Satyavedu Politics: టీడీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆదిమూలం స్వరం మార్చారు.. ప్రభుత్వము పై ధిక్కార స్వరం వినపిస్తున్నారు .. ముఖ్యమంత్రి పట్ల విధేయత చూపుతునే తన ఈ స్థితికి కారణమైన వారితో అమితుమి తెల్చుకోవాలని క్షేత్రస్థాయిలో ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. దీంతో ఇదే అదనుగా వైసీపీ సైతం ఆదిమూలాన్ని తమ గూటిలోకి తెచ్చుకోవడానికి బేరసారాలకు సిద్దమవుతుందనే వార్తలు వినవస్తున్నాయి.. దానికితోడు సత్యవేడు నియోజకవర్గంలోని టిడిపి లోని ఓవర్గం సైతం ఆదిమూలం కు సహాకరిస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఆదిమూలం వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది..
పెద్దిరెడ్డిని ఎదిరించి వైసీపీని వీడిన కోనేటి ఆదిమూలం
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గం గత రెండు సంవత్సరాలుగా వార్తల్లో ఉంది.. వైసీపీలో పవర్ సెంటర్ అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎదిరించి బయటకు వచ్చిన ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలానికి గత శాసనసభ ఎన్నికలలో టిడిపి టికెట్ ఇచ్చింది. కూటమి వెల్లువలో ఆయన విజయం సాధించాడు..ఇలాంటి తరుణంలో అక్కడున్న పకృతి వనరుల మీద కన్నెసిన కింగ్ మేకర్లు ఆదిమూలం బలహీనత మీద దెబ్బకొట్టి ఓ మహిళ చేత వీడియోలు తీయించి అమె ద్వారా వాటిని బయటపెట్టించి విజయవంతంగా టీడీపీ నుంచి సస్పెండ్ చేయించి నియోజకవర్గం మీదా పట్టు సాధించడానికి ప్రయత్నించారు.
క్వారీలతో పాటు ఎర్రమట్టి విక్రయ దందాలు
అందులో భాగంగా నియోజకవర్గంలోని క్వారీలతో పాటు ఎర్రమట్టి అమ్మకాలు సాగించారు. ఈనేపధ్యంలో నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ దందాలపై దృష్టి సారించిన పార్టీ తాజాగా అక్కడ నియోజకవర్గ పార్టీ కార్యక్రమలు అమలు కోసం కాంట్రాక్టర్ శంకర్ రెడ్డిని రంగంలోకి దింపింది.. దీంతో నియోజకవర్గంలో సీన్ మారింది. ఆ క్రమంలో సత్యవేడులో ఫక్తు వ్యాపార రాజకీయం నడుస్తోంది. గతంలో ఉన్న కింగ్ మేకర్లు ఎమ్మెల్యేని డమ్మీని చేసి ఎర్రమట్టి అక్రమ రవాణా నడిపారనే ప్రచారం ఉంది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ అవినాష్ రెడ్డి అంతరంగికుడు అయిన ఓ లీజు దారుడికి దందా కట్టబెట్టారన్న ఆరోపణలున్నాయి. అతను ప్రభుత్వం మారాక కూడా యథేఛ్చగా అక్రమ దందా చేస్తున్న సమాచారం అధిష్టానానికి తెలిసి వారి పవర్ సెంటర్ బద్దలు కొట్టడానికి శంకర్ రెడ్డిని రంగంలోకి దింపిందని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుంది.
వైసీపీ వారికి శంకర్‌రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపణలు
అయితే శంకర్ రెడ్డి వైసిపి నుంచి కొంతమందిని టీడీపీలోకి తీసుకురావడంతో పాటు వారికి ప్రాధాన్యత ఇస్తున్నాడని టీడీపీ క్యాడర్ గుర్రుగా ఉంది. దీనికితోడు వైసిపి నుంచి వచ్చిన వారు గతంలో గ్రావెల్ దందాలో కీలక పాత్ర వహించారని తాజాగా వారు ఇప్పుడు గ్రావెల్ అక్రమంగా తరలిస్తున్నారని అంటున్నారు. ఇక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని తేలడంతో.. పార్టీ విధించిన సస్పెన్షన్ ఎత్తి వేస్తారని భావించారు. అయితే అది సాధ్యం కాదని తేలడంతో తిరుగుబాటు బావుటా ఎగరవేయడానికి సిద్దమవుతున్నారు. ఇందులో బాగంగా ప్రభుత్వం నిర్వహించే ప్రతి కార్యక్రమానికి అధికారుల కంటే ముందుగా హాజరువుతున్నారు.
