EPAPER

Steel Plant Politics: స్టీల్‌ప్లాంట్ పంచాయతీ.. మీ స్టాండ్ ఏంటి?

Steel Plant Politics: స్టీల్‌ప్లాంట్ పంచాయతీ.. మీ స్టాండ్ ఏంటి?

Vizag Steel Plant Issue: ఏపీలో మరోసారి స్టీల్‌ ప్లాంట్‌పై రచ్చ మొదలైంది. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ వార్తలు గుప్పుమన్నాయి. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు అధికారంలో ఉన్న టీడీపీ-జనసేన మద్దతు ఇచ్చాయన్న ప్రచారం జరుగుతోంది. అందులో ఎంత వరకు నిజముందో కాని.. వైసీపీ ఇప్పుడు దాన్నే అస్త్రంగా మార్చుకుని కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేటీకరణపై కేంద్రాన్ని ప్రశ్నించలేకపోయిన వైసీపీ నేతలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీస్తున్నారు. దానికి కూటమి నేతలు గట్టిగానే కౌంటర్లిస్తున్నారు. దాంతో మళ్లీ స్టీల్‌ప్లాంట్ ఇష్యూ ఫోకస్ అవుతోంది


భారతదేశపు మొట్టమొదటి తీరప్రాంత ఉక్కు కర్మాగారం విశాఖపట్నంలో ఏర్పాటైంది. వైజాగ్‌లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయకూడదని 1966లో అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం తెలుగు ప్రజల్లో తీవ్ర వ్యతిరేతకు కారణమైంది. విశాఖ ఉక్క, ఆంధ్రుల హక్కు. అంటూ వేలాది మంది విద్యార్థులు, కార్మికులు, సామాన్యులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. పోలీసు కాల్పుల్లో మైనర్‌లతో సహా 12 మంది నిరాయుధులు మరణించడంతో నిరసనలు హింసాత్మకంగా మారాయి. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ డిమాండ్‌కు మద్దతుగా 66 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలు రాజీనామాలు కూడా చేశారు. దీంతో కేంద్ర దిగిరావడంతో 1970లో విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారాన్ని స్థాపించారు.

ఏపీలో ఇప్పుడు మరోసారి స్టీల్‌ ప్లాంట్‌‌పై రచ్చ మొదలైంది. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ వార్తలు గుప్పుమన్నాయి. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు అధికారంలో ఉన్న టీడీపీ-జనసేన మద్దతు ఇచ్చాయని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి 2021లోనే వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దానిపై అప్పటి నుంచి స్టీల్ ప్లాంట్ కార్మికులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. స్టీల్‌ప్లాంట్‌ కార్మిక సంఘాలు వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. వారి ఆందోళనలకు అప్పట్లో టీడీపీ, జనసేనలతో పాటు అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతిచ్చాయి.


గత ఎన్నికల ప్రచారంలో కూడా టీడీపీ, జనసేనలు స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని ప్రకటించాయి. విశాఖలో వేల కుటుంబాలు స్టీల్‌ప్లాంట్ మీద ఆధారపడి జీవిస్తున్నాయి. వారి మద్దతుతో విశాఖ నగరంలో అన్ని స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. ప్రైవేటీకరణ ఆగుతుందన్న నమ్మకంతో స్టీల్ ప్లాంట్ ఉన్న గాజువాకలో టీడీపీ అభ్యర్ధి పల్లా శ్రీనివాసరావును భారీ మెజార్టీతో గెలిపించారు ఓటర్లు. ఆఖరికి విశాఖ నార్త్‌లో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజుకు కూడా పట్టం కట్టారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంతో రహస్య స్నేహం కొనసాగించినప్పటికీ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గట్టిగా నోరెత్తలేకపోయిందన్న విమర్శలున్నాయి.

Also Read:  వైవీకి జగన్ బిగ్ షాక్! ఏం జరుగుతుంది?

