BigTV English

BJP Vs BRS: కేసీఆర్‌కు బీజేపీ షాక్! వెనుక స్కెచ్ ఇదే!

BJP Vs BRS: కేసీఆర్‌కు బీజేపీ షాక్! వెనుక స్కెచ్ ఇదే!

BJP Vs BRS: బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటవ్వడం ఖాయమేనా? లేక బీఆర్ఎస్ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి లొంగిపోతున్నట్లు ఆ పార్టీతో లోపాయికారిగా లొంగుబాటు ఒప్పందమేమైన చేసుకుంటుందా..? ఇటీవల ఒక్కొక్కరు కారు దిగి కమలం పార్టీ మెట్లు ఎక్కుతుండటం ఆ పరోక్ష ఒప్పందంలో భాగమేనా?.. ఇదంతా రెండు పార్టీల విలీన ప్రక్రియలో భాగమేనా? అన్న సందేహాలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. అసలు బీఆర్ఎష్, బీజేపీలు అవెంజర్స్ అవుతాయా..? రాబోయే కాలంలో కూడా రివేంజర్స్‌గానే కొనసాగుతాయా?


బీజేపీకి లొంగిపోవడానికి బీఆర్ఎస్ సిద్దమైందని ప్రచారం

బీఆర్ఎస్ పార్టీ గత్యంతరం లేని స్థితిలో బీజేపీకి లొంగిపోవడానికి సిద్దమవుతోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తాము అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంటులో ఎన్డీఏ సర్కారు బిల్లులకు మద్దతిచ్చిన గులాబీ పార్టీ తర్వాత మారిన పరిస్థితుల్లో కేంద్రంతో తెగతెంపులు చేసుకున్నట్లు వ్యవహరిస్తోంది. అయితే ఇప్పుడు గులాబీ గూటి నుంచి ఒకొక్కరుగా కమలం చేరుతుండటం వెనుక లెక్కలేంటనేది చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేల కొనుగోలులో బీజేపీ జాతీయ నేత బీఎల్ సంతోష్ ను పట్టుకున్నామని బీఆర్ఎస్ చెబుతుంటే.. దానికి రివెంజ్‌గా లిక్కర్ స్కాం లో కవితను తీహార్ జైల్లో నెలల తరబడి ఊసులు లెక్కపెట్టించాం అంటోంది బీజేపీ.


కారు బోల్టులు ఉడదీసే పనిలో పడినట్లు కనిపిస్తున్న బీజేపీ

అంతేకాదు లిక్కర్ స్కాం అరెస్టులతో ఆగకుండా కారు పార్టీ బోల్ట్ లు ఊడదీసే పనిలో బీజేపీ బిజీబిజీగా గడుపుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో బీఆర్ఎస్ లో మరోసారి రాజీనామాల సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. రానున్న కాలంలో కారు పార్టీ నుంచి కమలం లోకి చేరికలు భారీగా ఉంటాయంటున్నారు. దాంతో కేసీఆర్ టీమ్ డైలమాలో పడినట్టు కనిపిస్తోంది. బోల్ట్ లూడదీస్తున్న మోడీ, షాలను వదిలి కేటీఆర్ 18 నెలల కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుండటం, బీజేపీని పల్లెత్తు మాట అనకపోవడం బీజేపీ, బీఆర్ఎస్‌ల మధ్య రక్షా బంధన్ బహిర్గతం అవుతుందనే టాక్ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.

జోరందుకున్న బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని ప్రచారం

ఆ క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే, ఎప్పటికైన బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందనే చర్చ మళ్ళీ జోరందుకుంటోంది. లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత పట్టుబడ్డారా? లేక బీజేపీ బదనాం చేసిందా అన్న అంశాల్లో లోగుట్టు పెరుమాళ్లకు ఎరుక. అయితే కవిత బెయిల్‌పై బయటకు వచ్చాక కారు పార్టీని వదిలి సొంత కుంపటి జాగృతితో ముందుకు వెళ్లున్నారు. అంతేకాదు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే.. బీజేపీలో విలీనం చేసేందుకు ప్రయత్నం జరిగింది అంటూ పెద్ద బాంబే పేల్చారు కవిత. కవితే కాదు సీఎం రమేష్, కమలంలో చేరిన గువ్వల బాలరాజులతో పాటు, వివిధ రాజకీయ పార్టీల కీలక నేతలు సైతం బీజేపీ, బీఆర్ఎస్ విలీనం తధ్యం అని స్టేట్‌మెంట్లు ఇస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు కేసీఆర్, కేటీఆర్‌లకు నమ్మిన బంటునని చెప్పుకునే గువ్వల బాలరాజు గులాబీబాస్ వ్యూహంలో భాగంగానే కాషాయ కండువా కప్పుకున్నారంటున్నారు.