ఇన్చార్జ్ వెంట వచ్చిన నరసింహయాదవ్, హేమలత
తాజాగా అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో అయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే కార్యక్రమం ముగించిన తర్వాత తిరిగి అదే వేదిక మీద టీడీపీ ఇన్చార్జ్ శంకర్ రెడ్డి, జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు అయిన నరసింహాయాదవ్ తిరిగి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే హేమలతతో పాటు అధికారులు పాల్గొన్నారు. 15వతేదిన స్వాతంత్ర దినోత్సవం నాడు ఎమ్మెల్యే ఆదిమూలం సాయంత్రం వరకు సత్యవేడు లో వేయిట్ చేసిమరీ స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించారు. అయితే అప్పటికే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సిద్దమైన శంకర్‌రెడ్డి కి అది ఇబ్బందిగా మారింది. అయితే ఎమ్మెల్యే మాత్రం స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభించి తాను ప్రజాప్రతినిధిని అని ప్రభుత్వ కార్యక్రమాలలో తనకు ప్రాధాన్యత ఉంటుందని దాన్ని ధిక్కరిస్తే ప్రివిలేజ్ కమిటికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించి టీడీపీ శ్రేణులకు షాక్ ఇచ్చారు. జడ్పీ సమావేశాలలో సైతం ఆదిమూలం ఇదే ధోరణిలో మాట్లాడాడు..అధికారులు తనకు కనీస సమాచారం ఇవ్వడం లేదని కార్యక్రమాలకు అహ్వనం పలకడం లేదని దీనిపై తాను పోరాటానికి సిద్దమని హెచ్చరించారు.
శంకర్‌రెడ్డికి తలనొప్పిగా మారిన ఆదిమూలం వైఖరి
మొత్తానికి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వైఖరి సత్యవేడులో టీడీపీ ఇన్చార్జ్ శంకర్రెడ్డికి తలనొప్పిగా మారిందంట. ప్రతిచోటా ఎమ్మెల్యే ముందుగా హాజరవుతుండటంతో అయనకు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొందంట. మరో వైపు రాష్టంలో క్లిష్ట పరిస్థితి ఎదుర్కుంటున్న వైసిపి ఆదిమూలంతో టచ్ లోకి పోయిందని అంటున్నారు. ముందుగా నియోజక వర్గంలోని దళిత వాడలనుంచి స్పందన వచ్చే విధంగా వాయిస్ వినిపించడానికి ఆదిమూలం బ్యాచ్ సిద్దమైందంట. సత్యవేడు రిజర్వుడు నియోజకవర్గం కాబట్టి మీరు ఇన్ చార్జ్‌ను పెట్టారు.. మిగతా చోట్ల ఇలాంటి పరిస్థితి ఉందా అంటు ఇప్పటికే వైసిపి నుంచి ఆదిమూలంతో పాటు టిడిపిలోకి వచ్చిన వారంతా మాట్లాడుతున్నారు.
Also Read: సీటు ఉన్నట్లా? ఊడినట్లా? టీడీపీ నేతల్లో గుబులు..
తన వర్గీయులకే ప్రాధాన్యత ఇస్తున్న శంకర్‌రెడ్డి
ఆదిమూలం నుంచి తమ అపరేషన్ ప్రారంభించి స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఎదో ఒక హాడావుడి చేయడానికి వైసీపీ ప్లాన్ చేస్తుందంట. దీంతో పాటు శంకర్ రెడ్డి వ్యవహార శైలి కూడా ఇందుకు కారణమవుతుందని అంటున్నారు. శంకర్‌రెడ్డి నియోజకవర్గంలో తన సామాజిక వర్గానికి పెత్తనం అప్పగించారని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. మొత్తం మీద ఇప్పటికైనా సత్యవేడు మీద అధిష్టానం దృష్టి సారించక పోతే మొత్తానికి నష్టపోయే పరిస్థితి ఉందని అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో..
Story By venkatesh, Bigtv