E-Paper
Advertisement

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. డిఏల విడుదలపై సీఎం రేవంత్ క్లారిటీ!

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. డిఏల విడుదలపై సీఎం రేవంత్ క్లారిటీ!
Advertisement

Employees Demands: ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. వేతన సవరణ, DA బకాయిలు, పెండింగ్ బిల్లులు, పెన్షన్ విధానం వంటి అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లలో రెండో వేతన సవరణ సంఘం అమలు కీలకంగా ఉంది. 2023 జులై 1 నుంచి 51 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్న 6 DAలను విడుదల చేయాలని ఎంప్లాయిస్ యూనియన్స్ డిమాండ్ చేస్తున్నాయి.

ఉద్యోగుల హెల్త్‌ స్కీం..

ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులను ప్రతి నెలా 2 వేల కోట్ల చొప్పున చెల్లింపులు చేపట్టాలని సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. CPS రద్దు చేసి OPS విధానం అమలు చేయాలని, ఉద్యోగుల హెల్త్‌ స్కీంను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఉద్యోగ సంఘాల గుర్తింపును పునరుద్ధరించాలని సైతం డిమాండ్ చేస్తున్నాయి. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఆర్థిక అంశాలతో సంబంధం లేని సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఉద్యోగ సంఘాల నేతలకు ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ నెల 18లోపు PRC కమిషన్ నివేదిక ఇవ్వాలని CS సంజయ్ జాజు ఇప్పటికే ఆదేశించారు.

PRC నివేదిక..

Advertisement

సీఎం రేవంత్, సంఘాల నేతల సమావేశం తర్వాత ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. PRC నివేదిక అందితే ఫిట్‌మెంట్‌పై కూడా ఒక నిర్ణయం వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఉద్యోగులకు దసరా కానుకగా ఎలాంటి నిర్ణయాలు వెలువడుతాయన్నది ఆసక్తిగా మారింది.

Also read: షాపింగ్ ప్రియులకు ప్రయులకు పిడుగులాంటి వార్త.. త్వరలో భారీగా పెరగనున్న ధరలు!

Tags

Related News

కదిరి వైసీపీలో రగులుతున్న వర్గపోరు.. పిలవని పేరంటానికి వచ్చి రచ్చ..!

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 22A నిషేధిత జాబితా నుంచి భూములు తొలగింపు?

2029 నాటికి 21 NDA రాష్ట్రాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్.. అమిత్ షా బిగ్ అనౌన్స్‌మెంట్!

తెలంగాణ రాజకీయంలో బిగ్ ట్విస్ట్.. అసెంబ్లీకి BRS దూరం కారణం అదేనా..?

మీ దగ్గర ఉన్న 20 రూపాయల నాణెం మంచిదేనా.. వెలుగులోకి నకిలీ కాయిన్ల దందా..!

అప్పుడు మోడల్.. ఇప్పుడు గుంతల జిల్లా.. దారుణంగా మారిన కొత్తగూడెం జిల్లా రోడ్లు!

మైండ్ బ్లాకింగ్ ఆర్ట్.. కేవలం ఒక సెంటీమీటర్ వినాయకుడు.. చూస్తే కళ్లు చెదరాల్సిందే!

Big Stories

Advertisement
×