బీఆర్ఎస్ ను ఖాళీ చేయడానికి బీజేపీ ప్రణాళికలు..

ఉద్యమ పార్టీగా ప్రస్థానం మొదలుపెట్టిన గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులను పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. అధికారంలో ఉన్న సమయంలో టీజీపీఎస్సీ పేపరు లీకేజీ, కాళేశ్వరం బ్యారేజ్, విద్యుత్ కొనుగోలు, పోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ కార్ రేస్ స్కాం వంటి అవినీతి ఆరోపణలతో పాటు, కవిత తిరుగుబాటుతో తెలంగాణలో రాజకీయంగా బీఆర్ఎస్‌ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇదే అదునుగా ఎమ్మెల్యేల కొనుగోలుకు, లిక్కర్ స్కాం తో రివెంజ్ ఇచ్చిన బీజేపీ, తాజాగా బీఆర్ఎస్ కు మరో స్ట్రోక్ ఇచ్చేందుకు కసరత్తులు చేస్తోందట. బీఆర్ఎస్ ను ఖాళీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోందంట. మొత్తానికి పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ కారు పార్టీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నటుగా తయారైందట. ఓటమి తరువాత అన్ని రాజకీయ పార్టీలు కేసీఆర్ వైపే వేలెత్తి చూపిస్తున్న పరిస్ధితి. గత లోక్‌సభ ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయిన బీఆర్ఎస్ ఏకంగా సగం స్థానాల్లో డిపాజిట్లు కూడా కోల్పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలు గెలుచుకుని అధికారం కోల్పోయిన గులాబీపార్టీకి ఇప్పుడు 28 మంది ఎమ్మెల్యేలే మిగిలారు. వారిలో ఎంత మంది పార్టీలో కొనసాగుతారో గ్యారెంటీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో గులాబీ బాస్ ఫాంహౌస్‌కే పరిమితమవుతున్నారు.

బీజేపీ పంచకు చేరిన మాజీ ఎమ్మె్ల్యే గువ్వల బాలరాజు

అధికారం కోల్పోయి పార్టీ అధినేత కేసీఆర్ ఫాం హౌస్ కే పరిమితం కావడంతో బీఆర్ఎస్‌లో నాయకత్వలేమి స్ఫష్టంగా కనిపిస్తోంది. తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బిజెపి తీర్థం పుచ్చుకోవడంతో, ఆ పార్టీ నుంచి మరిన్ని చేరికలు బిజెపిలో ఉంటాయని బిజెపి వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేసి, ఓడిపోయిన వారితోపాటు కీలక నేతలంతా బిజెపి వైపుకు చూస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే బీజేపీతో నేతలంతా టచ్‌లో ఉన్నారని, చర్చలు జరిపారని త్వరలోనే భారీ ఎత్తున బిజెపిలో చేరబోతున్నారన్న ప్రచారం గట్టిగానే నడుస్తోంది. దాంతో బిజెపిలో బీఆర్ఎస్ విలీనం అవుతుందనే ఉహాగానాలకు మరోసారి ఊతమిచ్చినట్లైంది.

Also Read: కూకట్‌పల్లి బాలిక కేసులో కొత్త ట్విస్ట్.. చంపింది ఎవరంటే! సహస్ర తండ్రి సంచలన నిజాలు.

ఈ నేపధ్యంలో రానున్న రోజుల్లో కేసీఆర్ రోల్ ఎలా ఉండబోతుందనేది అంతుపట్టకుండా తయారైంది. అసలు బీఆర్ఎస్ ఉంటుందా..? బీజేపీలో విలీనం చేస్తారా..? లేక టీఆర్ఎస్ గా మార్చి మళ్ళీ సెంటిమెంటీట్‌ను రగిలిస్తారా..? లేక బీజేపీతో లొంగుబాటు రాజాకీయ ఒప్పందాలు కంటిన్యూ చేస్తారా.? అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. మొత్తమ్మీద గులాబీ పార్టీ మనుగడ ప్రశ్నార్ధంగా తయారైందన్న వాదన గట్టిగానే వినిపిస్తోందిప్పుడు.

Story By Ajay Kumar, Bigtv

Related News

Urea War: బ్లాక్ మార్కెట్‌కు యూరియా తరలింపు.? కేంద్రం చెప్పిందెంత..? ఇచ్చిందెంత..?

AP Politics: సామినేని అంతర్మథనం..

Satyavedu Politics: మారిన ఆదిమూలం స్వరం.. భయమా? మార్పా?

MLA Report: సీటు ఉన్నట్లా? ఊడినట్లా? టీడీపీ నేతల్లో గుబులు..

Vote Chori: రాహూల్ Vs ఈసీ.. అసల సమస్య ఇదే.! ఎవరి వాదన కరెక్ట్.? ఈ 65 లక్షల ఓట్లు మళ్లీ అప్‌‌లోడ్..!

Big Stories

×