BigTV English
Advertisement

Bigg Boss 9 Day 50: నామినేషన్స్ ఫైర్.. కళ్యాణ్ ఫిల్టర్ గేమర్.. తనూజ చేసిన పనికి దిమ్మతిరిగిందన్న ఇమ్మూ

Bigg Boss 9 Day 50: నామినేషన్స్ ఫైర్.. కళ్యాణ్ ఫిల్టర్ గేమర్.. తనూజ చేసిన పనికి దిమ్మతిరిగిందన్న ఇమ్మూ


Bigg Boss 9 Day 50 Episode Review: రోజురోజుకు బిగ్ బాస్ షో ఆసక్తిగా మారుతుంది. ఈ రోజు 50వ రోజుకి వచ్చేసింది షో. నేటితో ఎనిమిదో వారంలోకి అడుగుపెట్టింది. ఈ వారం కెప్టెన్ గా ఇమ్మాన్యుయేల్ నిలిచాడు. ఇక వీకెండ్ ఎపిసోడ్ అయిపోయి ముగిసి సోమవారం వచ్చేసింది. మండే అంటేనే నామినేషన్స్. ఈ వారం నామినేషన్స్ మామూలుగా లేదు. బయటకు వెళ్లిన కంటెస్టెంట్స్ పిలిచి మరి పొడిపించారు. ఈ రోజు మొదటి నామినేషన్ ప్రియతో మొదలైంది.

అది ఫన్నీ కాదు.. ప్రియ ఫైర్

హౌజ్ లోకి రాగానే సంజనను నామినేట్ చేసింది. హౌజ్ లో అందరిని ఇష్టం వచ్చినట్టు మాటలు అంటున్నావ్. రోడ్ రోలార్ అనడం, ఆ తర్వాత నేను కూడా రోడ్ రోలార్ నే అంటూ నవ్వడం ఇదంత ఫన్నీగా ఉందా మీకు. బాడీ షేమింగ్ చేయడం సహించరానిది ఇకనైనా నోరు అదుపులో పెట్టుకో అంటూ ప్రియ సంజనను నామినేట్ చేసింది. మరో కత్తిని కళ్యాణ్ పడాలకు ఇచ్చింది. అతను రాము రాథోడ్ చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడవని దాని నుంచి బయటపడని రియల్ గేమ్ ఆడమంటూ నామినేట్ చేశాడు. టాస్క్ ల్లోనూ పనిమాలిన నిర్ణయాలు తీసుకుని ఓడిపోయావని వాంటెడ్ పేట టాస్క్ టీం మారడంపై కళ్యాణ్ రాము రాథోడ్ ని టార్గెట్ చేశాడు. ఆ తర్వాత మర్యాద మనీష్ ఎంట్రీ ఇచ్చాడు. అతడు నేరుగా కళ్యాణ్ ని నామినేట్ చేశాడు. నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావని, కెప్టెన్ అయిన నిన్ను పట్టించుకోని మాధురిని నామినేట్ చేయలేదు.. తనూజని చెప్పి తనూజని చేయలేదు.


ఫిల్టర్ గేమ్ వద్దు

ఇద్దరిలో ఎవరిని చేయకుండ సంజనని నామినేట్.. అది కూడా ఇన్ వాలిడ్ పాయింట్. అక్కడంత నువ్వు ఫిల్డర్ గేమ్ ఆడినట్టు కనిపిస్తుంది. దాని నుంచి బయటకు రా అంటూ కళ్యాణ్ ని నామినేట్ చేశాడు మనీస్. మరో కత్తిని ఇమ్మాన్యుయేల్ కి ఇచ్చాడు. తనూజ తన నిర్ణయంప కూడా తను ఉండటం లేదని, మొదట ఒక రీజన్ చెప్పి ఆ తర్వాత నిర్ణయం మార్చేసుకుంటుంది. తను ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు. తనని టార్గెట్ చేసి ఆయేషాని నామినేట్ చేస్తా అని చెప్పిన తనూజ.. నాగ్ సర్ లేపి అడగ్గానే.. ఆమె నామినేషన్ పవర్ అస్త్రా అర్హురాలు అని చెప్పింది. అప్పుడే ఓ క్షణం నాకు దిమ్మతిరిగింది. తనూజ మాటల వల్ల తాను కన్ఫ్లూజన్ ఉండిపోయాయి. ఆ లోపే మాట మార్చి అనడం షాక్ అనిపించింది. బొమ్మలా టాస్క్ ల్లో అంత నాకు సపోర్టు చేసి చివరిలో రాముకి ఇచ్చింది అంటూ తనూజని ఇమ్మాన్యుయేల్ నామినేట్ చేశాడు.

