BRS Assembly: ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ప్రతిపక్షాలకు అసెంబ్లీనే కీలక వేదిక. కానీ BRS మాత్రం ఆ వేదికకు దూరమవుతూ… అందివచ్చిన అవకాశాలను కోల్పోతోందన్న అభిప్రాయాలు రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. అసెంబ్లీని రాజకీయ ఆయుధంగా మలుచుకోవడంలో ప్రతిపక్ష BRS విఫలమవుతోందన్న చర్చ సాగుతోంది. బయట నిర్వహిస్తున్న మాక్ అసెంబ్లీల ప్రభావం పరిమితంగానే ఉంటుందని.. అసలు సభలోనే ప్రభుత్వాన్ని నిలదీస్తే ప్రజల్లో చర్చ ఎక్కువగా జరుగుతోందన్న విశ్లేషణలు ఉన్నాయి.
BRS సభకు దూరం కావడం అధికార కాంగ్రెస్‌కు అనుకూలంగా మారుతోందన్న వాదన కూడా ఉంది. ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన సమయంలో… అసెంబ్లీ వెలుపలే ఆందోళనలకు పరిమితం కావడం ఆ పార్టీకి రాజకీయంగా నష్టం చేస్తోందన్న చర్చ జరుగుతోంది. KCR ఫాంహౌస్‌కే పరిమితం కావడం.. సభలో పార్టీ వాయిస్ లేకపోవడం కూడా ప్రభావం చూపుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజల సమస్యలపై పోరాడేందుకు అసెంబ్లీనే ప్రధాన వేదిక కానీ ఆ వేదికకు BRS దూరం కావడంతో అధికార పక్షానికే రాజకీయంగా లబ్ధి జరిగిందన్న విశ్లేషణలు ఉన్నాయి. మరి BRS తన వ్యూహాన్ని ఎప్పుడు మార్చుకుంటుంది… అసెంబ్లీ వేదికగా రానున్న సమావేశాల్లో నైనా ప్రజల పక్షాన గళం ఎత్తుతారా లేదా అనే ఆసక్తికర చర్చ రాజకీయ వర్గాలో జరుగుతుంది.
Also read: చైన్ స్నాచర్ల ఆటకట్టించిన రియల్ హీరో.. వృద్ధ దంపతులను కాపాడిన దృశ్యాలు వైరల్!