BigTV English

AP Politics: సామినేని అంతర్మథనం..

AP Politics: సామినేని అంతర్మథనం..

AP Politics: ఓటమి తర్వాత వైసీపీని వీడిన ఆ నేత పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారిందట. ఓడిన పార్టీలో ఇమడలేక ఎన్నో ఆశల నడుమ అధికార పార్టీ కూటమి వైపు అడుగులు వేస్తే అక్కడ కూడా ఊహించిన పరాభవమే ఎదురవుతుందట. అస్సలు వైసిపినీ వీడి అధికార కూటమిలో అడుగు పెట్టిన అనేత ఎవరు? ఎందుకు రాజకీయ భవిషత్తుపై ఆయనతో పాటు అనుచరవర్గం అంత ఆందోళన చెందుతోంది?


జగ్గయ్యపేట ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచిన సామినేని ఉదయభాను

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సామినేని ఉదయభాను మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.రెండు సార్లు కాంగ్రెస్ తరపున మూడుసార్లు వైసిపి తరపున పోటీ చేసిన సామినేని ఉదయభాను 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున ఎన్నికయ్యాక ప్రభుత్వ విప్ గా పనిచేశారు. 2004, 2009లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే అభ్యర్ధిగా విజయం సాధించిన సామినేని దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ శిష్యుడిగా గుర్తింపు పొందారు. ఏపీలో కాంగ్రెస్ కనుమరుగవడంతో వైసీపీలోకి అరంగేట్రం చేసిన ఆయన మూడు సార్లు వైసీపీ తరపున జగ్గయ్యపేట నుంచి పోటీ చేసిన ఆయన 2019లో ఒక్కసారి మాత్రం గెలుపొందారు.


వైసీపీలో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న సామినేని

అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న సీనియర్ నేత సామినేని ఉదయభాను కృష్ణా జిల్లా, పైగా సామాజిక సమీకరణాల నడుమ తనకు అవకాశం దక్కుతుందని భావించారు. రెండు సార్లు క్యాబినెట్లో అవకాశం లభించకపోవడంతో అలకబూనిన ఆయన ఒక దశలో వైసిపిపై తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. అయితే సీనియర్ ఎమ్మెల్యే కావడంతో మంత్రి పదవుల్లో న్యాయం జరగకపోవడంతో వైసీపీ అధిష్టానం విప్ గా అవకాశం కల్పించి తాత్కాలికంగా ఉదయభాను బుజ్జగించింది.

వైసీపీలో తనకు సముచిత స్థానం దక్కలేదని ఆగ్రహం

వైఎస్ సన్నిహితుడు, పైగా సీనియర్ నేత అయిన సామినేని ఉదయభాను మంత్రి పదవి రాలేదన్న బాధ, సముచిత స్థానం ఇవ్వలేదన్న ఆగ్రహంతో ఉన్నా అయిష్టంగానే వైసీపీలో కొనసాగుతూ వచ్చారు. 2024 లో వైసీపీ తరపున జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి పోటీ ఉదయభాను మరోసారి ఓటమి పాలయ్యారు. ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని, తనకు న్యాయం చేస్తారని భావించిన ఆయన, చివరికి వైసీపీ ఘోర పరాజయం పాలవ్వడంతో పొలిటికల్ ఫ్లాట్‌ఫాం కోసం వైసీపీనీ వీడి జనసేన జెండా కప్పుకున్నారు.

వైసీపీనీ వీడి జనసేన జెండా కప్పుకున్న సామినేని

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాగూ న్యాయం జరగలేదు , ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి పార్టీలోకి అయిన వెళ్తే న్యాయం జరుగుతుందని వైసీపీనీ వీడి జనసేన జెండా పట్టుకుంటే ఇప్పుడు సామినేని ఉదయభాను పరిస్థితి రెండికి చెడ్డ రేవడిలో తయారైందంట. ఎన్నికల తర్వాత వైసీపీ జెండాను వదిలి జనసేన జెండా పట్టిన నాటి నుంచి సామినేని ఉదయభానుకు బాలారిష్టాలు వెంటాడుతూనే ఉన్నాయట. ఓటమిపాలైన వైసీపీలో ఉండే కంటే కూటమిలో పోటీ చేసి గెలిచిన పార్టీలో చేరితే నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంటుందని భావించారట. అనుకున్నదే తడవుగా మంది మార్బాలంతో కలిసి జనసేన పార్టీలో చేరిన ఆయనకు మూడు అడుగులు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి వేయాల్సిన పరిస్థితి నెలకొందని ఆందోళన చెందుతున్నారట. జగ్గయ్యపేటలో మిత్ర పక్షంగా ఉన్న జెనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడుగా పెత్తనం చేయవచ్చని భావించిన ఉదయభానుకు ఇప్పుడు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయట. ఓడినా గెలిచినా నియోజవర్గం ఎమ్మెల్యే తర్వాతే ఎవరైనా అంటున్నారట నియోజకవర్గంలోని అధికారులు, అధికార పార్టీలోని కొందరు నేతలు. టీడీపీ, జనసేనల మధ్య ఉన్న నామినేటెడ్ పదవుల ఒప్పందం లెక్కలు సైతం ఇప్పుడు ఉదయభాను వరకు చేరడం లేదట.

Also Read: అసలు క్లౌడ్ బరస్ట్ ఏంటి..? దీనికి గల కారణాలేంటి..?

కనీస ప్రోటోకాల్ పాటించడం లేదని అంతర్మధనం

పైగా అధికార పార్టీలో మిత్ర పక్షంగా ఉండి, మాజీ ఎమ్మెల్యేని అయినప్పటికీ ప్రోటోకాల్ కోసం కూడా ఏ కార్యక్రమానికి ఆహ్వానం పలకడం లేదని, నియోజకవర్గంలో తన మాట ఎక్కడ కూడా చెల్లుబాటు కావడం లేదని మధన పడిపోతున్నారంట. వైసీపీనీ వీడి తప్పు చేశానా అని అనుచరుల దగ్గర సామినేని ఉదయభాను వాపోతున్నారంట. . సామినేని వెంట నడిచిన వారిలో కొందరు ఇటీవల తిరిగి సొంత పార్టీ వైసీపీ గూటికి చేరుతూ ఉండటంతో ఆయన పునరాలోచనలో పడినట్లు చెప్తున్నారు. మొత్తానికి వైసీపీనీ వీడి జనసేన లో చేరిన న్యాయం మాత్రం జరగలేదని సామినేని ఉదయభాను భావిస్తున్నారట. చూడాలి మరి భవిషత్తులో సామినేని ఉదయభాను అడుగులు ఎటు పడతాయో.

Story By Rami Reddy, Bigtv

Related News

Satyavedu Politics: మారిన ఆదిమూలం స్వరం.. భయమా? మార్పా?

MLA Report: సీటు ఉన్నట్లా? ఊడినట్లా? టీడీపీ నేతల్లో గుబులు..

Vote Chori: రాహూల్ Vs ఈసీ.. అసల సమస్య ఇదే.! ఎవరి వాదన కరెక్ట్.? ఈ 65 లక్షల ఓట్లు మళ్లీ అప్‌‌లోడ్..!

BJP Leaders Fights: డీకే అరుణ Vs శాంతి కుమార్.. పాలమూరు బీజేపీలో పంచాయితీ

TG Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం.. కేసీఆర్ మైండ్ గేమ్

Big Stories

×