BigTV English

Jani Master Case : బాధితురాలికి అండగా అల్లు అర్జున్… ఆమె కోసం ఊహించని డెసిషన్

Jani Master Case : బాధితురాలికి అండగా అల్లు అర్జున్… ఆమె కోసం ఊహించని డెసిషన్

Johnny Master Case : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఓ యువతి లైంగిక ఆరోపణలు చేయడం టాలీవుడ్లో సంచలనగా మారింది. ఇన్నాళ్లు ఆయనకు అసిప్టెంట్‌గా పని చేసిన 21 ఏళ్ల యువతి అతనిపై రేప్ కేసు నమోదు చేయడం అందరిని దిగ్భ్రాంతికి గురి చేసింది. హైదరాబాద్, చెన్నై, ముంబై తదితర ప్రాంతాల్లో ఔట్ డోర్ షూటింగ్లకు వెళ్ళినప్పుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, అంతేకాకుండా తన ఇంటికి వచ్చి వేధించాడని, అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొంది సదరు యువతి. దీంతో సోషల్ మీడియా వేదికగా పలువురు సెలబ్రిటీలు జానీ మాస్టర్ పై ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే ఫిలిం ఛాంబర్ అతనిపై చర్యలకు సిద్ధమైంది. మరోవైపు జనసేన పార్టీకి సంబంధించిన ఏ పనులను ముట్టుకోవద్దని ఆదేశించారు జనసేనాని. ఇలా నెమ్మదిగా జానీ మాస్టర్ మెడకు ఉచ్చు బిగుస్తోంది. అయితే అమ్మాయికి అండగా నిలవడానికి ఒక్క సెలబ్రిటీ కూడా ముందుకు రావట్లేదు అనే విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆమెకు అండగా నిలుస్తూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు.


బాధితురాలికి అల్లు అర్జున్ ఫోన్

శేఖర్ మాస్టర్ కేసులో బాధితురాలైన యువతికి తాజాగా అల్లు అర్జున్ అండగా నిలిచారు. సదరు యువతికి స్వయంగా ఫోన్ చేసిన అల్లు అర్జున్ ఆమెకు ధైర్యం చెప్పడమే కాకుండా, తన సినిమాలలో అవకాశం ఇస్తానని చెప్పినట్టు సమాచారం. అయితే ఆయన ఒకటి లేదా రెండు సినిమాలకు కాకుండా తన రాబోయే ప్రతి సినిమాలోనూ ఆమెకు ఛాన్స్ ఇస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా తమ నిర్మాణ సంస్థ అయిన గీతా ఆర్ట్స్ బ్యానర్లో సినిమాలకు కూడా ఆమె పని చేసుకోవచ్చని చెప్పారట. దీంతో ఈ విషయం తెలిసిన టాలీవుడ్ మూవీ లవర్స్ అల్లు అర్జున్ మంచి మనసును మెచ్చుకుంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంత పెద్ద స్టార్ అయినప్పటికీ బాధితురాలికి ఫోన్ చేసి ఆమె గురించి తెలుసుకోవడం మాత్రమే కాకుండా, తన సినిమాలలో పని చేసే అవకాశాన్ని కల్పిస్తానని భరోసా ఇవ్వడం మంచి విషయం అంటూ అల్లు అర్జున్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అయితే మిగతా స్టార్స్ కూడా ఇలాగే జానీ మాస్టర్ విషయంలో నోరు విప్పితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.


Jani Master : డ్యాన్సర్‌పై జానీ మాస్టర్ లైంగిక వేధింపులు.. కేసు నమోదు | Sexual Harassment Case Filed Against Choreographer Johnny Master

టాలీవుడ్ సెలబ్రిటీలపై ట్రోలింగ్

బయట ఎక్కడో ఏదో వివాదం జరిగితే రచ్చ రచ్చ చేసే మన సెలబ్రిటీలు సొంత గూటిలో జరుగుతున్న అరాచకాలపై మాత్రం నోరు విప్పరు అంటూ మండిపడుతున్నారు నెటిజన్లు. ఇప్పటిదాకా జానీ మాస్టర్ వివాదంలో ఒక్క సెలబ్రిటీ కూడా నోరు మెదపకపోవడం గమనార్హం. ఇప్పుడిప్పుడే చిన్మయి లాంటి సెలబ్రిటీలు ఈ వివాదంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. పెద్ద స్టార్స్ గా చెప్పుకునే మిగతా వాళ్ళు ఇలాంటి వివాదాలను సీరియస్ గా తీసుకుంటే పరిస్థితి మరింత దిగజారకుండా ఉంటుంది. కానీ స్టార్స్ దున్నపోతుపై వర్షం పడ్డట్టుగా ఇలాగే సైలెంట్ గా ఉంటే కచ్చితంగా మలయాళ ఇండస్ట్రీకి పట్టిన గతే టాలీవుడ్ కు కూడా పడుతుంది. ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమం కూడా హేమ కమిటీ లాంటి కమిటీలు రావాలనే డిమాండ్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×