E-Paper
Advertisement

2029 నాటికి 21 NDA రాష్ట్రాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్.. అమిత్ షా బిగ్ అనౌన్స్‌మెంట్!

2029 నాటికి 21 NDA రాష్ట్రాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్.. అమిత్ షా బిగ్ అనౌన్స్‌మెంట్!
Advertisement

Uniform Civil: ఇప్పటివరకు మనదేశంలో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని అంశాలు మతం, వ్యక్తిగత చట్టాల ఆధారంగా వేర్వేరు నిబంధనలతో నడిచాయి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, పార్సీ వంటి మతాలకు వివాహం, విడాకులు, వారసత్వం వంటి అంశాల్లో వేర్వేరు చట్టాలు లేదా వ్యక్తిగత న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. అయితే ఈ తేడాల స్థానంలో.. మతంతో సంబంధం లేకుండా అందరికీ ఒకే సివిల్ రూల్స్ తీసుకురావాలన్నదే యూనిఫామ్ సివిల్ కోడ్ UCC. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 కూడా దేశవ్యాప్తంగా ప్రజలకు ఒకే సివిల్ కోడ్ కోసం ప్రభుత్వం ప్రయత్నించాలని చెబుతుంది. అయితే ఆర్టికల్ 44 స్వయంగా UCCని అమల్లోకి తెచ్చే చట్టం కాదు… అది ఒక రాజ్యాంగ మార్గదర్శకం.

జాతీయ UCC చట్టం..

సో ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓ ప్రకటన చేశారు. 2029 ఎన్నికలకు ముందే NDA పాలిత 21 రాష్ట్రాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తామన్నారు. ముఖ్యంగా ఇది పార్లమెంట్‌లో ఒకే జాతీయ UCC చట్టం తీసుకురావడం కంటే… రాష్ట్రాల ద్వారా దశలవారీగా అమలు చేసే వ్యూహాన్ని ఫాలో అవుతున్నారు. నిజానికి ఉత్తరాఖండ్ 2025 జనవరి 27 నుంచి సమగ్ర UCCని అమల్లోకి తెచ్చిన తొలి రాష్ట్రంగా నిలిచింది. 2026లో గుజరాత్ UCC బిల్లును ఆమోదించింది. అసోం, మధ్యప్రదేశ్‌ సహా మరికొన్ని NDA పాలిత రాష్ట్రాలు కూడా ముందుకు వచ్చాయి. మధ్యప్రదేశ్ బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి ఆమోదం కోసం పెండింగ్‌లో ఉంది. సో ఇదో చట్టపరమైన అంశం మాత్రమే కాదు. వేర్వేరు మతాలు, సంప్రదాయాలు ఉన్న దేశంలో వ్యక్తిగత చట్టాల స్థానాన్ని తగ్గించడమా? దీన్ని ఎలా సమన్వయం చేస్తారన్నది కీలకంగా మారింది.

Advertisement

Also read: రాత్రి వేళ గణపయ్య ఫోటోలు బ్లర్ అవుతున్నాయా? ఈ టిప్స్‌తో క్లారిటీ అదుర్స్!

21 NDA రాష్ట్రాల్లో..

2029కి ముందే 21 NDA రాష్ట్రాల్లో UCC అమలు చేస్తామన్న హోంమంత్రి అమిత్ షా ప్రకటనకు AIMIM చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ ఇచ్చారు. భారత్ స్ఫూర్తే భిన్నత్వం, బహుళత్వం అని చెప్పిన ఓవైసీ.. ఒకే చట్టం పేరుతో దేశంలోని వైవిధ్యాన్ని విస్మరించొద్దంటూ పరోక్షంగా హెచ్చరించారు. UCCపై నిజంగా అంత నమ్మకం ఉంటే ముందుగా గోవాలో అమలు చేయండి అంటూ BJPకి సవాల్ విసిరారు. BJPతో ఉన్న మిత్రపక్షాలు ఈ విషయంలో స్వతంత్రంగా తమ అభిప్రాయాన్ని చెప్పగలవా? అంటూ NDA భాగస్వాములపైనా ప్రశ్నలు సంధించారు. సో ఈ సబ్జెక్ట్ మున్ముందు ఎటు దారి తీస్తుందో చూడాలి.

Advertisement

Also read: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. డిఏల విడుదలపై సీఎం రేవంత్ క్లారిటీ!

Tags

Related News

కదిరి వైసీపీలో రగులుతున్న వర్గపోరు.. పిలవని పేరంటానికి వచ్చి రచ్చ..!

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 22A నిషేధిత జాబితా నుంచి భూములు తొలగింపు?

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. డిఏల విడుదలపై సీఎం రేవంత్ క్లారిటీ!

తెలంగాణ రాజకీయంలో బిగ్ ట్విస్ట్.. అసెంబ్లీకి BRS దూరం కారణం అదేనా..?

మీ దగ్గర ఉన్న 20 రూపాయల నాణెం మంచిదేనా.. వెలుగులోకి నకిలీ కాయిన్ల దందా..!

అప్పుడు మోడల్.. ఇప్పుడు గుంతల జిల్లా.. దారుణంగా మారిన కొత్తగూడెం జిల్లా రోడ్లు!

మైండ్ బ్లాకింగ్ ఆర్ట్.. కేవలం ఒక సెంటీమీటర్ వినాయకుడు.. చూస్తే కళ్లు చెదరాల్సిందే!

Big Stories

Advertisement
×