Subhas Chandra Bose : ‘మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి ..నేను మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తాను’ అంటూ నిరాశలో కూరుకుపోయిన భారతీయులను స్వాతంత్ర్యపోరాటంలోకి దించి, భరతమాత విముక్తికకై పోరాడిన అరుదైన నాయకుడు.. సుభాష్ చంద్రబోస్. భారతదేశం శాంతిదేశమనీ, అయితే.. అవసరమైతే ఆయుధం పట్టటమూ చేతనైన దేశమని ప్రపంచానికి చాటిన వీరుడు. సాయుధ పోరాటంతోనే బ్రిటిష్ పాలన నుంచి దేశాన్ని విముక్తం చేయగలమని నమ్మి, దానిని ఆచరించిన కర్మయోగి నేతాజీ. నేడు ఆయన జయంతి.
‘మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి ..నేను మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తాను’ అంటూ నిరాశలో కూరుకుపోయిన భారతీయులను స్వాతంత్ర్యపోరాటంలోకి దించి, భరతమాత విముక్తికకై పోరాడిన అరుదైన నాయకుడు.. సుభాష్ చంద్రబోస్. భారతదేశం శాంతిదేశమనీ, అయితే.. అవసరమైతే ఆయుధం పట్టటమూ చేతనైన దేశమని ప్రపంచానికి చాటిన వీరుడు. సాయుధ పోరాటంతోనే బ్రిటిష్ పాలన నుంచి దేశాన్ని విముక్తం చేయగలమని నమ్మి, దానిని ఆచరించిన కర్మయోగి నేతాజీ. నేడు ఆయన జయంతి.
1879 జనవరి 23వ తేదీ ఒడిశాలోని కటక్‌లో జానకీ నాథ్, ప్రభావతీ బోస్‌లకు నేతాజీ జన్మించారు. ఆ దంపతుల సంతానంలో నేతాజీ తొమ్మిదవ వాడు. చిన్నతనం నుంచి విద్యలో రాణించిన బోస్.. తత్వశాస్త్రంలో డిగ్రీ తీసుకున్నారు. నాడు బ్రిటిషర్లు నిర్వహించే సివిల్ సర్వీసు పరీక్ష (ఐసీఎస్)లో అఖిల భారత స్థాయిలో నాలుగవ ర్యాంకు పొంది బ్రిటన్ వెళ్లి శిక్షణ కూడా పొందారు. కానీ..ఆ సమయంలోనే జలియన్ వాలా బాగ్ ఉదంతం జరగటంతో ప్రభుత్వ ఉద్యోగంలో చేరలేదు.
తర్వాతి రోజుల్లో రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందుడి ప్రభావంతో సన్యాసం తీసుకోడానికి నిర్ణయించుకున్న బోస్..కొన్నాళ్లకు ఆ ఆలోచనను పక్కనబెట్టి శ్రీ ఆర్యా పత్రికలో సంపాదకుడిగా ఉంటూ.. యువతను స్వాతంత్ర పోరాటంవైపు మళ్లించే వ్యాసాలు రాశారు.
తన 23వ ఏట కాంగ్రెస్ పార్టీలో చేరి బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, అఖిల భారత కాంగ్రెస్ సహాయ కార్యదర్శిగా దేశమంతా పర్యటిస్తూ లక్షలాది మందిని స్వాతంత్ర్య పోరాటంలోకి తీసుకొచ్చారు. బ్రిటిష్ అధికారి వెల్స్ క్యూన్ భారత్ పర్యటనకు వ్యతిరేకంగా చిత్తరంజన్‌తో కలిసి జరిపిన పోరాటంలో అరెస్టయ్యారు. ఉప్పు సత్యా గ్రహ పోరాటం తదితర పోరాటాల్లో పాల్గొని మొత్తం 11 సార్లు జైలు పాలయ్యారు.
1937లో విడుదల కాగానే తన 41వ ఏట కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై దేశంలోనే అత్యంత జనాదరణ గల నేతగా నిలిచారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూనే రెండవసారి పట్టాభి సీతారామయ్యపై గెలిచి కాంగ్రెస్ అధ్యక్షులు అయ్యారు. అయితే ‘పట్టాభి ఓటమి నా ఓటమి’ అన్న గాంధీజీ స్టేట్‌మెంట్ విన్న తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. వెంటనే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించారు.
రెండవ ప్రపంచయుద్ధంలో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ఉన్న దేశాల కూటమిలో చేరి స్వాతంత్ర్యం పొందగలమని నమ్మి, 1941లో తాను గృహనిర్బంధంలో ఉండగా, కలకత్తా నుంచి మారువేషంలో దేశం దాటారు. తర్వాత రష్యా, జర్మనీ, జపాన్ దేశాల్లో పర్యటించి, హిట్లర్ వంటి వారి మద్దతును కూడగట్టారు. 1941 ఫిబ్రవరి 27న ఆజాద్ హింద్ ఫౌజ్ రేడియోలో అద్భుత ప్రసంగం చేసి యావత్ భారతాన్నీ ఆయన ఆవేశంలో ముంచెత్తారు.
మహిళలకు రంగూన్‌లో ఝాన్సీ లక్ష్మీబాయి రెజి మెంట్ ఏర్పాటు చేసి యుద్ధ శిక్షణ మొదలు పెట్టారు. జర్మనీ,జపాన్ సాయంతో యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు, ఔత్సాహికులతో బెర్లిన్‌లో 1942 జనవరి 26న బెర్లిన్‌లోనే ‘అజాద్ హింద్ ఫౌజ్’ను ఏర్పాటు చేసి, సింగపూర్‌లో ఆజాద్ హింద్ ప్రభుత్వంను ఏర్పరచి బ్రిటిషర్లకు చెమటలు పట్టించారు.
అనంతరం 1944 ఫిబ్రవరి 4న చలో ఢిల్లీ అనే నినాదాన్ని ఇచ్చారు. అదే రోజు బర్మా రాజధాని రాంకూన్ నుంచి భారత్ సరిహద్దులకు భారత్ సైన్యం ప్రయాణమైంది. తర్వాత రెండేళ్లలో కోహిమా కోట, తిమ్మాపూర్- కొహిమాను సైనిక దళం చేరుకుంది. భారత్ జాతీయ సైనిక దళ దాడుల దాటికి తట్టుకోలేక బ్రిటిష్ సైన్యం కుదేలయింది.
ఇంతలో జపాన్ మీద అణుబాంబు దాడి జరిగి, ఆ దేశం అతలాకుతలమై పోయింది. దీంతో బోస్ నిస్సహాయుడై సహచరుల బలవంతంపై మంచూరియాలో సురక్షిత అజ్ఞాత స్థలానికి వెళ్ళడానికి అయిష్టంగానే జపాన్‌లో విమానం ఎక్కి తైపే వరకూ ప్రయాణించారు. 1945 ఆగస్ట్ 18న అకస్మాత్తుగా విమానంలో సాంకేతిక ఇబ్బంది వచ్చి కూలిపోయిందన్నారు. విమానంతో పాటే కోట్లాది భారతీయుల ఆశలూ నేల కూలాయి. 50 సంవత్సరాల వయసులోనే ఆ యోధునికి నూరేళ్ళూ నిండాయి. అయితే.. క్రమశిక్షణ, దేశభక్తి గల నేతగా సుభాష్ చంద్రబోస్ జనం మనసులో నేటికీ సజీవంగా నిలిచే ఉన్నారు. వారి జయంతి సందర్భంగా ఆ అమర వీరుడికి నివాళి.