర్ అశోక్ మాట్లాడారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రైస్‌కు సంబంధించి అతి పెద్ద విజిలెన్స్ దాడులు తెలంగాణ రాష్ట్రంలో జరిగాయన్నారు. ఈ విషయంలో గర్వపడాలని చెబుతూనే, మరో కోణంలో అవినీతి జరిగినందుకు బాధపడాలన్నారు. పాపం పడింనందుకు సంతోషపడాలన్నారు. దీనిపై సివిల్ సప్లై అధికారులు సైలెంట్ అయ్యారు? ఇప్పుడు ఆ చర్చను చూద్దాం.

Advertisement

 

 

Related News

జిల్లాలో ఒకే ఒక్క ఊరు.. దశాబ్దాలుగా ఏకగ్రీవ సర్పంచ్.. సున్నా కేసులు ఎక్కడో తెలుసా..?

కదిరి వైసీపీలో రగులుతున్న వర్గపోరు.. పిలవని పేరంటానికి వచ్చి రచ్చ..!

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 22A నిషేధిత జాబితా నుంచి భూములు తొలగింపు?

2029 నాటికి 21 NDA రాష్ట్రాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్.. అమిత్ షా బిగ్ అనౌన్స్‌మెంట్!

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. డిఏల విడుదలపై సీఎం రేవంత్ క్లారిటీ!

తెలంగాణ రాజకీయంలో బిగ్ ట్విస్ట్.. అసెంబ్లీకి BRS దూరం కారణం అదేనా..?

మీ దగ్గర ఉన్న 20 రూపాయల నాణెం మంచిదేనా.. వెలుగులోకి నకిలీ కాయిన్ల దందా..!

అప్పుడు మోడల్.. ఇప్పుడు గుంతల జిల్లా.. దారుణంగా మారిన కొత్తగూడెం జిల్లా రోడ్లు!

Big Stories

Advertisement
×