E-Paper
Advertisement

ఎక్స్ లవర్ తో అడ్డంగా బుక్ అయిన రోహిణి.. !

ఎక్స్ లవర్ తో అడ్డంగా బుక్ అయిన రోహిణి.. !
Advertisement

Jabardasth Rohini:జబర్దస్త్ రోహిణి(Jabardasth Rohini)గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా ఈ కామెడీ షోలో తనదైన శైలిలో పంచ్ డైలాగ్స్ తో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది. అదే కామెడీ టైమింగ్ తో అటు సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిన ఈమె.. సడన్గా తన ఎక్స్ లవర్ తో అడ్డంగా బుక్ అవడంతో.. తాగుబోతు రమేష్(Thagubothu Ramesh) ఈమెకు గట్టి ఝలక్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో వైరల్..

గత 13 సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న జబర్దస్త్ కామెడీ షో ఎప్పటికప్పుడు సరికొత్త గా రెడీ అవుతోంది. ఇక ఈ వారం కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. అందులో భాగంగానే కొత్త ఎపిసోడ్ కి సంబంధించిన లేటెస్ట్ రెండవ ప్రోమోని నిర్వహకులు విడుదల చేయగా ..అందులో రోహిణి స్కిట్ బాగా పేలింది. ముఖ్యంగా ఎక్స్ లవర్ తో భర్త ముందు అడ్డంగా బుక్కై అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనికి తోడు తాగుబోతు రమేష్ ఇచ్చిన ఝలక్ నవ్వులు పూయించింది.

ఎక్స్ లవర్ తో మొగుడు ముందు అడ్డంగా బుక్ అయిన రోహిణి.

Advertisement

ప్రోమో విషయానికి వస్తే… తాగుబోతు రమేష్ – రోహిణి స్కిట్ ప్రారంభమవుతుంది. బైకు తీసుకొని తాగుబోతు రమేష్ రోహిణి తో కలిసి స్టేజ్ పైకి వస్తారు. తాగుబోతు రమేష్ రోహిణినీ ఉద్దేశించి..” ఈ ప్రపంచంలో అతి కష్టమైనది ఏంటో తెలుసా? నిన్ను బైక్ ఎక్కించుకొని ఫిలింనగర్ అప్ ఎక్కడం అంటాడు” దానికి రోహిణి..”అంతకంటే కష్టమైంది ఏంటో తెలుసా ?మిమ్మల్ని ఎక్కించుకొని ఈ స్కిట్ ఎక్కించడం “అని పంచువేస్తుంది. మధ్యలో ఇంద్రజ (Indraja)కూడా రోహిణికి సపోర్టు పలకడం మరో ఎత్తు. అంతలోనే పంచ్ ప్రసాద్(Punch prasadh) పిచ్చివాడి గెటప్ లో వస్తాడు. ఇతడిని చూడగానే ఇంద్రజ ఇన్నాళ్లకు నీకు కరెక్ట్ రోల్ దొరికింది అంటూ నవ్వుతుంది. రోహిణి ప్రసాద్ ను చూపిస్తూ.. తన భర్తతో.. నాతో బ్రేకప్ అయ్యాక పిచ్చివాడు అయ్యాడు.. ఇతనిని ఒక రెండు నెలలు మన ఇంట్లో పెట్టుకుని డిప్రెషన్ నుంచి బయటకు తీసుకొద్దామని చెబుతుంది రోహిణి. ప్రసాద్ తో నీకు మన ఫస్ట్ హగ్ ఎప్పుడు తీసుకున్నామో గుర్తుందా అని అడుగుతుంది .కృష్ణకాంత్ పార్కులో అని ప్రసాద్ చెప్పడం.. లేదు బస్ స్టాప్ లో అని ఇద్దరు గొడవ పడుతుంటే.. తాగుబోతు రమేష్ వచ్చి.. మీరు ఇవన్నీ నా ముందు చెబుతారా? అంటూ మండిపడతాడు..

ALSO READ:రామ్ గోపాల్ వర్మ ఆ హీరోయిన్ ని రహస్యంగా పెళ్లి చేసుకున్నాడా?

గట్టి ఝలక్ ఇచ్చిన తాగుబోతు రమేష్..

Advertisement

ప్రసాద్ హగ్ కే ఇలా అయితే కిస్ కి ఏమైపోతాడో అంటూ అంటుండగానే రోహిణి చెప్పొద్దు అంటూ కొడుతుంది. అలా ఇద్దరు నవ్వుకుంటుండగా మధ్యలోకి తాగుబోతు రమేష్.. వీళ్ళిద్దరికీ బుద్ధి చెప్పడానికి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ విద్యుల్లేఖ రామన్ ను దించుతాడు. రోహిణి తో ఈమె మాట్లాడుతూ.. “రమేష్ కి నేను ఎక్స్.. రమేష్ నాకు ఎక్స్.. ఇద్దరం ఎక్స్ ఎక్స్ అని చెబుతుండగానే మధ్యలో డబుల్ ల్ ఎక్సెల్ అని పంచు వేస్తుంది రోహిణి.

పంచ్ ల వర్షంతో ప్రోమో వైరల్..

నేను బొద్దుగా ఉన్నాను.. చబ్బిగా ఉన్నాను.. పొట్ట వచ్చిందని నన్ను వదిలేసావు కదా.. మరి ఇదేంటి అంటూ రోహిణి వైపు చూపించడంతో అందరూ నవ్వేస్తారు. అలా మొత్తానికైతే మాజీ ప్రియుడితో అడ్డంగా బుక్ అయిన రోహిణి, విద్యుల్లేఖ ఎంట్రీతో పంచుల వర్షం కురిసింది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Related News

సర్వస్వం అన్నాడు..8 ఏళ్లు వాడుకొని వదిలేసాడు- జబర్దస్త్ బ్యూటీ

Gundeninda GudiGantalu Today episode: మాణిక్యం పై ప్రశంసలు.. అడ్డంగా బుక్కయిన రోహిణి… బాలు ట్విస్ట్ అదుర్స్..

Podarillu Today Episode : కేశవ మాట విన్న శైలు.. చక్రీ మాటపై ఫైర్ .. శైలు ఎంట్రీతో వరాలు షాక్..

Illu Illalu Pillalu Today Episodes: కన్నీళ్లు పెట్టుకున్న రామారాజు.. అయ్యో పాపం వేదవతి.. ధీరజ్, ప్రేమ కలిస్తారా..?

Brahmamudi Serial Today Episode July 31st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖకు వార్నింగ్ ఇచ్చిన ఐశ్వర్య

Intinti Ramayanam Today Episode: మీనాక్షి ఫుల్ హ్యాపీ.. పల్లవి పై భానుమతి అనుమానం.. అక్షయ్ కు కష్టాలు..

Intinti Ramayanam Kamal : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. కమల్ అవుట్..

Big Stories

Advertisement
×