ఇక ఇప్పుడు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో విశాఖ ప్రైవేటీకరణ ఆగుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి టీడీపీ అతిపెద్ద మిత్రపక్షం. టీడీపీ, జనసేనలు కేంద్రంలో కీలకంగా ఉండటంతో ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రాన్నిఒప్పిస్తారన్న నమ్మకం రాష్ట్ర ప్రజల్లో వ్యక్తమవుతుంది. ఇంకోవైపు స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగడం ఏనాడో ఫిక్స్‌ అయ్యిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇక ఇటీవల కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం అనుసరిస్తున్న పాలసీనే వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌కు వర్తిస్తుందని చెప్తూ గందరగోళానికి తెర తీసారు.

ఇటు వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయంలో టీడీపీ ఎలాంటి యూ-టర్న్‌ తీసుకోలేదని మంత్రి నారా లోకేశ్‌ అంటున్నారు. తాజాగా అదే అస్త్రాన్ని ఎక్కుపెట్టిన వైసీపీ నేతలు కూటమి సర్కారుని నిలదీస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ విషయంలో కూటమి ప్రభుత్వ విధానమేంటో స్పష్టం చేయాలని మాజీ మంత్రి, శాసనమండలిలో పత్రిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకమా? కాదో? చెప్పాలని డిమాండ్ చేసిన ఆయన.. ప్రైవేటీకరణను ఆపాలని మాత్రం ఆడగటం లేదు.  కూటమి, కూటమి అన్న పదాన్ని మాత్రం నొక్కినొక్కి పలుకుతున్నారు

అధికారంలో ఉన్నంత కాలం స్టీల్ ప్లాంట్‌పై మాట్లాడని బొత్స సత్తిబాబు సడన్‌గా సీన్లోకి రావడంతో .. ఆయనపై మాజీ మంత్రి, భీమిలీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు. వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణే మా విధానం, నినాదం’ అని స్పాష్టం చేశారు. వైసీపీ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని ఇలాగే చేస్తే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ఖాతా కూడా తెరవదని ఎద్దేవా చేశారు. పొద్దున్న లేచిన దగ్గరి నుంచి వైసీపీ నాయకులు టీడీపీపై బురదజల్లే పనిలోనే ఉంటున్నారని విమర్శించారు.

వైసీపీ ప్రభుత్వ ఉన్నప్పుడు స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం గంటా శ్రీనివాస్ రాజీనామా చేశారు. అయితే ఎక్కడ ఆయనకు మైలేజీ పెరుగుతుందో అని మూడు సంవత్సరాల వరకు దాన్ని ఆమోదించలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓటు హక్కు రాకుండా అడ్డుకోవాలన్న దురుద్దేశంతో అప్పటికప్పుడు గంటా రాజీనామాను ఆమోదించి స్టీల్ ప్లాంట్ కార్మికుల్లో హీరోని చేసింది.  అలాంటి గంటా ప్రైవేటీకరణపై చేసిన వ్యాఖ్యలు స్టీల్ ప్లాంట్ కార్మికులకు భరోసా ఇస్తున్నట్లు కనిపిస్తున్నాయి.ఆక్రమంలో ఈ సున్నితమైన అంశంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ల రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఉత్కంఠ రేపుతోంది.

Related News

BRS On Navy Radar station: అప్పుడు అనుమతులు.. ఇప్పుడు అసత్య ప్రచారాలు.. దామగుండం చుట్టూ గులాబీ రాజకీయం

Rapaka Varaprasad: రాపాక దారెటు.. కూటమిలోకి ఎంట్రీ ఇస్తారా ? కలవరమే మిగులుతుందా?

Baba Siddique Murder: బిష్ణోయ్ కులదైవానికి సల్మాన్ బలి..

What is the THAAD: థాడ్ అంటే ఏంటి? ఇది వాడితే ఏ దేశమైనా నాశనమేనా?

JC Prabhakar Reddy: వాటా ఇవ్వాల్సిందే.. దుమారం రేపుతున్న జేసీ మాటలు..

Harish Rao: నెంబర్ 2 నేనే..!

Vijayasai Reddy EVM: ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయి విజయ్‌సాయిరెడ్డి ట్వీట్.. 2019లో టాంపరింగ్ సాధ్యం కాదని చెప్పిన జగన్!

Big Stories

×