సుమన్ వర్సెస్ సంజన

నెక్ట్స్ ఫ్లోరా వచ్చింది. రీతూని నామినేట్ చేసింది. ఫ్లోరా సైనీ నామినేట్ రీతూ. దాని రీజన్ చాలా సిల్లీగా ఉంది. తనూజ పడిపోయినప్పుడు కళ్యాణ్ ఏడ్చాడు. పక్కన ఉన్న రీతూ పడి పడి నవ్విందని, వచ్చినప్పటి నుంచి ఫేక్ గేమ్, ఫేక్ రిలేషన్స్ గేమ్ గెలవాలని చూస్తుందని నామినేట్ చేసింది. మరో కత్తిని సుమన్ శెట్టికి ఇచ్చింది. అతను సంజనను నామినేట్ చేశాడు. డస్టిన్ బిన్ విషయంలో తను మాట్లాడిన తీరు నచ్చలేదని, అక్కడ మీరు అనవసరంగా గొడవపడ్డారు. అని నామినేట్ చేశాడు. అప్పుడే సారీ చెప్పాను కదా అంటే చెంపపై లాగి పెట్టి కొట్టి ఆ తర్వాత సారీ అంటే ఎలా ఉంటుంది. నువ్వు అనాల్సినవి అన్ని అని సారీ అంటావు అది నీకు అలవాటు అయిపోయింది అంటాడు. ఆ తర్వాత బ్రేక్ టైంలో హౌజ్ లో సుమన్ దగ్గరి వెళ్లి గొడవ ఆడింది. నువ్వు అసమర్థుడివి కెప్టెన్ అయ్యి ఉండి డబ్బులు కొట్టేశావు.. నీ వల్ల గేమ్ మొత్తం పాడైంది అంటూ సుమన్ శెట్టిపై విమర్శలు గుప్పించింది. దీంతో అది బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్. నువ్వు 420.. నేను రాబిన్ హుడ్ అంటూ తిరిగి సంజనకు కౌంటర్ ఇచ్చాడు.

నిజంగానే అమ్మాయిల పిచ్చోడివా?

ఇక దమ్ము శ్రీజ వచ్చేసింది. తన నామినేషన్ ఒకరైతే ఆమె ముగ్గురిని టార్గెట్ చేసింది. కానీ, బిగ్ బాస్ వార్నింగ్ ఇవ్వడంతో అసలు నామినేషన్ కి వచ్చింది. కళ్యాణ్.. నీ క్యారెక్టర ని చంపిన రమ్య, మాధురిలను నామినేట్ చేయలేదు. తనూజని చేస్తాని ఇమ్మాన్యుయేల్ దగ్గర స్లిప్ తీసుకుని ఆమె చేయలేదు. అసలు నీ గేమ్ ఏంటి. నీ గురించి అంత చీప్ గా మాట్లాడిన వాళ్లని వదిలేసి తుప్పాస్ రీజన్ తో సంజనను నామినేట్ చేశావు. దాని వల్ల బయటకు నిన్ను నిజంగా అమ్మాయిల పిచ్చోడు అంటున్నారంటూ కళ్యాణ్ ని నామినేట్ చేసింది. మరో కత్తిని మాధురికి ఇవ్వగా.. ఆమె డిమోన్ తో ఫేక్ రిలేషన్ నడిపిస్తున్నావని, హౌజ్ లో ఎప్పుడు ఒకరి సపోర్టుతో ఆడి గెలవాలని చూస్తున్నావంటూ రీతూని నామినేట్ చేసింది. దీంతో సోమరం నామినేష్ లో మాధురి, రీతూ, కళ్యాణ్, సంజన, తనూజ, రాము రాథోడ్ లు నామినేషన్ లో నిలిచారు. మరిన్ని నామినేషన్స్ రేపటి రోజుకు కొనసాగుతుంది.

Related News

Bigg Boss 9 Day 50 Highlights: శ్రీజ ఓవరాక్షన్.. మాధురి, తనూజలపై సెటైర్లు.. నోరుమూయించిన బిగ్ బాస్

Bigg Boss 9: సుమన్ వర్సెస్ సంజన.. మీరు అసమర్థుడైన కెప్టెన్.. సంజనను 420 అన్న శెట్టి…

Bigg Boss 9 : తెలుగు రాని వాళ్లని తీసుకువస్తే ఇలాగే ఉంటుంది.. అసలు షో చూస్తున్నావా ఫ్లోరా?

Madhuri Vs Ritu: మీది అన్‌హెల్తీ బాండ్.. రీతూ, పవన్‌ దోస్తీపై దివ్వెల మాధురీ కామెంట్స్‌.. నెటిజన్స్‌ రియాక్షన్‌ చూశారా!

Naga Babu-Bharani: భరణి రీఎంట్రీ వెనుక మెగా బ్రదర్‌ హస్తం.. అసలు సంగతేంటంటే!

Bigg Boss 9 Promo: నువ్వు అమ్మాయిల పిచ్చోడివా.. కళ్యాణ్‌ని పొడిచిన శ్రీజ

Bigg Boss 9 Telugu: శ్రీజ, భరణిల రీఎంట్రీ కన్‌ఫాం.. ఇక రచ్చ రచ్చే!

Big Stories

×