BigTV English

Nagarjuna Remuneration: బిగ్ బాస్ 9తో నాగార్జున సరికొత్త రికార్డు.. ఈ సారి అన్ని కోట్లా? కింగ్ అనిపించుకున్నాడుగా!

Nagarjuna Remuneration: బిగ్ బాస్ 9తో నాగార్జున సరికొత్త రికార్డు.. ఈ సారి అన్ని కోట్లా? కింగ్ అనిపించుకున్నాడుగా!

Nagarjuna Remuneration For Bigg Boss: అక్కినేని నాగార్జున ‘బిగ్ బాస్’తో రియల్ కింగ్ అనిపించుకుంటున్నారు. ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హోస్ట్‌గా సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. నాగార్జున ఇప్పటికే 7 సీజన్లకు హోస్టుగా వ్యహరించిన సంగతి తెలిసిందే. ఫస్ట్ సీజన్‌కు ఎన్టీఆర్.. ఆ తర్వాతి సీజన్‌కు నాని హోస్టుగా వ్యవహరించారు. ఆ తర్వాత నాగార్జున ఆ బాధ్యతను తన భుజాన్న ఎత్తుకున్నారు. అప్పటి నుంచి విజయవంతంగా బిగ్ బాస్‌ను నడిపిస్తున్నారు. దీంతో ఆయన మరింత క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. అంతేకాదు.. ఈ షోను నిర్వహిస్తున్నందుకు భారీ మొత్తాన్నే వెనకేసుకున్నారని టాక్.


ఏ సీజన్‌కు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారంటే?

Bigg Boss Telugu Season 3 (2019): నాగార్జున ఒక్కో ఎపిసోడ్‌కు సుమారు రూ.10 లక్షలు నుంచి రూ.12 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. ఆయనకు సుమారు రూ.8 కోట్లు నుంచి రూ.10 కోట్లు రెమ్యునరేషన్‌గా అందినట్లు తెలిసింది.

Bigg Boss Telugu Season 4 (2020): వాస్తవానికి నాగ్ 3వ సీజన్ తర్వాత బిగ్ బాస్‌లో కొనసాగేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదని తెలిసింది. దీంతో నిర్వాహకులు ఆయన రెమ్యునరేషన్ పెంచడమే కాకుండా.. ఆయన కాల్ షీట్స్‌కు తగినట్లుగా మార్పులు చేశారని సమాచారం. సీజన్ 4లో ఎపిసోడ్స్ కోసం రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు అందుకున్నారని తెలిసిందే. మరికొన్ని రిపోర్టుల ప్రకారం.. మొత్తం సీజన్‌ కోసం ఆయన రూ.12 కోట్ల నుంచి రూ.15 కోట్లు అందుకున్నట్లు సమాచారం.


Bigg Boss Telugu Season 5 (2020): ఈ సీజన్ కోసం నాగార్జున ఒక్కో ఎపిసోడ్‌కు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. మరికొన్ని రిపోర్టుల ప్రకారం.. మొత్తం సీజన్ కోసం ఆయన రూ.15 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు అందుకున్నట్లు తెలిసింది.

Bigg Boss Telugu Season 6 (2022): ఈ సీజన్ కోసం నాగార్జున ఒక్కో ఎపిసోడ్‌కు రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. మొత్తం సీజన్ కోసం ఆయన రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్లు అందుకున్నారని తెలిసింది.

Bigg Boss Telugu Season 7 (2023): ఈ సీజన్ కోసం నాగార్జున ఒక్కో ఎపిసోడ్‌కు రూ.25 లక్షల వరకు తీసుకున్నారని సమాచారం. మరికొన్ని రిపోర్డుల ప్రకారం.. ఆయన మొత్తం సీజన్ కోసం రూ.25 కోట్ల నుంచి రూ.28 కోట్లు తీసుకున్నారని తెలిసింది.

Bigg Boss Telugu Season 8 (2024): ఈ సీజన్ కోసం నాగార్జున ఒక్కో ఎపిసోడ్‌కు రూ.30 లక్షల వరకు తీసుకున్నట్లు తెలిసింది. సీజన్ మొత్తానికి ఆయన రూ.30 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

Bigg Boss Telugu Season 9 (2025): ఇక తాజాగా మొదలైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కోసం నాగ్‌కు ఈసారి రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం వరుస హిట్లతో ఊపులో ఉన్న నాగార్జునకు ఈ సారి గట్టిగానే పారితోషికం ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ సారి ఏకంగా రూ.40 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందించే అవకాశాలున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎంతకైన మన సైమన్ ‘కింగ్’డమ్‌కు ఉండే పవరే వేరు కదా. అందుకే దక్షిణాదిలో ఏ టీవీ హోస్టుకు ఇవ్వనంత రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.

సల్మాన్ ఖాన్ రికార్డు బద్దల కొట్టడం కష్టమే: అయితే, కండల వీరుడు.. హిందీ బిగ్ బాస్ హోస్ట్ సల్మాన్ ఖాన్‌ను రికార్డును చేరుకోవడం ప్రస్తుతం ఏ హోస్టుకు సాధ్యం కాదు. ఆయన సీజన్‌కు రూ.150 కోట్ల చొప్పున రెమ్యునరేషన్ అందుకుంటున్నాడట. సల్లూ భాయ్ అంటే ఆ మాత్రం ఉంటాది మరి.

Related News

Bigg Boss 9 Prize Money: ఆహా.. ఈ సారి అదిరిపోయే ప్రైజ్ మనీ.. అందుకే గోప్యంగా ఉంచారా? విన్నర్‌కు పండగే!

Commoners vs Celebrities : రెండు ఇళ్ల పంపకం… ఎవరికి ఏ ఇళ్లు ఇచ్చారంటే?

Bigg Boss 9 Telugu : హౌస్ లోకి ఫోక్ సింగర్.. అప్పుడు మిస్ వరల్డ్.. ఇప్పుడు బిగ్ బాస్..

Bigg Boss Telugu season 9: ఆ కేసులో అరెస్ట్ అయిన హీరోయిన్ అక్క… 10వ కంటెస్టెంట్ గా హౌస్ లోకి

Bigg boss 9 Telugu: 9వ కంటెస్టెంట్ గా మూడవ కామనర్.. పుషప్స్ తో పిచ్చెక్కిస్తూ!

Big Stories

×